ఢిల్లీకి తరలిన తెలంగాణవాదులు
Published Thu, Oct 3 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనడానికి ప్రజాసంఘాల జేఏసీ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణవాదులు తరలివెళ్లారు. ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, శ్రవణ్‌కుమార్, కరణ్ జయరాజ్, గద్దల అంజిబాబు, కోక సైదులు, ప్రవీణ్ తదితరులు వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement