న్యూఢిల్లీ: రాజీనామాల పేరుతో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు నాటకాలు ఆడుతున్నారని సీమాంధ్ర గెజిటెడ్ జేఏసీ కన్వీనర్ సి.వి. మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు సర్కారు దిగి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు.
రేపు జంతర్‌మంతర్‌లో న్యాయవాదులు ధర్నా చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు మొయిలీ, ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీతారాం ఏచూరిని, జవదేకర్‌ను కలిసి.. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. మరోవైపు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు ఎపీఎన్జీవోలు ప్రకటించారు.
'రాజీనామాల పేరుతో సీమాంధ్ర నేతల నాటకాలు'
Published Thu, Oct 17 2013 8:15 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement