
సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ
న్యూఢిల్లీ : సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చేది లేదని లోక్సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేక చర్యలను తాము సమర్థించమని ఆమె గురువారమిక్కడ తెలిపారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని సుష్మ డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. స్వలింగ సంపర్కుల హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.