Seemandhra MPs
-
ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...?
అనంతపురం: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని.. లేకపోతే సీమాంధ్ర ఎంపీలకు హిజ్రాలతో స్వాగతం చెబుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లక్షల మందిని ఆహ్వానించిన ప్రభుత్వం ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 27 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సూచించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అప్పుడు మిగతా ఎంపీలు ఏమయ్యారు?
ట్వీటర్లో పవన్ కల్యాణ్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై మాటల దాడిని కొనసాగించారు. ఇటీవల పవన్ చేసిన విమర్శలపై పలువురు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ట్వీటర్లో స్పందిస్తూ సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్రంపై చూపాలన్నారు. తాజాగా గురువారం ఎంపీలపై విమర్శలను కొనసాగించారు. ‘‘గత మార్చి 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తెచ్చిన సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారు? నాకున్న సమాచారం మేరకు ఈ చర్చలో అయిదుగురు ఎంపీలే పాల్గొన్నారు. మిగతా ఎంపీలు ఎక్కడికెళ్లారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్లో జరిగిన చర్చలో ఎవరెవరు పాల్గొన్నారన్న విషయాన్ని చెప్పడానికి పవన్ తన ట్వీటర్లో పీఆర్ఎస్ఐ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ను ఇచ్చారు. అయితే అది పనిచేయడం లేదు. -
తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఒక్కటైన వేళ
* శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రాజ్యసభలో కొనసాగిన ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మూడో రోజూ ఆందోళన కొనసాగింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ తాను విమానాశ్రయ పేరు మార్పు అంశంపై నోటీసు ఇచ్చానని, మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభాపతి స్థానంలో కూర్చున్న ఉప సభాపతి కురియన్ తొలుత నిరాకరించినా, వీహెచ్ పదే పదే కోరడంతో అనుమతించారు. ‘అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఆరేడేళ్ల తరువాత వాళ్లు ఈ పనికి దిగారు. వాళ్లు రాజకీయ ప్రయోజనాలను కాంక్షించే ఈ చర్యకు దిగారు..’ అని వివరించబోతుండగా డిప్యూటీ చైర్మన్ కల్పించుకుని ‘నేను చెప్పేది ఒకసారి వినండి’ అంటూ పలుమార్లు వీహెచ్‌కు సూచించారు. ‘ముందురోజు ఆర్థిక మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. మీరు ఇప్పుడు జీరో అవర్‌లో తిరిగి చర్చించలేరు. అవసరమైతే మీరు మరో నోటీసుతో రండి’ అని కోరారు. అయినప్పటికీ వీహెచ్ వినలేదు. ఆయనకు తోడు ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్ తదితర తెలంగాణ ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కె.చిరంజీవి, కె.వి.పి. రామచంద్రరావు, జేడీ శీలం, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పేరును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో 11.07 గంటలకు పది నిమిషాలపాటు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది. ఈ సమయంలోనే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ కేంద్రం ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని కోరారు. 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే మళ్లీ ఆందోళనను కొనసాగించారు. సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో సభను 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. కాగా సాయంత్రం ఇదే అంశమై ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి స్పెషల్ మెన్షన్ కింద మాట్లాడుతూ తక్షణం శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ డ్రామానా?
-
లోక్‌సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసన
-
రేపు లోక్‌సభలో బిల్లును అడ్డుకుంటాం: చిరంజీవి
-
లోక్‌సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసన
న్యూఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలు తమ గళం విప్పారు. సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లం రాజు, పురందేశ్వరి, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ నిరసన తెలియచేస్తున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ వెల్లోనికి దూసుకు వెళ్లిన సీమాంధ్ర ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, బొత్స ఝాన్సీ ఆందోళన కొనసాగిస్తున్నారు. -
తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం: కావూరి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం అని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఆయన నివాసంలో జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారు అని కావూరి మండిపడ్డారు. సస్పెన్షన్ ధర్మబద్దంగా జరగలేదని స్పీకర్ మీరాకుమార్ కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు లేఖ రాశారు. సవరణలను ముందే బిల్లులో చేర్చాలని సీమాంధ్రమంత్రులు డిమాండ్ చేశారు. సవరణలు బిల్లులో పెట్టకుంటే మంత్రులందరం వెల్‌లోకి వస్తాం అని కేంద్ర మంత్రి కావూరి హెచ్చరించారు. లోక్‌సభ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేయాలి కావూరి కోరారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తారని భావిస్తున్నానని కావూరి ఆశాభావం వ్యక్తంచేశారు. -
సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్నారెందుకు?
పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా గురువారం చోటు చేసుకున్న దాడిలో మొదట సీమాంధ్ర ఎంపీలే తెలంగాణ ఎంపీలు విజయశాంతి, రమేష్ రాథోడ్‌లపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్లో దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్‌లను బయట పెట్టాలని ఆయన లోక్‌సభ అధికారులను డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లప్పుడు నోటి వెంట వచ్చే సమన్యాయం అనే పదానికి బాబు వివరణ ఇవ్వాలని బాబుకు సూచించారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన సమయంలో సభలో చర్చించవద్దని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని గతంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసిన సంగతిని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకున్న ఎంపీలను సస్పెండ్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఉండవల్లిని ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు -
‘శాంతింపజేస్తే బిల్లుకు సహకరిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే సోమవారం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తమ పార్టీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సి.ఎం.రమేశ్‌లు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. సీమాంధ్రులను శాంతపరిచి బిల్లు పెడితే సహకరిస్తామని మోదుగుల పేర్కొన్నారు. యథావిధిగా ‘తమ్ముళ్ల’ తలోమాట సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో గురువారం చోటుచేసుకున్న సంఘటనలపైనా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు యథావిధిగా ఎవరి డిమాండ్లు వారు వినిపించారు. టీడీఎల్పీలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ సమైక్య భారత్‌ను కోరుకునే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించటం బాధకరమన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ ప్రకటనను తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పార్టీని పెట్టించటం ద్వారా సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో లబ్ధికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీలను బహిష్కరించిందన్నారు. బల్లి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ టీ డీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ రమేష్ రాథోడ్‌లపై అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భవన్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు లోక్‌సభలో దాడిచేసుకోవటం బాధాకరమన్నారు. టీడీఎల్పీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టతను మంట కలిపిన ఎంపీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్ గూండాగిరి
* సీమాంధ్ర ఎంపీల ధ్వజం * ఇతర రాష్ట్రాల ఎంపీలను పెట్టి కొట్టించారు * కాంగ్రెస్ చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారు * టెన్ జనపథ్ నుంచే ఫ్లోర్ మేనేజ్మెంట్ * లోక్‌సభ వీడియోలను ప్రజల ముందుంచుతాం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరింపజేసి తమపై దాడి చేయించారని వాపోయారు. విభజన బిల్లు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో పోలిస్తే లోక్‌సభలో లగడపాటి రాజగోపాల్ చేసిన పని చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ను సజావుగా నడపాల్సిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కాంగ్రెస్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో ఎవరు ఎవరిపై దాడి చేశారో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరనే విషయంపై లోక్‌సభ వీడియో పుటేజీలను సేకరించి ప్రజల ముందుంచుతామని తెలిపారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం ఉదయం ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, జి.హర్షకుమార్, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై గంటకుపైగా చర్చించారు. లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలకు తమను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నందున వాస్తవాలను బయటపెట్టేందుకు లోక్‌సభ వీడియో దృశ్యాలను సేకరించాలని నిర్ణయించారు. దీంతోపాటు విభజన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి వివరించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ మూడూ సవరిస్తే విభజనకు ఓకే: కావూరి రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం ఉండాలి. ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు విడదీస్తున్నారు? మేము ప్రతిపాదించిన మూడు సవరణలకు కేంద్రం సోమవారంలోగా అంగీకరిస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటైనా యూటీ చేయాలి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి. వీటిని అంగీకరించకపోతే తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. నేనూ సిగ్గుపడుతున్నా: లగడపాటి లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అలాంటి చర్యలు ఎవరు చేసినా ఆక్షేపణీయమే. అందుకు నేను సిగ్గుపడుతున్నా. నిన్నటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియాల్సిన అవసరముంది. మాపై దాడి చేయడానికి వందమంది ఎంపీలు వచ్చారు. నా సహచర ఎంపీపైనా దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసమే పెప్పర్‌స్ప్రే ఉపయోగించాను. మమ్మల్నే ఎందుకు సస్పెండ్ చేశారు?: హరి కాంగ్రెస్ అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టింది. గురువారం సుమారు వందమంది ఎంపీలు వెల్‌లోనే ఉండి ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు? పార్లమెంట్ ఏమైనా జన్‌పథ్ అనుకుంటున్నారా? జన్‌పథ్ నుంచి పంపిస్తే తెలుస్తుంది: హర్షకుమార్ రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని హైదరాబాద్ నుంచి పంపుతామంటున్నారు. మిమ్మల్ని (సోనియాగాంధీని ఉద్దేశించి) జన్‌పథ్ నుంచి పంపితే ఎంత బాధ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ అంతా జన్‌పథ్ నుంచే నడిస్తోంది. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. సీట్ల కోసం విభజిస్తారా?: సాయిప్రతాప్ తెలంగాణలో సీట్లు రావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతిపక్షాలకు తెలీకుండా పార్లమెంట్లో బిల్లును పెడుతున్నారు. ఇంతకంటే అప్రజాస్వామిక చర్య ఏముంటుంది? సస్పెన్షన్ ఎత్తివేయండి స్పీకర్‌కు లగడపాటి, సబ్బం లేఖలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నిర్హేతుకం, అన్యాయమైనదని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పేర్కొన్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వేర్వేరుగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి నిజమైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటు విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇద్దరు సభ్యులు విడివిడిగా లేఖలు రాశారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో నిన్న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యచరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
పక్కా ప్లాన్‌తో సీమాంధ్ర ఎంపీలకు చెక్
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఎవరేమన్నా లెక్కచేయకుండా తన మాట నెగ్గించుకుంది. తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం పక్కాప్రణాళిక అమలు చేసింది. బిల్లును ఎప్పుడు పెడతామనేది ముందుగా చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇవాళ, రేపు అంటూ అంటూ నెట్టుకొచ్చిన యూపీఏ సర్కారు అనూహ్యంగా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సీమాంధ్ర ఎంపీలు, ప్రధాన ప్రతిక్షం గట్టిగా వ్యతిరేకించినా లెక్కచేయకుండా మొండిగా వ్యవహరించి బిల్లును సభలో పెట్టింది. సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహం అమలు చేసింది. ముందుగానే పథకం రచించి వారిని అడ్డుకుంది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో సుశీల్ కుమార్ షిండేకు రక్షణగా 25 మంది ఎంపీలు నిలిచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మిగతా ఎంపీలను పెద్ద సంఖ్యలో మోహరించింది. బిల్లుతో సంబంధం లేని ఎంపీలను కూడా స్పీకర్ పోడియం వద్దకు పంపించి సీమాంధ్ర ఎంపీలు అక్కడకు రాకుండా జాగ్రత్త పడింది. సభలో ఘర్షణ వాతావరణం ఉన్నా వెనక్కి తగ్గకుండా బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళ్లింది. ప్రభుత్వ మొండి వైఖరితో సీమాంధ్ర ఎంపీలు తీవ్రచర్యలకు దిగారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆందోళనలకు దిగారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో మిరియాల పొడి చల్లి సంచలనం సృష్టించారు. దీంతో సభలో ఒక్కసారిగా అయోమయ పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్లమెంటరీ సెక్రటరీ మైకు విరిచేసి బీభత్సం సృష్టించారు. మిగతా ఎంపీలు బల్లపైకి ఎక్కి ఆందోళనలు చేశారు. సీమాంధ్ర ఎంపీలను తెలంగాణ సభ్యులు అడ్డుకోవడంతో లోక్‌సభ రణరంగాన్ని తలపించింది. చేసింతా చేసి తమకేమీ తెలియనట్టుగా వ్యవహరించింది. 18 మంది ఎంపీలను సభను నుంచి ఐదు రోజుల పాటు బహిష్కరించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యూపీఏ సర్కారు పట్టించుకోవడం లేదు. -
సభలో అసలేం జరిగింది?
లోక్‌సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది. స్పీకర్ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు. ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు. లోక్‌సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు. తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్‌సభ అధికారులు తెలిపారు. లోక్‌సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు. తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్ సిబల్ అన్నారు. -
వ్యూహాత్మకంగానే ముందుకెళ్లిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వూహాత్మకంగానే ముందుకెళ్లింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తే వారిని అడ్డుకునేందుకు ముందుగానే పథకం రచించింది. హోంమంత్రి సుశీల్ కుమాఱ్ షిండే బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా 25 మందికి పైగా ఎంపీలు రక్షణగా నిలిచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మిగతా ఎంపీలకు పురమాయించటం జరిగింది. తెలంగాణ అంశంతో సంబంధం లేని ఎంపీలు కూడా పోడియం వద్ద సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్న విషయం తెలిసిందే. సభలో ఘర్షణ వాతావరణం ఉన్నా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు సభలో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ మొండి వైఖరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముగ్గురు ఎంపీలను అస్ప్రతికి తరలింపు
-
లోక్‌సభలో మిరియాల పొడి స్ప్రే చేసిన లగడపాటి
-
లోకసభలో మిరియాల పొడి స్పే చేసిన లగడపాటి
విజయవాడ: విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలకలం రేపారు. సభలో మిరియాల పొడి స్ప్రే చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో అయోమయం నెలకొంది. మంటలు వస్తాయనే భయంతో సభ్యులు బయటకు పరుగులు తీశారు. కళ్లలోంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. అక్కడితో ఆగకుండా కంప్యూటర్ను లగడపాటి ధ్వంసం చేశారు. పెప్పర్ స్ప్రే తో ఇబ్బందులకు గురైన ఎంపీలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మైకులు విరిచేశారు. ఆయనను తెలంగాణ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకునే యత్నం చేశారు. ఇరుప్రాంతాల నేతలు బాహాబాహికి దిగారు. -
లోక్‌సభ రణరంగం
అట్టుడికిన దిగువ సభ సమైక్యాంధ్ర నినాదాల నడుమ రైల్వే బడ్జెట్ ప్లకార్డులు చేతబూని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన సీమాంధ్ర ఎంపీలతో పాటు వెల్‌లోకి కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, కోట్ల, పురందేశ్వరి.. పల్లంరాజు, కృపారాణిల సంఘీభావం సీట్లకే పరిమితమైన కిశోర్‌చంద్రదేవ్, పనబాక లోక్‌సభ సిబ్బంది వద్ద కాగితాలు చింపేసిన శివప్రసాద్.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మందా తీవ్ర వాగ్వివాదం, తోపులాటతో ఘర్షణ వాతావరణం టీ ఎంపీల రక్షణ వలయంలో 12 నిమిషాలకే ప్రసంగం ముగించిన ఖర్గే సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా సమైక్య, తెలంగాణ నినాదాలతో దద్దరిల్లుతున్న లోక్‌సభ బుధవారం రణరంగాన్ని తలపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర సభ్యులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సైతం వెల్‌లో ఆందోళనకు దిగారు. సీమాంధ్ర టీడీపీ, తెలంగాణ ప్రాంత ఎంపీ మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ముందెన్నడూ లేనివిధంగా రైల్వేబడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంత ఎంపీలు రక్షణగా నిలబడిన నేపథ్యంలో.. తీవ్ర గందరగోళం మధ్య రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే సుమారు 12 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. చివరకు మిగతా ప్రసంగ పాఠాన్ని చదివినట్టుగానే భావించాలని ప్రకటించి కూర్చుండిపోయూరు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే వైఎస్సార్సీపీ సభ్యులు, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. దీంతో మూడు నిమిషాల్లోనే సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత.. అవిశ్వాస తీర్మానాలపై వైఎస్సార్సీపీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన ప్రక్రియను సభ అదుపులో లేనందున చేపట్టలేకపోతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందుంచారు. వెల్‌లో ఉద్రిక్తత: 12.08కి రైల్వే మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని సభాపతి ప్రకటించారు. దీంతో ఖర్గే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లో ఆందోళనకు దిగారు. ‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్’ అనే ప్లకార్డులతో నినదించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, రైల్వే సహాయమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ సమక్షంలోనే వెల్‌లోకి వెళ్లారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ సీమాంధ్ర సభ్యులు నినాదాలు చేశారు. కావూరిని ఉద్దేశించి సోనియూ ‘యూ ఆర్ ఏ మినిస్టర్..’ అనడం విన్పించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని ఉద్దేశించి కూడా సోనియూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా సీమాంధ్రకే చెందిన మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి తమ స్థానాల్లో నిలబడి సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మంత్రులు కిశోర్‌చంద్ర దేవ్, పనబాక లక్ష్మిలు మాత్రం తమ సీట్లలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన రాష్ట్ర ఎంపీలు రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నించారు. వారినుంచి రైల్వే మంత్రికి ఇబ్బంది ఎదురవకుండా తెలంగాణ ఎంపీలు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. మరోవైపు ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు తమ తమ రాష్ట్రాల సమస్యలపై కూడా ఇదే సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం, ఒకింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుడు ఎన్.శివప్రసాద్ లోక్‌సభ సిబ్బంది వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న కాగితాలను చింపేశారు. పెన్నులు లాగేశారు. టీఆర్ఎస్ సభ్యుడు మందా జగన్నాథం శివప్రసాద్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒకదశలో వారిద్దరూ పరస్పరం కలబడినంత పనిచేశారు. జేడీ(యూ) నేత శరద్‌యూదవ్, తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ తదితరులు తక్షణమే స్పందించి వారికి అడ్డుగా నిలిచారు. మరోవైపు రైల్వే మంత్రి ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రక్షణగా నిలిచారు. సీమాంధ్ర ఎంపీలు పదేపదే కాగితాలు చింపుతూ బడ్జెట్ ప్రతిని చదువుతున్న ఖర్గేపైకి విసిరేశారు. దీంతో కేవలం 12 నిమిషాల్లోనే రైల్వేమంత్రి తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ గురువారానికి వారుుదా పడింది. రాజ్యసభలోనూ రభస: ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు, ఇతర ప్రాంతాల ఎంపీలు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుండడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను 12 గంటలకు వాయిదా వేయిస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ప్రారంభమయ్యాక పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు ప్లకార్డులతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ సభకు కనిపించకుండా అడ్డుగా నిలుచుని సమైక్య నినాదాలు చేశారు. దీంతో ఆరు నిమిషాల్లోనే 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమయ్యాక రైల్వే మంత్రి ఖర్గే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభ మళ్లీ అదుపుతప్పడంతో రెండు నిమిషాల్లోనే గురువారానికి వాయిదా పడింది. -
'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్‌ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు. -
బహిష్కరణ.. వ్యూహంలో భాగమే !
సీమాంధ్రలో పార్టీని నిలబెట్టుకునే లక్ష్యం అందుకే వేటు.. త్వరలో మరికొందరిపై! వారందరితో కొత్త పార్టీ ఏర్పాటు; ఎన్నికల అనంతరం అదీ కాంగ్రెస్‌లోకే! రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ నేతలను సైతం బహిష్కరించామంటూ తెలంగాణలో మైలేజీ ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని నిలబెట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించడమని కాంగ్రెస్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నవారు భావిస్తున్నారు. తెలంగాణ ఇవ్వడం కోసం సొంత పార్టీ నేతలనే బహిష్కరించామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందడం ఒక ఎత్తు. అలాగే, మరికొందరు సీమాంధ్ర నేతలతో సమైక్యాంధ్ర వాదన బలంగా వినిపించేలా చేసి, వారినీ బహిష్కరించి, లేదా రాజీనామా చేయించి.. వారితో కొత్త పార్టీ ఏర్పాటు చేయించడం మరో ప్రణాళికగా కనిపిస్తోంది. ఆ కొత్త పార్టీని ఎలాగూ మళ్లీ కాంగ్రెస్‌లోనే కలుపుకోవచ్చన్న ఆలోచనతోనే కాంగ్రెస్ బహిష్కరణ డ్రామా ఆడుతోందని స్పష్టమవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన పరిస్థితే ఉంటే గడచిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే వీరిపై వేటు పడాల్సింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అప్పట్లో వారిని కాపాడి.. ఇప్పుడు చివరి దశలో సస్పెన్షన్ వేటు వేసింది. త్వరలో మరికొందరు నేతలను కూడా సస్పెండ్ చేయబోతున్నట్టు ఏఐసీసీ నాయకుడొకరు చెబుతున్నదాన్ని బట్టి ఇదంతా పథకం ప్రకారమే సాగుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రోజు నుంచి కేవలం నిరసనలకే పరిమితమవుతూ తనకు సహకరించిన నేతలపైనా వేటు వేసే ఆలోచనలో అధిష్టానం ఉందని చెబుతున్నారు. వారితో కొత్త పార్టీ పెట్టించి సీమాంధ్రలో ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించాలన్నదే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. సమైక్యవాదులుగా వారు ఎన్నికలను ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి వీలుగా ఒక పథకం ప్రకారం వ్యవహారాలు నడిపిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేసిన తరుణంలో మిగిలిన వారు మరింత రెచ్చిపోయే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని హైకమాండ్ నుంచి నేతలకు ఆదేశాలందినట్టు సమాచారం. వేటు ఇప్పుడే ఎందుకు? ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ఇప్పుడే కొత్తకాదు. వాటిపై చర్చకు పట్టుబట్టడంతో ఇదివరకటి శీతాకాల సమావేశాలు జరగకుండా పూర్తిగా స్తంభించిపోయాయి. అయినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు బహిష్కరించిన ఆరుగురు ఎంపీలే కాకుండా సీఎం, కేంద్ర మంత్రులు, మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలూ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. విభజన బిల్లును తిరస్కరించి పంపడమే కాకుండా కాంగ్రెస్ ప్రతిష్టను సవాలు చేస్తూ సీఎం ఏకంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా, దానిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చినా అధిష్టానం పట్టించుకోకపోగా వారికి ఆ స్వేచ్ఛ ఉందని దిగ్విజయ్‌లాంటి నేతలు సమర్థించారు. గడచిన పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసినా పట్టించుకోని కాంగ్రెస్ హైకమాండ్.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ నేతలను సమైక్యవాదులుగా ప్రజల్లోకి పంపించేందుకే ఇప్పుడు వేటు వేసినట్టు చెబుతున్నారు. మిగతా వారిపైనా... ఎంపీలు చింతామోహన్, అనంతవెంకటరామిరెడ్డి, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజులతో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏంచేయనున్నారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. సమైక్యమన్నందుకే ఆరుగురు ఎంపీలపై చర్యలు తీసుకున్నారన్న ప్రచారం చేయించడం.. ఇదే సమయంలో సీమాంధ్రకు చెందిన ఇతర ప్రజాప్రతినిధుల నుంచి మిగిలిన ఎంపీలు, కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచి, తద్వారా వారు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు అడ్డుపడే పరిస్థితి కల్పించడానికి ఈ కొత్త డ్రామాను ప్రారంభించారన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ఇతర ఎంపీలు, కేంద్రమంత్రుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేలా చేసి వారిపైనా పార్టీ చర్యలు తీసుకోవచ్చని, తద్వారా తెలంగాణ కోసం మంత్రులపై సైతం చర్యలు తీసుకున్నామన్న ప్రచారంతో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ముందుకు వెళ్లాలన్న వ్యూహం ఉండి ఉండవచ్చంటున్నారు. అదే సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల భుజాలపైకి సమైక్యవాదాన్ని పెట్టి ప్రజల్లోకి పంపిస్తారని అంటున్నారు. ఎంపీలపై చర్యలతో సీమాంధ్ర కాంగ్రెస్‌లో సమైక్యవాదాన్ని మరింత పెంచడం, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ ద్వారా కూడా రాజీనామా చేయించి, వీరందరితో కొత్త అవతారాలతో ప్రజల్లోకి వెళ్లడమే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బహిష్కరించినా, స్వయంగా వీడివెళ్లినా వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తారంటూ మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం. అనుకూల మీడియా హంగామా కిరణ్‌ను సమైక్యవాదిగా ప్రచారం చేసేందుకు మొదట్నుంచీ ప్రయత్నిస్తున్న అనుకూల మీడియా కూడా అధిష్టానం వ్యూహంలో భాగస్వామిగా మారింది. విభజన విషయంలో హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ సీఎం మొదటి నుంచీ సమైక్య వాదన వినిపిస్తున్నారన్న ప్రచారం చేయడంలో ఆ అనుకూల మీడియా ముందుంది. హైకమాండ్ పెద్దలను కలసినప్పుడు సమైక్యం కోసం కిరణ్ గట్టి వాదన వినిపించారని ప్రచారం చేయడం, అసెంబ్లీలో ఫలానా చేయబోతున్నారంటూ ముందురోజే ఆ మీడియాలో రావడం, ఆ మరుసటి రోజు సీఎం అదే చేయడం.. గత కొద్ది రోజులుగా ఇదంతా ఒక పథకం ప్రకారమే సాగుతోంది. సీఎం 13వ తేదీన రాజీనామా చేస్తారని కూడా ఆ మీడియా గత కొద్దిరోజులుగా ప్రచారం చేస్తోంది. అంటే ఇదంతా ముందుగా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదేనని తెలుస్తోంది. సీఎంకు కొత్తపార్టీ పెట్టే సామర్థ్యముందా? సీఎం, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమైక్యపార్టీని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని రకాల ప్రణాళికలు రచిస్తున్నా అవి కార్యరూపం దాల్చడంపై ఆపార్టీ నేతల్లోనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త పార్టీని ఏర్పాటుచేసి, నిర్వహించేంత సామర్థ్యం కిరణ్‌కు లేదని ఆయన సన్నిహిత నేతలు అభిప్రాయపడుతున్నారు. ఖర్చును భరించడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా వ్యవహారాన్ని నడిపించడం ఆయనకు చేతనయ్యేది కాదని పెదవి విరుస్తున్నారు. ఒకవేళ కిరణ్, కాంగ్రెస్ నేతలతో కొత్త పార్టీని పెట్టించినా ప్రజలు వారిని నమ్ముతారనుకోవడం భ్రమేనని సీఎం వ్యతిరేకవర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. -
ఎంపీల బహిష్కరణపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు ఎంపీల బహిష్కరణ వేటుపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదలు చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చేసిన సిఫార్సును సోనియాగాంధీ ఆమోదించటంతో తొలగింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది వెల్లడించారు. మరోవైపు బహిష్కరణకు గురైన ఎంపీలు ...కాంగ్రెస్ పార్టీనీ దుమ్మెత్తి పోస్తున్నారు. తమపై వేటు వేసిన కాంగ్రెస్ పార్టీని...వచ్చే ఎన్నికల్లో ప్రజలే వేటు వేస్తారని వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్‌లను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించిన విషయం తెలిసిందే. -
ఇన్నాళ్లు వేటు ఎందుకు వేయలేదు: వెంకయ్య
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న సీమాంధ్ర ఎంపీలను ఇన్నాళ్లు ఎందుకు బహిష్కరించలేదు అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలో భాగమే సీమాంధ్ర ఎంపీల వేటు అని వెంకయ్య విమర్శించారు. రాష్ట్ర విభజనకు బీజేపీ ఎప్పడూ అనుకూలమే అని వెంకయ్య అన్నారు. అయితే సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలు, సందేహాలు తీర్చాలని.. ఆప్రాంతానికి న్యాయం జరగాలని బీజేపీ కోరుకుంటోంది అని వెంకయ్య నాయుడు అన్నారు. -
ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
-
ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మరో వ్యూహానికి తెర తీసింది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్‌లను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతోయూపీఏ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నే సాకుగా చూపించి ఇప్పుడు ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. ఒకవేళ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు వీళ్లు తమ ఎంపీలు కారని, వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకోడానికి వీలుంటుందన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దల వ్యూహంలా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు కట్టడి చేయలేకపోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని అంటూనే వివిధ షరతులు పెడుతోంది. అయితే, సొంత పార్టీ వాళ్లనే కట్టడి చేయలేరా, అవసరమైతే వాళ్లను సస్పెండ్ చేయండి అంటూ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసు పార్టీకి ఒక పరిష్కారం దొరికినట్లయింది. మొదట్లో సభ్యులపై చర్యలు తీసుకోవద్దన్న బీజేపీయే ఇప్పుడు మార్గం చూపించిందని సంతోషిస్తూ, ముందుగా పార్టీ నుంచి సస్పెన్షన్ కాకుండా ఏకంగా బహిష్కరించేసి చేతులు దులుపుకుంది. రేపో మాపో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వస్తే, అప్పుడు సీమాంధ్ర ఎంపీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎటూ చేస్తారు కాబట్టి, అప్పుడు సభ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయించొచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. -
వెల్‌లోకి దూసుకెళ్లి.... కాగితాలు చింపేశారు.
-
వెల్‌లోకి దూసుకెళ్లి.... కాగితాలు చింపేశారు.
న్యూఢిల్లీ : విభజన బిల్లు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. ఉభయ సభల్లోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులతో తమ నిరసనలు తెలిపారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్ సభ వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకు వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఎంపీలు కూడా తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని, అయితే సభ అదుపులో లేనందున చర్చ చేపట్టలేకపోతున్నట్లు వెల్లడించారు. తీవ్ర గందరగోళం మధ్యే కొద్దిసేపు సమావేశాలను స్పీకర్ మీరాకుమార్ నడిపించినా .... అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు సభ ప్రారంభం కావటంతోనే సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఛైర్మన్ వెల్‌లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీలకు అన్నా డీఎంకే, డీఎంకే ఎంపీలు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్‌తో కలిసి కాగితాలు చించి ఛైర్మన్‌పై విసిరివేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను తొలుత పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా ప్రతిష్టంభన కొనసాగటంలో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం అయినా సీమాంధ్ర ఎంపీలు తమ పట్టు వీడకపోవటంతో సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. -
8 రోజులు అడ్డుకుంటే చాలు
సీమాంధ్ర ఎంపీల వ్యూహం సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటే ప్రస్తుతానికి రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయగలుగుతామని పలువురు సీమాంధ్ర ఎంపీలు అభిప్రాయపడ్డారు. సమావేశాల గడువు ఇంకా ఎనిమిది రోజులే ఉన్నందున ఈ లోపు నిరసనలు, ఆందోళనలు... ఇలా ఏ పద్ధతిలోనైనా సభను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ తదితర అంశాలపై ఢిల్లీలోని వైఎంసీఏ కాన్ఫరెన్స్హాల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సెమినార్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, టీడీపీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేశ్, ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభలో కేవీపీ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే తెలుగువారి అభివృద్ధి సాధ్యమని నమ్మే వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి పొందిన స్ఫూర్తితోనేతాను ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యసభలో బిల్లుపెడితే దానికి ఎప్పటికీ కాల దోషం ఉండదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుగా అక్కడ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. -
స్తంభించిన పార్లమెంట్
నాలుగో రోజూ సాగని సభలు సమైక్య, తెలంగాణ నినాదాల హోరు వెల్‌లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన లోక్‌సభలో వైఎస్సార్సీపీ సహా 4 అవిశ్వాసం నోటీసులు గందరగోళం మధ్య సభ ముందు పెట్టలేకపోయిన స్పీకర్ రాజ్యసభలో పత్రాలు చించిన డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయసభలూ నేటికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా స్తంభించిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంతో పాటు.. మత హింస బిల్లు, తమిళ జాలర్ల సమస్యలపై పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టి, నినాదాలు చేయటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం తలెత్తింది. లోక్‌సభ ఒకసారి, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడినా పరిస్థితి మారకపోవటంతో ఎలాంటి కార్యకలాపాలూ సాగలేదు. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సీమాంధ్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చారు. వాటిని కూడా స్పీకర్ సభ ముందు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో అయితే పలువురు ఇతర ప్రాంత సభ్యులు అధికారిక పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరేయటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరకు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెండు సభలనూ సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ 12 నిమిషాల్లోనే వాయిదా.. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ సభ్యులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలతో పాటు పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి సమైక్య నినాదాలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అయినప్పటికీ సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించగా ఓ సభ్యుడు నదీకాలుష్యంపై ప్రశ్నించారు. ఆ హోరులోనే మంత్రి వీరప్పమొయిలీ సమాధానం ఇచ్చారు. కానీ సమాధానం వినిపించే పరిస్థితి లేకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే స్పీకర్ మీరాకుమార్ సభను 12 గంటలకు వాయిదావేశారు. తిరిగి సభ సమావేశమయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సమైక్య నినాదాలు చేయగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు శైలేంద్రకుమార్, ధర్మేంద్రయాదవ్, ఎం.ఆనందం తదితరులు వెల్‌లోకి వెళ్ళి తమ ప్రాంతాల సమస్యలపై నినాదాలు చేశారు. స్పీకర్ మాట్లాడుతూ ‘‘సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కొనకళ్ల నారాయణరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిల నుంచి అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని సభ ముందు ఉంచుతున్నాను. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను లెక్కించి వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ ఈ ప్రక్రియకు సభ అదుపులో లేదు..’’ అని అన్నారు. సభ్యులు తమతమ సీట్లలోకి వెళ్లాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ అదుపులోకి రాలేదు. ఈ గందరగోళం మధ్యే సభను కొనసాగించగా పలువురు మంత్రులు తమ వార్షిక నివేదికలను సభ ముందుంచారు. గందరగోళం మరింత పెరగటంతో స్పీకర్ సభను 12 నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వెల్‌లోకెళ్లి ప్లకార్డులతో సమైక్య నినాదాలుచేశారు. సభాకార్యక్రమాలకు అంతరాయం కొనసాగుతుండగానే.. అస్సాంకు చెందిన సభ్యుడు బీరేంద్రప్రసాద్ మణిపురి బాలికపై అత్యాచారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అలాగే పలువురు సభ్యుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గత వారంలో వివిధ అంశాలపై నిరసనల తెలుపుతూ సభా నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్ (టీడీపీ), ఎన్.బలగంగ, ఎ.డబ్ల్యు.రబీబెర్నార్డ్, కె.ఆర్.అర్జునన్, టి.రత్నివేల్, ఆర్.లక్ష్మణన్ (ఏఐఏడీఎంకే), వసంతి స్టాన్లీ, ఎ.ఎ.జిన్నా, టి.ఎం.సెల్వగణపతి (డీఎంకే)లపై చర్యలు చేపట్టనున్నట్లు హౌస్ బులెటిన్‌లో పేర్కొనటం పట్ల ఆయా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ై మెత్రేయన్ (ఏఐఏడీఎంకే), సెల్వగణపతి (డీఎంకే)లు హౌస్ బులెటిన్ పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరివేశారు. సభ అదుపు తప్పటంతో 10 నిమిషాలపాటు వాయిదావేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత బీరేంద్రప్రసాద్ మాట్లాడుతూ మన్మోహన్సింగ్ సర్కారు అత్యాచార ఘటనలను అడ్డుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. సభ నడిచే పరిస్థితి కనిపించకపోవడంతో రెండు నిమిషాల్లోనే 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, జైరాంరమేశ్ తదితరులు వార్షిక నివేదికలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ సభ అదుపులోకి రాకపోవటంతో మరోసారి వాయిదాపడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీడీపీ సభ్యుడు సి.ఎం.రమేశ్ తదితరులు పెద్దసైజు ప్లకార్డులతో పోడియం వద్ద ఆందోళన చేశారు. ఈ సమయంలో తన ముఖం కనిపించకుండా చేయకండంటూ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ కాస్త గట్టిగానే చెప్పినా ఫలితం లేకపోయింది. మైత్రేయన్ ఏకంగా చైర్మన్ ఎదుట ఉన్న మైక్రోఫోన్‌ను లాగివేసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓ ఎంపీ ఏకంగా డిప్యూటీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన ప్రవర్తన కాదని, వారికిది తగదని హితవు పలికారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన బిల్లు అని, వారికి సహాయం చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించారు. కానీ ఆందోళన చేస్తున్న సభ్యులు ఆయన మాట వినకపోవడంతో మూడు నిమిషాలకే తిరిగి మంగళవారానికి వాయిదాపడింది. -
సమావేశాల తొలిరోజే రచ్చ రచ్చ
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే సీమాంధ్ర సభ్యుల నిరసనల మధ్య మొదలయ్యాయి. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉందంటూ విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చరచ్చ జరిగింది. విభజన సెగతో లోక్‌సభ అట్టుడికింది. సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజిస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లో సభను మొదట 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సమైక్య నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు నినదించారు. 15వ లోక్‌సభ చివరి సమావేశాలు కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే వాతావరణం నెలకొంది. వెల్లోనికి దూసుకొచ్చిన సభ్యులపై ఛైర్మన్ హమీద్ అన్సారీ అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు, అనంతరం రెండు గంటల వరకూ వాయిదా పడింది. -
మెత్తబడ్డ సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: రెండున్నర గంటల పాటు సాగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ముగిసింది. కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ పెద్దలు కోరారని తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆ ప్రాంత ఎంపీలు నమ్మకం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దని కోరామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. బిల్లు పెడితే వ్యతిరేకంగా ఓటెస్తామని చెప్పారు. బిల్లు పెడితే తమ సత్తా చూపుతామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సభను క్షణం కూడా నడవనీయబోమన్నారు. అయితే వార్ రూమ్ భేటీ చాలా బాగా జరిగిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా తెలంగాణ బిల్లు ఉంటుందన్నారు. సీమాంధ్రుల సమస్యలపై దిగ్విజయ్, జైరాం రమేష్ హామీయిచ్చినట్టు తెలిసింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పోలవరం, వనరుల పంపిణీ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. దీంతో సీమాంధ్ర ఎంపీలు కాస్త మెత్తబడినట్టు ప్రచారం జరుగుతోంది. -
ఎంపీ పాస్‌తో ఏఐసీసీ భేటీకి వచ్చా: లగడపాటి
కాంగ్రెస్ పార్టీ తనకు పాస్ మంజూరు చేయకపోయినా తాను ఎంపీ పాస్‌పై ఏఐసీసీ సమావేశాలకు వచ్చానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అందులో భాగంగా లగడపాటి సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దాంతో లగడపాటికి పోటీగా తెలంగాణ ప్రాంతా నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించారు. అదికాక ఏఐసీసీ సమావేశాలకు హాజరుకావద్దని సోనియా రాజకీయ వ్యవహరాల కార్యదర్శి అహ్మద్ పటేల్ స్వయంగా ఫోన్ చేసి లగడపాటికి వెల్లడించారని సమాచారం. -
ఎట్టకేలకు సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏఐసీసీ సమావేశాలకు ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఆహ్వానం పంపింది. దాంతో ఏఐసీసీ సమావేశాలకు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ హాజరయ్యారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించవచ్చనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తటంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. కాగా ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు అయ్యారు. -
సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ
-
సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ
న్యూఢిల్లీ : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఏఐసీసీ సమావేశానికి అధిష్టానం అనుమతి నిరాకరించింది. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించినట్లు సమాచారం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. కాగా ఏఐసీసీ భేటీలో పాల్గొనాలంటూ రాష్ట్రం నుంచి మొత్తం 150 మందికి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 76 మంది ఏఐసీసీ సభ్యులు కాగా, మిగిలిన వారు కో-ఆప్షన్, ఎక్స్అఫిషియో సభ్యులు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్అఫిషియో సభ్యులుగా పరిగణిస్తారు. మొత్తం సభ్యుల్లో సుమారు 20 మంది సభ్యులు పార్టీని వీడారు. కొందరు సభ్యులు చనిపోయారు. వీరి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వలేదు. -
సంకల్ప దీక్ష కాదది...
-
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం
-
'సంకల్ప దీక్ష కాదది... ఉత్తుత్తి దీక్ష'
రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష... ఉత్తుత్తి దీక్ష మాత్రమే అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దేవినేని ఉమా మాట్లాడుతూ... సంకల్ప దీక్ష అంటూ హైదరాబాద్‌లో దీక్ష చేపట్టిన ఆ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ధర్నాలు, దీక్షలు చేపట్టాలని ఆయన సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. ఓట్లు, సీట్లు కోసమే సోనియా రాష్ట్ర విభజనపై నాటకాలాడుతుందని ఆయన ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలు శ్రీధర్ బాబు నుంచి సీఎం కిరణ్ తప్పించడాన్ని పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల్లో హీరోగా నిలిచారని అన్నారు. సీఎం మాత్రం సమైక్యవాది అంటు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నాయకత్వంలో ఈ తతంగమంతా జరుగుతుందని దేవినేని ఉమా పేర్కొన్నారు. -
జనవరి 23 వరకూ ఆగండి!
‘విభజన’పై సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 23 వరకు వ్యూహాత్మక మౌనం పాటించాలని భావిస్తున్నారు. తనను కలిసేందుకు వస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కూడా ఆయన ఇదే రకమైన సలహా ఇస్తున్నారు. సోమవారం ఎంపీలు ఉండవల్లి, అనంత, హర్షకుమార్, మాగుంట, ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు సీఎంను విడివిడిగా కలిశారు. అయితే, వారు వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం సీఎంను కలిసినప్పటికీ విభజన విషయంలో కేంద్రం దూకుడుగా వెళుతున్నందున.. భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై చర్చ జరిగింది. పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని.. తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని వారిలో కొందరు నేతలు సీఎం ఎదుట వాపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో ఉండలేమనే భావనను కూడా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ‘‘23 వరకూ ఓపిక పట్టండి. ఆ తరువాత అందరం కలిసి రాజకీయ భవిష్యత్‌పై సమష్టి నిర్ణయం తీసుకుందాం’’ అని చెప్పినట్లు తెలిసింది. సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. సీఎం మాటలు నమ్మాలో.. వద్దో? అర్థం కాకుండా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే హైకమాండ్ తీరును తప్పుపడుతున్న సీఎం ఇంకా మొండిగానే ఉన్నారని, ఆయన మాటలను చూస్తుంటే కొత్త పార్టీ పెడతారేమోననే భావన కలుగుతోందని ఓ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి టీజీ కూడా సోమవారం సచివాలయంలో సీఎం కిరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పార్టీ వీడే ఆలోచన లేదని, అయితే రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతే దీనిపై ఆలోచిస్తానని బదులిచ్చారు. -
'ఎంపీలు,కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారు'
సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారని తెలుగు ప్రజా వేదిక ఛైర్మన్ ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ప్యాకేజీల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వారు తాకట్టుపెట్టారన్నారు. ఆంజనేయరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో టి. బిల్లుపై చర్చించకుండా... బిల్లుకు వ్యతిరేకంగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యరాష్ట్రం కోసం తెలుగు ప్రజా వేదిక ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
విభజనకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేరు: సబ్బం హరి
రాష్ట్ర విభజనకు సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు అనుకూలంగా లేరని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఢిల్లీలో జరగుతున్న రాజకీయ క్రీడకు తెలుగు ప్రజలు బలయ్యారని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబిడ్స్‌లోని ఏపీఎన్జీవో భవన్లో శనివారం జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ మరో సారి పునరాలోచన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐక్యత కోసం ఏపీఎన్జీవోలు చేసే పోరాటంలో అన్ని పార్టీలు సహయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకు హాజరై సమైక్య నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎన్జీవోలు గతంలో చేసిన 66 రోజుల ఉద్యమంతో కేంద్రానికి ముందల కాళ్లకు బంధం వేసిన సంగతిని ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు గుర్తు చేశారు. పదవుల్లో కొనసాగుతున్న కేంద్రమంత్రులు తమ మనస్సులను మార్చుకోవాలని ఆయన వారికి హితవులు పలికారు. టి. బిల్లు వ్యతిరేకించే విషయంలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. -
పార్లమెంటులోనూ జై సమైక్యాంధ్ర!!
-
పార్లమెంటులోనూ జై సమైక్యాంధ్ర!!
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన మూడు నిమిషాలకే గంట పాటు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ రెండు నిమిషాలు కూడా సాగలేదు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి లోక్‌పాల్‌పై చర్చ ప్రారంభించాలని విపక్ష నేత అరుణ్ జైట్లీ సభాపతిని కోరారు. దీన్ని మన్నించిన సభాపతి... చర్చ ప్రారంభించాలని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌ను కోరారు. లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు వెంటనే సభ మధ్యలోకి దూసుకొచ్చారు. చర్చ ప్రారంభం కాకుండా అడ్డుతగిలారు. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. -
లోక్‌సభ మళ్లీ వాయిదా
-
లోక్‌సభ మళ్లీ వాయిదా
లోక్‌సభలో వాయిదాల పర్వం శుక్రవారం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. దాంతో అటు సీమాంధ్ర ఎంపీలు,ఇటు తెలంగాణ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తుంన్నారు. ఇరుప్రాంతాల ఎంపీలకు నచ్చ చెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించారు. ఎంపీలు ఎంతకు తమ పంతాలను విడకపోవడం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతోపాటు బీజేపీ సభ్యులు జస్టిస్ గంగూలీని పదవి నుంచి తొలగించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 1.00 గంట వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. -
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా
పార్లమెంట్‌లోని ఉభయ సభలలో సమైక్యాంధ్ర నినాదాలు శుక్రవారం మారుమ్రోగాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. ఆ క్రమంలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ పై తీవ్రవాదులు దాడి చేసి నేటితో 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడి ఘటనలో అమరులైన జవాన్లకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. అయితే మహిళ న్యాయవాదిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జస్టిస్ గంగూలీని వెంటనే పదవి నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వారితో బీజేపీ సభ్యులు గొంతుకలిపారు. అటు సీమాంధ్ర ఎంపీల నినాదాలు, ఇటు తృణమూల్, బీజేపీ సభ్యుల నినాదాలతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. -
సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ
న్యూఢిల్లీ : సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చేది లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేక చర్యలను తాము సమర్థించమని ఆమె గురువారమిక్కడ తెలిపారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని సుష్మ డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. స్వలింగ సంపర్కుల హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
రాష్ట్రపతి వద్ద రాష్ట్ర నేతల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు ఆయన వద్దకు క్యూ కట్టారు. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం స్వదేశానికి చేరుకున్న రాష్ర్టపతిని ఇరు ప్రాంత ఎంపీలు విడివిడిగా కలుసుకున్నారు. ప్రణబ్ 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు రాష్ట్రపతిభవన్‌కు వెళ్లిన ఎంపీలు పనిలోపనిగా విభ జనపై విన్నపాలను ఆయన ముందుంచారు. విభజన ప్రక్రియ ను వేగిరం చేయాలని, త్వరగా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపాలని తెలంగాణ ప్రాంత ఎంపీలు కోరగా, అడ్డగోలుగా జరుగుతున్న విభజనను రాజ్యాంగపెద్దగా అడ్డుకోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు విన్నవించారు. ఇక సొంత పార్టీపైనే సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంపైనా రెండు ప్రాంతాల నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ నేతలు అంటుంటే, విభజన జరుగుతున్న తీరే అనైతికమని, దానిని అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధమని సీమాంధ్ర నేతలు గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రపతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను కలవాలని ఒకరోజు ముందుగానే సీమాంధ్ర ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకున్నారు. బుధవారం పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం ఆయన్ను కలవాలని ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్, రాయపాటి, సాయిప్రతాప్, బాపిరాజు, అనంత, మాగుంట నిర్ణయించుకొని లేఖను తయారు చేసుకున్నారు. ఇది తెలుసుకున్న టీ ఎంపీలు అప్పటికప్పుడు రాష్ట్రపతి కార్యాలయానికి ఫోన్లు చేసి సీమాంధ్ర నేతలకన్నా ముందుగానే అపాయింట్మెంట్ సాధించారు. ఎంపీలు మధుయాష్కీ, పొన్నం, రాజయ్య, పాల్వాయి, షెట్కార్, మంద, వివేక్ తదితరులు ప్రణబ్‌ను కలిశారు. శుభాకాంక్షలు చెబుతూనే ‘జన్మదిన కానుకగా త్వరగా బిల్లును అసెంబ్లీకి పంపించి, ప్రక్రియను వేగవంతం చేయండి’ అని విన్నవించారు. దీనికి ఆయన నవ్వి ఊరుకున్నారని తెలిసింది. తర్వాత సీమాంధ్ర ఎంపీలు ప్రణబ్‌ను కలిసి రెండు పేజీల వినతి పత్రం అందించారు. ‘రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరుగుతోంది. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధంగా లభించిన నిర్ణయాధికారాన్ని ఉపయోగించి మీరు విభజనను అడ్డుకోవాలి. అసెంబ్లీలో దీనిపై తీర్మానం వచ్చాకే ముందుకెళ్లాలి’ అని వారు కోరినట్లుగా తెలిసింది. దీనికి సైతం ప్రణబ్ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. అంతకుముందు పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు.. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో చర్చలు జరిపారు. తెలంగాణపై తమను పూర్తిగా విస్మరించి ముందుకెళుతున్నందునే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని, దానికి సహకరించాలని కోరారు. ఈ అంశంపై అద్వానీ ఎలా స్పందించిందీ తెలియనప్పటికీ సీమాంధ్ర ఎంపీలు మాత్రం అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తెలిపిందని ప్రకటించారు. -
అవిశ్వాస తీర్మానాలను చదివిన లోక్‌సభ స్పీకర్
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభలో స్పీకర్ మీరా కుమార్ చదివి వినిపించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అవిశ్వాస నోటీసులిచ్చారని సభలో చెప్పారు. మూడు అవిశ్వాస నోటీసులొచ్చాయని తెలిపారు. సభ సజావుగా సాగితేనే నోటీసులను సభ ముందుంచుతానని స్పీకర్ అన్నారు. ఈ సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల పోటీపోటా నినాదాలతో గందరగోళం తలెత్తింది. దీంతో లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. అయితే అవిశ్వాస తీర్మానాలపై సభలో చర్చ జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నోటీసులిచ్చిన సీమాంధ్ర ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ వారిని దారిని తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అటు రాజ్యసభలోనూ సమైక్య నినాదాలు మార్మోగాయి. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. -
ఎంపీల ధిక్కారంపై కాంగ్రెస్‌లో కలకలం
న్యూఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలే తిరుగుబాటు బావుట ఎగురవేయటంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతోయూపీఏ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ నిన్న ఉదయం స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానంపై స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆరుగురు ఎంపీలు ఈరోజు ఉదయం పదిగంటలకు మరోసారి భేటీ కానున్నారు. మరోవైపు ఎంపీలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ...ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా.. వారిలో ఆరుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేయటం విశేషం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీలు కూడా విడి విడిగా స్పీకర్‌కు నోటీసులు ఇచ్చాయి. కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే చర్చ... ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలతో సహా మూడు పార్టీల తరఫున మొత్తం 13 మంది ఎంపీలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ నోటీసులు స్పీకర్ మీరాకుమార్ పరిశీలనలో ఉన్నాయి. సభ సజావుగా జరిగిన పక్షంలో స్పీకర్ మొదటి ప్రాధాన్యతా అంశంగా తీసుకుని అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో చదివి సభ అభిప్రాయాన్ని కోరతారు. స్పీకర్ ఇలా కోరినపుడు కనీసం యాభై మంది సభ్యులు నిలబడి నోటీసుకు మద్దతు తెలిపితే అప్పుడు స్పీకర్ అవి శ్వాస తీర్మానాన్ని సభలో పెట్టడానికి అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఏ రోజున పెట్టాలి? దానిపై చర్చకు ఎంత సమయం కేటాయించాలి? ఎప్పుడు ఓటింగ్ జరపాలి? అనే అంశాలను స్పీకర్ నిర్ణయిస్తారు. -
యూపీఏపై అవిశ్వాసం
గతంలో చేసిన రాజీనామాలు ఉపసంహరించుకున్న వైనం అవిశ్వాసంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల్లో ఏకాభిప్రాయం కరువు 19 మంది సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల్లో సంతకాలు చేసింది ఆరుగురే యూపీఏపై అవిశ్వాసానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సై కాంగ్రెస్ ఎంపీలే తమ నాయకత్వాన్ని తప్పుపడుతున్న విషయాన్ని హైలైట్ చేయడానికి.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి చూపేందుకు అది ఉపయోగపడుతుంది: జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసం నోటీసు అవిశ్వాసానికి మూడు పార్టీల నుంచీ 13 మంది ఎంపీల మద్దతు కనీసం 50 మంది మద్దతు ఉంటేనే సభలో పెట్టేందుకు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. అయితే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా.. వారిలో ఆరుగురు మాత్రమే నోటీసుపై సంతకాలు చేయటం విశేషం. సీమాంధ్ర కేంద్రమంత్రులు సహా మిగతా లోక్‌సభ సభ్యులు ‘అవిశ్వాసం’పై స్పందించకపోవటం గమనార్హం. దీన్ని బట్టి.. అవిశ్వాసం విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్యే ఏకాభిప్రాయం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు.. స్వయంగా కాంగ్రెస్ ఎంపీలే సొంత పార్టీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వటంతో.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ సర్కారు పెద్దల తప్పుడు నిర్ణయాన్ని యావద్దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సహ నాయకులతో చర్చించి.. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు సిద్ధంచేసిన నోటీసుపై ఆయనతో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి సంతకాలు చేసి స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల్లో ఐకమత్యం లేనప్పటికీ.. అవిశ్వాస తీర్మానం విషయంలో స్పష్టత లేనప్పటికీ.. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం లేకుండా కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసం ఏకపక్షంగా నిరంకుశ విభజనకు దిగిన వైనాన్ని.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించేందుకు.. అవిశ్వాసానికి తాము మద్దతు ప్రకటించినట్లు వైఎస్ జగన్తెలిపారు. సోమవారం ఢిల్లీలో జేడీఎస్ అధినేత దేవెగౌడతో కలిసి జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ ఎంపీలే సొంత పార్టీ నాయకత్వాన్ని వద్దనుకుంటున్న విషయాన్ని హైలైట్ చేయటానికి అవిశ్వాసానికి తమ మద్దతు ఉపయోపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర ఎంపీలు కె.నారాయణరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్పలు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. అవినీతి, కుంభకోణాలు, ప్రజావ్యతిరేక పాలనతో అన్ని రంగాల్లో విఫలమైన యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ వారు ఆ తర్వాత మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. కానీ.. ఈ నోటీసు ఇవ్వటానికి కారణం సమైక్యాంధ్రకు మద్దతుగా అని కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అని కానీ వారు చెప్పలేదు. పార్టీ తెలంగాణ ఎంపీలు సంతకాలు చేయకుండా కేవలం సీమాంధ్ర ప్రాంత ఎంపీల సంతకాలతోనే నోటీసు ఇచ్చిన టీడీపీ నేతల్లో.. అసలు ఇది ఎందుకు ఇచ్చామన్న స్పష్టత ఏ కోశానా లేకపోవటం విశేషం. కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే చర్చ... ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలతో సహా మూడు పార్టీల తరఫున మొత్తం 13 మంది ఎంపీలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ నోటీసులు స్పీకర్ మీరాకుమార్ పరిశీల నలో ఉన్నాయి. సభ సజావుగా జరిగిన పక్షంలో స్పీకర్ మొదటి ప్రాధాన్యతా అంశంగా తీసుకుని అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో చదివి సభ అభిప్రాయాన్ని కోరతారు. స్పీకర్ ఇలా కోరినపుడు కనీసం యాభై మంది సభ్యులు నిలబడి నోటీసుకు మద్దతు తెలిపితే అప్పుడు స్పీకర్ అవి శ్వాస తీర్మానాన్ని సభలో పెట్టడానికి అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఏ రోజున పెట్టాలి? దానిపై చర్చకు ఎంత సమయం కేటాయించాలి? ఎప్పుడు ఓటింగ్ జరపాలి? అనే అంశాలను స్పీకర్ నిర్ణయిస్తారు. కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల ఉపసంహరణ... రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా గతంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిర్ణయానికి రావటంతో.. వారు ముందుగా స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఆమె నుంచి ఆమోదం లభించిన వెంటనే ఎంపీలు మరోమారు సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసు తయారు చేశారు. దీన్ని స్వయంగా ఎంపీ సబ్బంహరి స్పీకర్‌కు అందించారు. సమైక్యాంధ్ర విషయంలో అటు పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నైతికంగా వ్యవహరించలేదని ఎంపీ సబ్బం హరి విమర్శించారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. అలాంటి సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తే, తమ నైతికతకు వచ్చే ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు. ‘సీమాంధ్ర కేంద్రమంత్రులు సహకరిస్తారా?’ అని అడగగా.. వారి విషయం తమకు తెలియదని హరి పేర్కొన్నారు. ఊహించిందే.. అధిగమిస్తాం: కాంగ్రెస్ సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సోమవారం పల్లం రాజు, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చించారని.. అవిశ్వాసంపై వెనక్కుతగ్గాలని సూచించారని సమాచారం. ఇదిలావుంటే.. అవిశ్వాస తీర్మానం ముందుగా ఊహించిందేనని.. దాన్ని సమర్థవంతంగా అధిగమిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి పి.సి.చాకో పేర్కొన్నారు. -
సీమాంధ్ర ఎంపీలను బుజ్జగిస్తున్నకాంగ్రెస్ అధిష్టానం
ఢిల్లీ: ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించిన సీమాంధ్ర ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాసం తీర్మానం పెట్టాలని తీర్మానించారు. ఈ క్రమంలో ముందుగానే మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారు. సోమవారం రాత్రి రాష్ట్ర వ్యవహారాల రాజకీయ సలహాదారు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర ఎంపీలతో సమావేశమైయ్యారు. అవిశ్వాసతీర్మాన నోటీసు ఉపసంహరించుకోవాలని దిగ్విజయ్ వారికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, అహ్మద్ పటేల్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడి అవిశ్వాసం తీర్మానం పెట్టకుండా ఉండాలని విన్నవిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని సీమాంధ్ర ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యత్వం ఉండాలని, అందుకే ఇంతకుముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు వారు తెలిపారు. -
సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన పార్లమెంట్
న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దీంతో ప్రారంభమైన కాసేపటికే పార్లమెంట్ ఉభయసభలూ రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభ్యుల నినాదాల మధ్యే లోక్‌సభలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటంతో స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడ్డాయి. -
అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపణ సిగ్గులేని కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాదు సాక్షి, ఏలూరు/విజయవాడ: సమైక్య ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంటే సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. తాము కోరినప్పుడు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో పోరాడతామని చెప్పి మోసం చేశారన్నారు. సిగ్గులేని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారని విమర్శించారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి అమ్ముడుపోయారని, పైకిమాత్రం సమైక్య ముసుగు వేసుకున్నారన్నారు. అలాంటి వారిని వదలిపెట్టబోమన్నారు.ఎంపీలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ఇప్పుడు జరగదన్నారు. 2014 ఎన్నికలు కీలకమన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్ర సకల జనుల రైతు గర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడారు. విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినా అది పాస్ కాదని చెప్పారు. బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశం అసెంబ్లీకి వస్తే సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించాలన్నారు. జీవోఎంకు సంబంధించిన 11అంశాలూ రాజ్యాంగ విరుద్ధమైనవేనన్నారు. తెలంగాణవాదులు రాజకీయ రౌడీయిజం చేస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో పొలిటికల్ రౌడీయిజం నడుస్తోందని, రాజధానిని వదులుకునే సమస్యేలేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పర్వాలేదని, కానీ ఆంధ్రా వాళ్లు తమను దోచేశారని తెలంగాణవాళ్లు ప్రచారం చేస్తున్న సమయంలో విడిపోవడం దారుణమని పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత ఆంధ్రాప్రాంతం తమను దోచేసిందని తెలంగాణ ప్రభుత్వం పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చితే చరిత్రలో విలన్లుగా మిగిలిపోతామన్నారు. తెలంగాణను కర్ణుడితో పోల్చుతూ సోనియాను కుంతీదేవిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అనే కర్ణుడిని బతికించుకునేందుకు సోనియా పాట్లు పడుతున్నారన్నారు. తెలుగుజాతిని విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి (కావూరు సాంబశివరావు) రెండు నెలలు ఉండే పదవి కావాలో, రెండుసార్లు గెలిపించిన ప్రజలు కావాలో తేల్చుకోవాలని, పదవే కావాలంటే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని చెప్పారు. జీఓఎం నివేదిక కేంద్ర కేబినెట్‌కు వెళుతుందని అప్పుడు మన కేంద్ర మంత్రులు ఇద్దరు అక్కడే ఉంటారని, మన చావుకు శాసనం రాస్తుంటే వారు సంతకం ఎలా పెడతారో అడుగుతామని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
'సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులు'
సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులుగా మారారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని విభజిస్తే తమ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలంటూ వారు కేంద్రాన్ని అడుగుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాంటి వారు రాష్ట్రానికి దురదృష్టంగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ముసాయిదా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాతామని తెలిపారు. ఈ నెల 24న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందులో భవిష్యత్తు కార్యాచరణ చర్చిస్తామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపినప్పుడు రెండు అసెంబ్లీ తీర్మానాలు చేసిన సంగతిని అశోక్‌బాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాల్సిందే. ఆ క్రమంలో నెగ్గితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని తెలిపారు. పార్లమెంట్‌కు విభజన బిల్లు వస్తే దానిని అడ్డుకునేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నట్లు అశోక్‌బాబు వివరించారు. -
ప్రజలను మభ్య పెట్టేందుకే జీవోఎం : అశోక్ బాబు
హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టేందుకు జీవోఎంను తెరమీదకు తెచ్చారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరిస్తామన్నారు. పదవుల్లో కొనసాగాలా లేదా అనేది సీమాంధ్ర ఎంపీలే నిర్ణయించుకోవాలని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే యూపీఏ సర్కారుపై ఒత్తడి పెరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామన్నారు. హెల్త్ కార్డుల ట్రస్ట్‌లో ఉద్యోగులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అశోక్ బాబు తెలిపారు. -
సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడతా: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా తలెత్తే సమస్యలను మంత్రుల బృందం(జీఓఎం) పరిష్కరిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజీనామా చేసిన సీమాంధ్ర ఎంపీలను పిలిచి మాట్లాడాతామని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉన్నంత మాత్రానా పోలవరానికి ఇబ్బంది ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని దిగ్విజయ్ నిన్న అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది చాలా సున్నిత అంశమని, ఈ విషయాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని తెలిపారు.సింగ్ స్పష్టం చేశారు. -
సీమాంధ్ర కేంద్రమంత్రుల వాఖ్యలు బాధించాయి:పితాని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ స్ఫష్టం చేశారు.ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్నారు. సీమాంధ్రకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొనడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమంత్రుల వ్యాఖ్యలు తనను తీవ్ర బాధకు గురి చేశాయని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. -
13 మంది ఎంపీల రాజీనామాల తిరస్కరణ
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు. వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగడపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు. స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్మోహన్రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు. -
రాష్ట్రపతిని కలుద్దాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానికి లేఖ రాయాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయించింది. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారధి, పి.బాలరాజు, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, అహ్మదుల్లా, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, బి.ఎన్.విజయ్‌కుమార్, బొత్స అప్పలనర్సయ్య, కాండ్రు కమల, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కమిటీలో లేనప్పటికీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, కె.సుధాకర్, రాజన్నదొర, తైనాల విజయకుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభ్యుల మెజారిటీ అభిప్రాయాలు, ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాల్సిందిగా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని నేతలు నిర్ణయించారు. సోనియాగాంధీతో భేటీ కావాలనే అభిప్రాయం వ్యక్తమైనా.. ఢిల్లీ వెళ్లినా ఫలితం ఉండదని టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. పురందేశ్వరి సహా కొందరు కేంద్ర మంత్రులు విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఇంకా సమైక్యంగా ఉంచాలని అడగడం సరికాదంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తావించారు. మంత్రి బాలరాజు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని కొందరు గుర్తుచేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై దిగ్విజయ్‌సింగ్‌ను కలిస్తే మేలని సూచించారు ‘విభజన అనివార్యం. మీ సమస్యలేమిటో చెప్పండి. పరిష్కరిస్తామని మాట మాత్రంగానైనా చెప్పడం లేదు. అలా చెబితే మనం కూడా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్లం..’ అని మంత్రి పార్థసారధి అన్నారు. మనం ఏం చెబుతున్నా ఢిల్లీ స్థాయిలో జరగాల్సివన్నీ జరిగిపోతున్నాయని, అన్నీ పక్కనపెట్టి సమైక్య ఉద్యమంపై సమీక్షించాలని కన్నబాబు అన్నారు. కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ విభజనపై నిర్ణయం జరిగిపోయినందున కాంగ్రెస్ లైన్లోనే వెళ్లాల్సిన అవసరముందన్నాగరు. మరికొందరు కూడా కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు ఢిల్లీ వెళ్లి తొలుత దిగ్విజయ్‌సింగ్‌ను కలవాలని నేతలు నిర్ణయించారు. సమావేశానంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దిగ్విజయ్‌సింగ్‌లను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
'రాజీనామాల పేరుతో సీమాంధ్ర నేతల నాటకాలు'
న్యూఢిల్లీ: రాజీనామాల పేరుతో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు నాటకాలు ఆడుతున్నారని సీమాంధ్ర గెజిటెడ్ జేఏసీ కన్వీనర్ సి.వి. మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు సర్కారు దిగి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు. రేపు జంతర్‌మంతర్‌లో న్యాయవాదులు ధర్నా చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు మొయిలీ, ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీతారాం ఏచూరిని, జవదేకర్‌ను కలిసి.. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. మరోవైపు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు ఎపీఎన్జీవోలు ప్రకటించారు. -
సమైక్యానికి తెర.. విభజనకు సై
అధిష్టానం బాటలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విభజనకు అనుకూలంగా సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లే యత్నం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వేసుకొన్న సమైక్య ముసుగు క్రమేణా తొలగిపోతోంది. అధిష్టానం రూపొందించిన వ్యూహంలో భాగంగా వారంతా ఇపుడు రెండో అంకానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, సీమాంధ్ర ఎంపీలు సమైక్యస్వరాన్ని మార్చి విభజన వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. మిగతావారు కూడా అదే బాటపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొనేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ తొలిభేటీ అవుతోంది. ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా.. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విభజనకు అనుకూలురుగా ఉన్న మంత్రులు, ఇతర నేతలతో ఈ కమిటీని ఇటీవలే ఏర్పాటుచే సిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలిభేటీ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయానికి అనుగుణంగా సీమాంధ్ర ప్రజలను మార్చే మార్గాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సమైక్య ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మెల్లమెల్లగా దాన్ని చల్లబరిచే ప్రయత్నాలపై చర్చించనుంది. ఢిల్లీ పెద్దల డెరైక్షన్ మేరకు ఇప్పటివరకు సమైక్య రాష్ట్రం, పదవులకు రాజీనామాలు అంటూ పైపైన హడావుడి సృష్టించి ఉత్తుత్తి రాజీనామాలతో ప్రజలను బురిడీ కొట్టించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ అసలు స్వరూపాన్ని బయటకు తీస్తున్నారు. తాము సమైక్యవాదులమేనని, కానీ కేంద్రం నిర్ణయం తీసుకున్నందున సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను రక్షించడంపై దృష్టి సారిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, జేడీ శీలం, కిల్లి కృపారాణి సహా రాష్ట్ర మంత్రులు కూడా విభజనకు అనుకూలంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తుపాను పేరుతో ప్రజల్లోకి.. పై-లీన్ తుపానును సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్జీఓలను, వివిధ ఇతర ఉద్యోగ సంఘాలను సమ్మెనుంచి కొంతమేర వెనక్కు తగ్గేలా చేసింది. దీన్ని అదనుగా చేసుకొని కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ప్రాంతాల్లో అడుగుపెట్టడం ప్రారంభించారు. బాధితుల పరామర్శ పేరిట సమైక్య ఉద్యమంలోకి చొరబడే ప్రయత్నాలు చేశారు. రెండునెలలకు పైగా తమ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టడానికి సాహసించని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పై-లీన్ తుపాను బాధితుల పరామర్శపేరిట విజయనగరానికి వెళ్లారు. ఉద్యమ తాకిడి తగలకుండా ఉండేందుకు భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన సాగించారు. ఉద్యమాన్ని మెల్లమెల్లగా చల్లార్చి తమ అసలు కార్యాచరణను ప్రారంభించేందుకు అసలైన తరుణమిదేనని తలచి ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశాన్ని బొత్స ఏర్పాటుచేయించారు. కేంద్రమంత్రులు పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, ఇలా ఒకరొకరుగా సీమాంధ్రలోకి అడుగుపెడుతున్నారు. సమైక్యపలుకులు వినిపిస్తూనే విభజన అనివార్యమైతే.. అంటూ సన్నాయినొక్కులు ప్రారంభించారు. మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తొలి నుంచీ తాను రాజీనామా చేసేదే లేదని చెబుతూ ఇపుడు సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలకోసం కేంద్రమంత్రుల బృందాన్ని కలుస్తామని పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తప్పదని, ఈ విషయంలో తాను కేంద్రమంత్రుల బృందాన్ని కలుస్తానని రాష్ట్రమంత్రి బాలరాజు అంటున్నారు. ఏతావాతా ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు మెల్లమెల్లగా స్వరం మారుస్తూ అధిష్టానం బాటలో సీమాంధ్ర ప్రజలను మరల్చే ప్రయత్నాల్లో పడుతున్నారు. గురువారం నాటి సమావేశంలో ఇవే అంశాలపై కీలకచర్చ సాగించనున్నారు. -
జగన్ వ్యక్తిగతంగా కలవాలి: స్పీకర్
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఎంపీల రాజీనామాలపై హఠాత్తుగా నిర్ణయం తీసుకోలేమని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఇంత హఠాత్తుగా రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. 13 మంది ఎంపీల రాజీనామా లేఖలు అందాయని వెల్లడించింది. ఎంపీల రాజీనామాల లేఖలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది రాజీనామా చేసిన వారిలో స్పీకర్‌ను ఇప్పటివరకూ ఏడుగురు ఎంపీలు కలిశారని పేర్కొంది. తనను వ్యక్తిగతంగా కలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హర్షకుమార్, మాగుంట, కొనకళ్ల నారాయణ, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజులను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కోరారు. రాజీనామా చేసిన ఎంపీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (కడప) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు) ఎస్పీరై రెడ్డి (నంద్యాల) అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం) సాయిప్రతాప్ (రాజంపేట) రాయపాటి సాంబశివరావు (గుంటూరు) మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు) లగడపాటి రాజగోపాల్ (విజయవాడ) కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం) కనుమూరి బాపిరాజు (నరసాపురం) హర్షకుమార్ (అమలాపురం) ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి), సబ్బం హరి (అనకాపల్లి) -
సీమాంద్ర ఎంపీల రాజీనామాలపై స్పీకర్ స్పందన
-
రాజీనామాల ఆమోదం స్పీకర్ నైతిక బాధ్యత
రాజీనామాలపై స్పీకర్ ఈరోజే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శనివారం మధ్యాహ్నం స్పీకర్ మీరాకుమార్ను విడివిడిగా ఆమె ఛాంబర్లో కలిసి, తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ప్రజల కోరిక మేరకే తాము రాజీనామాలు చేస్తున్నామని, సీమాంధ్రుల మనోభావాలు అధిష్ఠానం దృష్టికి తెచ్చామని చెప్పారు. రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని ప్రజలు చెప్పబట్టే వాటి ఆమోదానికి వచ్చామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని అందరూ వ్యక్తిగతంగా చెప్పామని, వాటిని ఆమోదించడం స్పీకర్ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. సాధారణంగా స్పీకర్ శని, ఆదివారాల్లో పార్లమెంటుకు రారని, కానీ తమ ఒత్తిడి మేరకు ఆమె వచ్చి.. తమ నలుగురితో మాట్లాడారని సాయిప్రతాప్ చెప్పారు. తాము ఎంతమంది, ఎవరెవరు వచ్చామో కూడా టిక్ పెట్టుకున్నారని, గతంలోనే చేసిన రాజీనామాలు ఆమోదించాలని మరోతూరి కోరామని ఆయన అన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని, మా కర్తవ్యాన్ని స్పీకర్ ముందు చెప్పామని అన్నారు. ఇదే సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ''స్పీకర్‌ను వ్యక్తిగతంగా చాంబర్లో కలిశాం. ఆగస్టు 2న రాజీనామాలు చేశాం. గతంలోనూ ఓసారి చెప్పాం. ఇప్పటికి 57 రోజులైపోయింది, అయినా సమాధానం లేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని కోరాం. రాతపూర్వకంగా మరోసారి ఇచ్చాం. సాయంత్రంలోగా ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెబుతాం'' అని అన్నారు. ఎంపీలు రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని ఉద్యమిస్తున్న ప్రజలు చెప్పడంతో తాము ఆలోచించుకుని.. ఆమోదానికి పట్టుబట్టామని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సాయంత్రానికి లెక్కలన్నీ తేలిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం యథార్థ పరిస్థితిని చెప్పారని, ఈ రాష్ట్రాన్ని విడదీయాలనే ప్రయత్నంలో ఎన్ని చిక్కుముడులున్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విశ్లేషించారని అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే, సీమాంధ్రులు పట్టుకుని వదలట్లేదన్న అపోహ సరికాదని, రాజధాని అక్కడే ఉంది. విడదీయలేనంత బలమైన లింకులున్నాయని, అందుకే సమైక్యంగా ఉండాలంటున్నామని ఆయన చెప్పారు. -
నేడు స్పీకర్‌ను కలవనున్న సీమాంధ్ర ఎంపీలు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ను శనివారం మధ్యాహ్నం కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచేందుకు గతంలోనే తమ పదవులకు రాజీనామా చేసిన వీరంతా స్పీకర్‌ను కలిసి వాటి ఆమోదం కోసం ఆమెను కోరనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డిని మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురికి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కబురొచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, అనంత వెంకట్రామిరెడ్డిలతో పాటు.. శుక్రవారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. -
మీరు రాజీనామాలు చేయండి.. మేం విరమిస్తాం!
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. అదేసమయంలో రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో చేరాలని సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డిలు స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేస్తే చేసుకోండి’ అన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేందుకు యూపీఏ సర్కారు, లోక్‌సభ స్పీకర్‌ను అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. రాజీనామాలకు యూపీఏ భయపడుతోందని విమర్శించారు. ‘సీమాంధ్ర ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో దాక్కోవచ్చు. 2014 ఎన్నికల్లో ప్రజల ముందుకు రాకతప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. ఉద్యమం నుంచి తప్పించుకుంటున్న నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ నెల 30 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వాళ్లే హైదరాబాద్ విడిచిపెట్టాలన్న వాఖ్యలపై.. హైదరాబాద్ అందరిదీ అని చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సీమాంధ్రలో మంగళవారం జరిగిన బంద్ విజయవంతమైందన్నారు. -
ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
-
ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు రేపు స్పీకర్ అపాయింట్మెంట్
-
ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు రేపు స్పీకర్ అపాయింట్మెంట్
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఏడుగురికి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నాటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ గతంలోనే ఈ ఏడుగురు ఎంపీలు స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు ఆ ఏడుగురు ఎంపీలకూ స్పీకర్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖలు రాశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో పాటు.. ఎంపీలు రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా గట్టిగా వస్తుండటంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు. అలా రాజీనామాలు చేయని వారికి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అసలు యూపీఏ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు.. తెలంగాణ నోట్‌ను ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో కూడా సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. -
'అవసరమైతే సీఎంతో సహా అందరం రాజీనామా చేస్తాం'
-
'అవసరమైతే సీఎంతో సహా అందరం రాజీనామా చేస్తాం'
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకోవడానికి, పార్లమెంట్లో విభజన బిల్లు ఓడించడానికి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగుతారని రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్‌లతోపాటు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఓ వేళ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ మరింత సులువు అవుతుందన్నారు. సమైక్యం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామాలు తప్పని సరైతే సీఎంతో సహా అందరం పదవులకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామాలు చేస్తామని కుండబద్దల కొట్టినట్లు చెప్పారు. ఓ వేళ రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్రపతి పాలన విధించి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తారు వారు అభిప్రాయపడ్డారు. నూతన పార్టీ ఏర్పాటుపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలల్లో ఓ ఆలోచన ఉందని వారు పేర్కొన్నారు. సీఎం కిరణ్‌తో పాటు పలువురు సీమాంధ్ర మంత్రులు న్యూఢిల్లీ వెళ్తున్నట్లు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు వెల్లడించారు. -
రాజీనామాలపై స్పందించిన సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు
-
'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే'
తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేబినేట్ నోట్ వస్తే కొంత మంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేస్తామంటున్నారు, మిగిలిన ఎంపీలు, కేంద్రమంత్రుల నిర్ణయం ఏమిటి అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు అశోక్‌బాబుపై విధంగా స్పందించారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీ నామాలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు. జులై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమానికి సహకరిస్తున్న ప్రజలకు ఆ సందర్భంగా అశోక్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ఎమ్మెల్యేలను కోరతామన్నారు. -
ఇది మరో డ్రామానా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి 50 రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. మరో పక్క ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజీనామాలు చేయకుండా ఉండాలని అంటున్నారు. వారి మాటలలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జులై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమం ఊపందుకుంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేశారు. ఉద్యమం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత అండలేకుండా ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఎన్జీఓలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు మొదలు పెట్టారు. దాంతో ఉద్యమం ఉధృతమైంది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎదోఒకటి చెబుతూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలలో కలకలం మొదలైంది. వాస్తవానికి షిండే మొదటి నుంచి విభజన ప్రక్రియ ఆగదని చెబుతూనే ఉన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్లు ఈ నెల 3న ప్రకటించారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యం జరగదని కూడా చెప్పారు. ఆ ప్రకారంగా 20 రోజులు కూడా కాక ముందే నోట్ సిద్దమైనట్లు ప్రకటించారు. హైదరాబాద్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా షిండే చెప్పారు. అయితే రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాదని చెప్పారు. నోట్‌ను పరిశీలించిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు పంపుతామన్నారు. షిండే ప్రకటనతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో కదలిక వచ్చింది. నోట్‌పై మంత్రి మండలి చర్చిస్తే పరిస్థితి విషమించుతుందన్న ఆందోళన వారిలో మొదలైంది. అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని భావించారు. కాని ఇప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్ర ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేయడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారందరూ కలిసి ఈరోజు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఆ లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఎంపి లగడపాటి మాట్లాడుతూ అంతిమ విజయం సమైక్యవాదానిదేనన్నారు. సమైక్యాంధ్ర మినహా హైదరాబాబ్ కేంద్ర పాలిత ప్రాంతం గానీ, మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించం అని చెప్పారు. విభజన దిశగా ఒక్క అడుగు ముందుకేసినా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వద్ద మొండికేసుకొని కూర్చుంటామన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనన్నారు. శిలాశాసనానికి చోటులేదు-ప్రజా శాసనానికే చోటు అన్నారు. తమని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని, పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని భరోసా కల్పిస్తేనే రాజీనామా ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పారు. షిండే కేబినెట్ నోట్ నిజమని తేలితే రాజీనామా చేస్తామని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన లగడపాటి చివరగా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి తాము ఉండి తీరాలన్నారు. లగడపాటి చూస్తే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు తమ రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం అంతా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఉత్తుత్తి రాజీనామా ప్రకటనలుగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మరో డ్రామాగా పలువురు భావిస్తున్నారు. -
మాట్లాడితే తట్టుకోలేరు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు చేయకుండా విభజనను ఎలా ఆపుతారో ప్రజలకు చెప్పాలని సీమాంధ్ర ఎంపీలను ఉద్యోగుల సమైక్య జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేయకుండా, అది చేస్తాం, ఇది చేస్తామని ఢిల్లీలో, హైదరాబాద్‌లో మీడియాకు చెబితే లాభం లేదు. ప్రజలకు చెప్పండి. మీరు చెప్పేది ప్రజలు నమ్మితే అందరూ ఉద్యమంలో పాల్గొనవచ్చు’ అని సూచించారు. ఎంపీల మాటలను ప్రజలు విశ్వసిస్తే వారిపై దాడులు కూడా ఉండవన్నారు. ‘‘7 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నా ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించిన సంఘటనలే జరగలేదు. మేం క్రమశిక్షణ గీత దాటి మాట్లాడటం మొదలుపెడితే రాజకీయ నేతలు తట్టుకోలేరు’’ అని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతోందని, ఏ పార్టీనీ భుజానికి ఎత్తుకోలేదని చెప్పారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు నెల బోనస్ ఇస్తామన్న వైఎస్సార్సీపీ ప్రకటనను ప్రస్తావించగా, ‘సహృదయంతో అవకాశమిచ్చారు. కానీ తీసుకోవడానికి మేం సిద్ధంగా లేము’ అని బదులిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించడానికి హైదరాబాద్‌లో త్వరలో ‘సోరద సద్భావన సదస్సు’ పేరిట సభ నిర్వహించే యోచన ఉందన్నారు. కాగా, పౌర సరఫరాలకు అంతరాయం కలుగుతోంది కాబట్టి విధుల్లోకి రండంటూ రెవె న్యూ సిబ్బందిపై పలు జిల్లాల్లో కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేత బి.వెంకటేశ్వర్లు అన్నారు.ప్రజల మద్దతుతో సమ్మెలో ఉన్న ఉద్యోగులను విధుల్లోకి రావాలంటూ ఒత్తిడి చేయొద్దన్నారు. 25న ఢిల్లీకి సమైక్యాంధ్ర ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మె చేపడుతున్న సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. దీని కోసం ఈనెల 25న ఢిల్లీ బయలుదేరనున్నారు. అక్కడ మూడు రోజులపాటు రాష్ట్ర విభజన, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతలను, జాతీయ నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరాలని సమైక్యాంధ్ర ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఢిల్లీలో నిరసనల్లో పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమ సత్తాను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసొచ్చేలా చేయాలని సచివాలయ సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కార్యదర్శి కె. వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాల్సిందేనని ఆ ప్రాంత ఉద్యోగులు పునరుద్ఘాటించారు. ‘రాజీనామాలు చేయాలంటూ ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు’ అంటూ వారు చేసిన ప్రకటనను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఖండించింది. ఎంపీల రాజీనామా డిమాండ్‌తోనే ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారని, అదే డిమాండ్‌తో సమ్మెకు దిగారని గుర్తు చేసింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షతన అన్ని ఉద్యోగ, కార్మిక, పౌర సంఘాలు సోమవారం సమావేశమయ్యాయి. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి లేదని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ధైర్యముంటే ఇదే విషయాన్ని వారి వారి నియోజకవర్గాల్లో సభలు పెట్టి చెప్పాలని సవాలు విసిరారు. తర్వాత ప్రజలే వారి సంగతి చూస్తారన్నారు. రాజీనామాలు చేయకుండా, ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ’మంటూ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడానికి వారంతా అసెంబ్లీలో ఉండాలన్నారు. తీర్మానం వీగిపోయాక రాజీనామాలు చేసినా, సభను రద్దు చేసినా అభ్యంతరం లేదన్నారు. పార్టీలు విప్ జారీ చేసినా విభజన తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరారు. సమైక్య రాష్ట్రాన్ని కోరే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామన్నారు. విద్యార్థులు, చిన్న పిల్లలను ఉద్యమంలోకి తీసుకురావద్దనే అభిప్రాయముందని, దీనిపై జేఏసీ చర్చిస్తోందని చెప్పారు. జేఏసీ నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని విలేకరులు ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమన్నారు. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుండటం నిజమేనన్నారు. అందుకే వాటిని రెండు రోజులు నిలిపేస్తున్నామని, తర్వాత వారు కూడా ఉద్యమంలోకి వచ్చి సాధారణ చార్జీలు వసూలు చేసే అవకాశముందని తెలిపారు. మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలిసే యోచన ఉందన్నారు. ఉద్యమంలో చేపట్టే రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణకు కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు పౌర సంఘాలకూ కమిటీలో చోటు కల్పిస్తామన్నారు. కమిటీ కార్యవర్గాన్ని ఈ నెల 20న విజయవాడ సభలో ప్రకటిస్తామన్నారు. 23న హిందూపురంలో, 29న కర్నూలులో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
సమావేశానికి ఎనిమిది మంది ఎంపీలు దూరం
-
‘బలవంతపు సంసారాన్ని ఏమంటారో.. మీ భార్యలనడగండి’
సీమాంధ్ర ఎంపీలపై టీ-ఎంపీలు పొన్నం, గుత్తా ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయండంటే.. దాన్ని ఏమంటారో మీ భార్యల్నే అడిగి చెప్పండి’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సీమాంధ్ర ఎంపీలపై ధ్వజమెత్తారు. వారు గురువారమిక్కడ ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక సైతం దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా, ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం లోక్‌సభలో సైతం ఉండవల్లి ప్రసంగాన్ని తాము అడ్డుకోలేదని, వాస్తవాలు చెప్పమని మాత్రమే అడిగామని అన్నారు. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా సీమాం ధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను ఇకనైనా కట్టిపెట్టాలని సూచించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా సీఎం విద్వేషాలను మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘా తం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారంతా విభజనను సమర్థించాలని వారు సూచించారు.