jantarmantar
-
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు. ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు. -
బీసీల మహాధర్నాతో హోరెత్తిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 29 రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బిజ్లీ క్రాంతి యాత్ర పేరుతో ఢిల్లీ చేరుకున్న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు బుధవారం జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు నినాదాలిచ్చారు. ఈ భారీ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సీపీఎం ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ నేత డి.రాజా, సహా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే 28 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ లభించదని, ఒక్కో రైతు ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీలు కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటీకరణతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉండదని, దీంతో 25 లక్షల మంది ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచిఉందని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దని తీర్మానాలు చేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని.. ఇంకా చేయాలని చూస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంటులో విద్యుత్ ఉద్యోగుల సమస్యపై కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ను పెంచాలి బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. దేశమంతా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.1,400 కోట్లు కేటాయించి 56 శాతం జనాభాను అవమానించారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
జంతర్‌మంతర్ వద్ద పారామిలటరీ బలగాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డే సైనికులు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. పారామిలటరీ బలగాలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద జవాన్లు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పారామిలటరీ బలగాలతో దివాళీ వేడుకలు జరుపుకున్నా తమ కోసం ఆయన ఏం చేశారని ఓ సైనికుడు ప్రశ్నించారు. తాము 2004 నుంచి ఫించన్ పొందడం లేదని, తమకు ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ అమలు కావడం లేదని, కనీసం అమరవీరుల హోదాను నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారామిలటరీ బలగాల డిమాండ్లను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు తాము గట్టి సందేశం పంపుతామని నిరసనకారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల సవతితల్లి ప్రేమను కనబరుస్తోందన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ తమ కోసం చేసిందేమీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రత్యేకహోదా నినాదాలతో దద్దరిల్లిన జంతర్‌మంతర్
-
అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు!
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం హోమం నిర్వహించారు. మంత్రాలు జపిస్తూ ట్రంప్‌కు విజయం చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు హిందూ సేన కార్యకర్తలు. ఇటీవలి ప్రైమరీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడానికి దూసుకుపోతున్న ట్రంప్ మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడని, ఆయన విజయం సాధించాలని ఈ సందర్భంగా హిదూసేన కార్యకర్తలు వేడుకున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ 'డొనాల్డ్ ట్రంప్' అని ఈ సందర్భంగా హిందూ సేన కార్యకర్తలు వెల్లడించారు. 'వి లవ్ ట్రంప్', 'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా బ్యాన్ చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
'ప్చ్.. మా అన్నయ్య పాలన నచ్చలే': ప్రహ్లాద్ మోదీ
న్యూఢిల్లీ: తన అన్నయ్య ప్రధాని నరేంద్రమోదీ పరిపాలన బాగాలేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. ప్రజల అంచనాను బీజేపీ ప్రభుత్వం అందుకోలేకపోయిందని, వారి సమస్యలను తీర్చేందుకు కచ్చితంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం జంతరమంతర్ వద్ద ఆల్ ఇండియా ఫేయిర్ ప్రైస్ షాప్ ఫెడరేషన్ నిర్వహించిన దర్నాలో పాల్గొన్న ప్రహ్లాద్ మోదీ(ఈ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు) తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ధర్నాలో దిగిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ గెలుపుకోసం మీరు ఆరోజు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ కట్టబెట్టారని, కానీ, నేడు మళ్లీ ఇక్కడ ధర్నాకు కూర్చున్నారంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైనట్లేనని అన్నారు. అయితే, తాను చేసేది తన సోదరుడు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాదని, సమస్యల విషయంలో తన గొంతును మాత్రమే వినిపిస్తున్నానని చెప్పారు. -
ఢిల్లీలో ‘ముంపు’ పోరు
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు చేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనకు తరలివెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపియాలని, ఆదివాసీలను రక్షించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు వ్యతరేక కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ, కో కన్వీనర్ గుండు శరత్, నాయకులు కె సీతారాములు, ఆదినారాయణ, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, నర్సింహరావు, గౌసుద్దీన్, ఖాసీం, లచ్చిరాం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె రంగారెడ్డి, ప్రజా సంఘ నాయకులు జగదీష్, మాలమహానాడు నాయకులు శేఖర్ పాల్గొన్నారు. -
దీక్షను విరమించిన బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ తెలిపారు. దీక్షకు దిగిన కొద్ది గంటల్లోనే బిన్నీ దీక్షకు విరామం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ అమలు పరచడంలేదంటూ బిన్నీ విమర్శించి దీక్షకు పూనుకున్నారు. తాము చేస్తున్న డిమాండ్ ల పై 10 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం చెప్పలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తానని కుమార్ బిన్నీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. -
జంతర్‌మంతర్ వద్ద బిన్నీ నిరాహార దీక్ష
ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఢిల్లీ సర్కారు అమలు చేయట్లేదంటూ ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ''నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మీడియా ద్వారా మాత్రమే తెలిసింది. నాకు మాత్రం ఇంతవరకు ఈ మెయిల్ ద్వారా గానీ, లేఖ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందలేదు'' అని బిన్నీ విలేకరులతో అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏకే వాలియాను తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓడించిన వినోద్ కుమార్ బిన్నీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు. గతంలో ఆయన ఢిల్లీలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అయితే.. ఆయనకు మంత్రి పదవిని మాత్రం కేజ్రీవాల్ ఇవ్వలేదు. అప్పుడే అలిగిన బిన్నీ, సంచలనాత్మక విషయాలు బయటపెడతానని బెదిరించడంతో పార్టీలో మంచి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో బుజ్జగించారు. దాంతో ప్రమాణ స్వీకారం నాటికి మాత్రం ఎలాగోలా నెమ్మదించారు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఎలాంటి పదవి రాకపోవడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ బిన్నీ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు తగ్గించడంలేదని, మహిళలకు భద్రత కల్పించడంలేదని, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైనప్పుడు సరిగా స్పందించలేదని ఆయన అన్నారు. దాంతో పాటు.. కేజ్రీవాల్ మీద కూడా ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. పదేపదే ఇలాగే చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన పార్టీ అగ్రనాయకత్వం, బిన్నీని నేరుగా పార్టీ నుంచి బహిష్కరించింది. -
'రాజీనామాల పేరుతో సీమాంధ్ర నేతల నాటకాలు'
న్యూఢిల్లీ: రాజీనామాల పేరుతో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు నాటకాలు ఆడుతున్నారని సీమాంధ్ర గెజిటెడ్ జేఏసీ కన్వీనర్ సి.వి. మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు సర్కారు దిగి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు. రేపు జంతర్‌మంతర్‌లో న్యాయవాదులు ధర్నా చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు మొయిలీ, ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీతారాం ఏచూరిని, జవదేకర్‌ను కలిసి.. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. మరోవైపు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు ఎపీఎన్జీవోలు ప్రకటించారు. -
ఢిల్లీకి తరలిన తెలంగాణవాదులు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనడానికి ప్రజాసంఘాల జేఏసీ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణవాదులు తరలివెళ్లారు. ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, శ్రవణ్‌కుమార్, కరణ్ జయరాజ్, గద్దల అంజిబాబు, కోక సైదులు, ప్రవీణ్ తదితరులు వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి