ఓమై గాడ్‌ నాకు ఎంపీ టికెటా..! | Bangalore South Lok Sabha Ticket BJP Gives To Young Lawyer | Sakshi
Sakshi News home page

ఓమై గాడ్‌ నాకు ఎంపీ టికెటా..!

Published Tue, Mar 26 2019 6:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

Bangalore South Lok Sabha Ticket BJP Gives To Young Lawyer - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్‌, బలమైన నేతలను కాదని బెంగళూరు దక్షిణ లోక్‌సభ టికెట్‌ను 28ఏళ్ల యువ న్యాయవాదికి కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ స్థానం నుంచి బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి అనంత కుమార్‌ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వీ సూర్యను తెరపైకి తీసుకువచ్చింది. సూర్యను బెంగళూరు దక్షిణ స్థానానికి తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం ‍ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్‌కు గురయ్యారు.

‘‘ఓమై గాడ్‌ నాకు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చిందన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నా’’అని సూర్య ట్విటర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బీకే హరిప్రసాద్‌పై తేజస్వీ పోటీపడనున్నారు. యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ వర్గాలు తెలిపారు.  ఈ నియోజకవర్గం నుంచి అనంత్‌ కుమార్‌ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ నేత నందన్‌ నీలేకనిపై అనంత్‌ కుమార్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.

I am humbled. Grateful. Overwhelmed. I thank PM @narendramodi for giving me this opportunity. I can't thank you enough, Modi Ji. I promise you that I shall work ceaselessly for our motherland till my last breath. That is the only way I can repay this debt of gratitude. THANK YOU!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement