న్యూఢిల్లీ : లోక్సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలు తమ గళం విప్పారు. సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లం రాజు, పురందేశ్వరి, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ నిరసన తెలియచేస్తున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ వెల్లోనికి దూసుకు వెళ్లిన సీమాంధ్ర ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, బొత్స ఝాన్సీ ఆందోళన కొనసాగిస్తున్నారు.
లోక్సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసన
Published Mon, Feb 17 2014 11:30 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement