
సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడతా: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా తలెత్తే సమస్యలను మంత్రుల బృందం(జీఓఎం) పరిష్కరిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజీనామా చేసిన సీమాంధ్ర ఎంపీలను పిలిచి మాట్లాడాతామని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉన్నంత మాత్రానా పోలవరానికి ఇబ్బంది ఉండబోదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని దిగ్విజయ్ నిన్న అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది చాలా సున్నిత అంశమని, ఈ విషయాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని తెలిపారు.సింగ్ స్పష్టం చేశారు.