ఎంపీల సస్పెన్షలన్నీ డ్రామాలే: లక్ష్మణ్ | BJP Leader Lakshman blames Congress played MPs Suspension Drama | Sakshi
Sakshi News home page

ఎంపీల సస్పెన్షలన్నీ డ్రామాలే: లక్ష్మణ్

Aug 23 2013 1:32 PM | Updated on Mar 29 2019 9:18 PM

లోక్సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్లన్నీ డ్రామాలేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : లోక్సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్లన్నీ డ్రామాలేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై బిల్లు పెడితే ఎవరు ఏ పక్షమో తేలిపోతుందని ఆయన అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకించిన  వారిని దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లక్ష్మణ్ శుక్రవారమిక్కడ సవాల్ చేశారు. బీసీ సబ్ప్లాన్ సాధన కోసం  ఈ నెల 26, 27 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా లోక్సభలో 11 మంది ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానం సందిగ్థంలో ఉండగా... తాజాగా  ఆ తీర్మానంతో సంబంధం లేకుండా స్పీకర్‌ మీరాకుమార్ శుక్రవారం 12 మంది సీమాంధ్ర ప్రాంత ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement