'అవసరమైతే సీఎంతో సహా అందరం రాజీనామా చేస్తాం' | Seemandhra mps, mlas, mlcs including CM also resignation due to State bifuracation | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 22 2013 2:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకోవడానికి, పార్లమెంట్లో విభజన బిల్లు ఓడించడానికి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగుతారని రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్లతోపాటు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఓ వేళ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ మరింత సులువు అవుతుందన్నారు. సమైక్యం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామాలు తప్పని సరైతే సీఎంతో సహా అందరం పదవులకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామాలు చేస్తామని కుండబద్దల కొట్టినట్లు చెప్పారు. ఓ వేళ రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్రపతి పాలన విధించి ఆంధ్రప్రదేశ్ను విభజిస్తారు వారు అభిప్రాయపడ్డారు. నూతన పార్టీ ఏర్పాటుపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలల్లో ఓ ఆలోచన ఉందని వారు పేర్కొన్నారు. సీఎం కిరణ్తో పాటు పలువురు సీమాంధ్ర మంత్రులు న్యూఢిల్లీ వెళ్తున్నట్లు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు వెల్లడించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement