
జగన్ వ్యక్తిగతంగా కలవాలి: స్పీకర్
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఎంపీల రాజీనామాలపై హఠాత్తుగా నిర్ణయం తీసుకోలేమని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఇంత హఠాత్తుగా రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. 13 మంది ఎంపీల రాజీనామా లేఖలు అందాయని వెల్లడించింది. ఎంపీల రాజీనామాల లేఖలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది
రాజీనామా చేసిన వారిలో స్పీకర్‌ను ఇప్పటివరకూ ఏడుగురు ఎంపీలు కలిశారని పేర్కొంది. తనను వ్యక్తిగతంగా కలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హర్షకుమార్, మాగుంట, కొనకళ్ల నారాయణ, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజులను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కోరారు.
రాజీనామా చేసిన ఎంపీలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (కడప)
మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు)
ఎస్పీరై రెడ్డి (నంద్యాల)
అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం)
సాయిప్రతాప్ (రాజంపేట)
రాయపాటి సాంబశివరావు (గుంటూరు)
మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు)
లగడపాటి రాజగోపాల్ (విజయవాడ)
కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం)
కనుమూరి బాపిరాజు (నరసాపురం)
హర్షకుమార్ (అమలాపురం)
ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి),
సబ్బం హరి (అనకాపల్లి)