ఢిల్లీ: స్పీకర్ ఎన్నిక జరిగిన కాసేపటికే లోక్‌సభలో ఇవాళ గందరగోళం నెలకొంది. స్పీకర్‌గా తిరిగి ఎన్నికైన ఓం బిర్లా సభలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో దుమారం రేగింది.
బుధవారం ఉదయం మూజువాణీ ఓటింగ్ ద్వారా ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గెలిచి.. స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు అధికార, విపక్ష కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా తొలి ప్రసంగం చేస్తూ.. ఎమర్జెన్సీ పాలనను ప్రస్తావించారు. ఎమర్జెన్సీ పాలన చీకటీ రోజలని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికార పక్ష సభ్యులు సైతం పోటీగా నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. తిరిగి రేపు( జూన్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రేపు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment