t jac
-
టీ జేఏసీ ప్రజా మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రజాకాంక్షలను రాజకీయ పార్టీ ల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తెలంగాణ జాయిం ట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) మెజారిటీ ప్రజల అవసరాలు, ప్రాధాన్యత రంగాలను విశ్లేషించి ప్రజల మేనిఫెస్టోను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనలో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీతోపాటు జిల్లా కమిటీ సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, వివిధ సామాజిక సంస్థలు, ఉపాధి హామీ రేడియో, టీఎస్ ఆర్టీసీ పరిరక్షణ సమితి, విద్యా పరిరక్షణ కమిటీలు భాగస్వాములయ్యారు. దాదాపు 15 ప్రాధాన్యత రంగాల్లోని కీలకాంశాలపై టీజేఏసీ బృం దం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు విశ్లేషణ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు టీజేఏసీ చైర్మన్ కంచర్ల రఘు తెలిపారు. ఈ మేనిఫె స్టోను టీజేఏసీ త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అందించనుంది. ఆయా పార్టీలు వాటిలోని అంశాలను మేనిఫెస్టోల్లో ప్రకటించేలా చర్యలు తీసుకోనుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ వీటి అమలులో తాత్సారం జరిగితే ఉద్యమిం చనున్నట్లు టీజేఏసీ ప్రకటించింది. మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగానే వచ్చే ఐదేళ్లలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. మేధావుల్లో తెలియని భయం కనిపిస్తోంది: ఆర్కైవ్స్ డీజీ మురళి ‘మేధావులు చురుకుగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. కానీ మన సమాజంలోని మేధావుల్లో ఎక్కడో తెలియని భయం కనిపిస్తోంది. దాం తో వారంతా సమస్యలపై గళమెత్తేందుకు ఆలోచిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీనివల్ల వ్యవస్థ సంకటంలో పడుతుంది’ అని రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డా రు. టీ జేఏసీ రూపొందించిన ప్రజల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మేధావులంటే ఉన్నత చదువులు చదివినోళ్లే కాదు. కాస్త చదువుకొని సమాజంపై అవగాహన, విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. వారంతా బయటకు వస్తేనే సమాజంలో మార్పు మొదలవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాలు రూపొందిస్తున్న బడ్జెట్ ఆర్భాటంగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. బడ్జెట్‌పైన అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతారు. కానీ ఖర్చుపైన మాత్రం పెద్దగా చర్చించరు. ఖర్చు చేసిన నిధులపైనా సుదీర్ఘ చర్చ జరపాల్సిన అవసరం ఉంది’అని సూచించారు. టీ జేఏసీ మేనిఫెస్టోలోని అంశాలు పేదల అభ్యున్నతికి తోడ్పడతాయని, వాటిని అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతానికిపైగా అమలు చేసే కార్యక్రమాలే టీజేఏసీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. పారదర్శకంగా, పద్ధతిగా నిధులు ఖర్చు చేస్తే వాటి ఆచరణ అసాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేలా మేధావులు ప్రయత్నించాలని, జీరో బేస్డ్ ఎలక్షన్స్ జరిగేలా ఉద్యమిం చాలని మురళి సూచించారు. సచివాలయంలో సెక్షన్ అధికారి నుంచి సీఎం వరకు ప్రతి దశలో జరిగే ఫైళ్ల పురోగతిని ప్రజలు తెలుసుకునే వెసులుబాటు కలి గిస్తే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ప్రజల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... వ్యవసాయం: రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు. రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చేలా ఆదాయ కమిషన్ ఏర్పాటు. రైతులకు నెలకు రూ. 18 వేల ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు. మహిళలు: వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మహిళలకు గుర్తింపు కార్డులు. వ్యవసాయ కూలీలు, సాగు చేస్తున్న ఒంటరి మహిళలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లోని మహిళల ఉపాధికి సహకారం. భూ సంస్కరణలు: కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టంలో సాగుదారుల కాలమ్ పునరుద్ధరణ. భూమిలేని పేదలకు భూ పంపిణీ. శ్రీశైలం ప్రాజెక్టు సహా వివిధ సాగునీటి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట. నీటిపారుదల: కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పునఃపరిశీలన. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అవసరమైన మార్పులతో పునరుద్ధరణ. విద్యుత్: గృహ, వ్యాపార, చిన్న, కుటీర పరిశ్రమలకు విద్యుత్ చార్జీల తగ్గింపు. 100 యూనిట్ల వరకు ఉచితం, 200 యూనిట్ల వినియోగంపై సగం చార్జీ. రైతులు, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉండే ప్రైవేటు నర్సరీలకు ఉచిత విద్యుత్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ: ఉపాధిహామీ పథకంలో నమోదు చేసుకున్న 51 లక్షల కుటుంబాలకు పక్కాగా 100 రోజుల పనిదినాలు. ఉపాధి కూలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు. సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు. బీసీలకూ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు. దళితులపై దాడుల నివారణ, కుల నిర్మూలన చట్టం ఏర్పాటు. ఆదివాసీలు: ఆదివాసీ ప్రజల ఉనికి, గుర్తింపునకు హామీ. అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం, పెసా చట్టాల పక్కా అమలు. పోడు భూములకు పట్టాల పంపిణీ. విద్య: విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధుల కేటాయింపు. స్కూళ్లలో ఉదయం అల్పాహారం, సాయంత్రం ఉపాహారం. ప్రైవేటు వర్సిటీల బిల్లు రద్దు. వైద్యం: ప్రతి మండలంలో పీహెచ్సీ, నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు. 24/7 పీహెచ్‌సీల పని వేళలు. అసంఘటిత కార్మిక రంగం: బీడీ కార్మికులకు కనీస వేతనాలు. హమాలీ కూలీలకు సమగ్ర చట్టం. ఆటో, మోటారు వాహన రంగాల్లోని కార్మికుల సంక్షేమం, భద్రతకు చర్యలు. పారిశ్రామిక రంగం: చిన్న, కుటీర, గృహ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. సింగరేణి పరిధిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ రద్దు. మద్య నిషేధం: రాష్ట్రంలో మద్య నిషేధం అమలు. నీరా ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకం. యువజనం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ పూర్తిస్థాయిలో భర్తీ. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్. కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం. చట్టాల అమలు: రాజ్యాంగంతోపాటు ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాల పక్కా అమలు. -
ఆ కారణాలు సహేతుకంగా లేవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జేఏసీ) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించాలనుకున్న అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు చూపిన కారణాల్లో కొన్ని సహేతుకంగా లేవని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ దేశ పౌరులందరికీ నిరసన తెలియచేసే హక్కు ఉందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని గుర్తు చేసింది. యాత్రలో పాల్గొనడానికి వచ్చే వారిని ముందుగానే అరెస్ట్ చేస్తున్న అంశానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. యాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఇతర తేదీల్లో యాత్ర నిర్వహణకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అలాగే తేదీలతోపాటు యాత్ర సందర్భంగా పాటించాల్సిన షరతులను సైతం తామే నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతివ్వాలంటూ ఆగస్టు 29న చేసుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పందించడం లేదని, తాము తలపెట్టిన యాత్రకు అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీజేఏసీ కో–కన్వీనర్ ఐ.గోపాల శర్మ దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. పోలీసులు కావాలనే జాప్యం చేశారు... అంతకుముందు పిటిషన్‌పై వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో యాత్రకు అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పష్టత కోరారని, ఘర్షణలు, రాజకీయ వైషమ్యాలు చోటుచేసుకోవచ్చంటూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో యాత్రకు అనుమతి నిరాకరించారన్నారు. నెలన్నర కిందట చేసుకున్న దరఖాస్తుపై కావాలనే జాప్యం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులిచ్చారన్నారు. అంతేగాక యాత్రకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని, చౌటుప్పల్ వద్ద పలువురిని అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మీరే రూట్ నిర్ణయించాల్సింది... ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా న్యాయమూర్తి స్పందిస్తూ నిరాకరణ ఉత్తర్వుల ద్వారా పిటిషనర్లకు వాటిని ఆమోదించడం మినహా మరో అవకాశం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం రామచంద్రరావు వాదిస్తూ టీజేఏసీ గతంలోనూ యాత్రలు చేపట్టిందని, కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో షరతులను ఉల్లంఘించడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. టీజేఏసీ నాయకులు రూట్ మ్యాప్ కూడా ఇవ్వలేదని, దీనివల్ల ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ప్రజల ఆస్తులకు జరిగే నష్టం–పౌర హక్కుల మధ్య సమతౌల్యత చూపాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని, ఆ బాధ్యతను తాము సమర్థంగా నిర్వర్తిస్తామన్నారు. పిటిషనర్ రూట్ మ్యాప్ ఇవ్వకుంటే, పోలీసులే యాత్రా మార్గాన్ని నిర్ణయించి ఉండాల్సిందని, అప్పుడు యాత్ర చేసుకోవాలా వద్దా అనే అంశాన్ని పిటిషనరే నిర్ణయించుకొని ఉండేవారని వ్యాఖ్యానించారు. -
నక్సల్స్, కాంగ్రెస్‌తో కోదండరాం కుమ్మక్కు
స్టేషన్ మహబూబ్‌నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు. పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోవాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. లేదంటే రెండు తెలుగు ప్రాంతాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో రాజకీయ పబ్బంగడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. శనివారం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కోదండరాం వెనుకబడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వల్ల సీమాంధ్ర రాజకీయనాయకుల గుత్తాధిపత్యం పోయి తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రాంతానికి నష్టం జరుగకపోగా, మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. కేవలం పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక దశాబ్దాలపాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యంకాదని నమ్మి తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు తెలంగాణ వస్తుందని తెలిశాక మాత్రం అనేక సాకులు చూపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కేవలం ఆంధ్రా ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చ గొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, సంఘటిత శక్తి, త్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణపై ద్వేషపూరిత వైఖరే అనేక అంశాలలో విభజన ప్రక్రియ నత్తనడక నడవడానికి, ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి రెండు ప్రాంతాలకూ నష్టం కలుగ జేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణలో కొనసాగుతున్నకొందరు సీమాంధ్ర రాజకీయనాయకుల, పెట్టుబడిదారుల జోక్యాన్ని తాము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన ఉద్యోగ నియామకాల విషయంలో టీజేఏసీ చేయతలపెట్టిన నిరుద్యోగ ప్రదర్శనను భగ్నం చేయడానికి చైర్మన్ ప్రో.కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం హేయమైన చర్య.. అప్రజాస్వామికం.. అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉన్న అయన ఈ విషయమై బుధవారం ఒక ప్రకటన చేస్తూ కోదండరాం అరెస్టును తీవ్రంగా ఖండించారు. నీళ్లు..నిధులు..నియామకాలు అనే అంశాలపైనే తెలంగాణ ఉద్యమం సాగింది.. కాంగ్రెస్ పార్టీ కృషి.. సోనియా గాంధీ పట్టుదలతో తెలంగాణ సాదించుకున్నాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు 33 నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా సాగుతుందని ఆయన అన్నారు. నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేసారని.. నిరుద్యోగులు అంటే కేసీఆర్ భయపడుతున్నారని అయన అన్నారు. అనేక సందర్భాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. తరువాత కొత్త జిల్లాలు వస్తే మరో 30 వేల ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పి ఇపుడు కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. స్వేచ్ఛ లేకుండా.. రాజ్యాంగ రహితంగా అణచివేసే ధోరణిలో పాలిస్తున్న ఈ పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన అన్నారు. -
తప్పు చేస్తే ప్రశ్నిస్తాం: కోదండరాం
గోదావరిఖని(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఉద్యమించిన తరహాలోనే ప్రభుత్వ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, లేకుంటే మరో ఉద్యమానికి జేఏసీ సిద్ధంగా ఉంటుందని తేల్చి చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విజయాన్ని ఆస్వాదించినట్లే పరిపాలనలో ఏవైనా తప్పులు దొర్లితే పాలకులను అడగవలసిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కలిసి నడిచేందుకు జేఏసీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, గురిజాల రవీందర్రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులుంటే ప్రభుత్వానికి సూచనలిస్తాం
-
టీ జాక్ లో తిరకాసు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం కదం కలిపి పోరాడిన వారే రాజకీయ చదరంగంలోకి దిగాక ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోపార్టీ నుంచి బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. ఒకప్పుడు జేఏసీలో కీలకంగా పనిచేసిన నేతలే, రానున్న ఎన్నికల్లో మద్దతు మాకివ్వాలంటే మాకివ్వాలంటూ జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణా జేఏసీ నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అద్దంకి దయాకర్ కాంగ్రెస్ తరపున, ఓయూ జేఏసీలో కీలకంగా వ్యవహరించిన గాదారి కిషోర్ టీఆర్ఎస్ తరపున పోటీపడుతున్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ రెబెల్‌గా మరో జేఏసీ నేత అమరేందర్ బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ స్థానం నుంచి గజ్జెల కాంతం కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా, సీటు పొంది పోగొట్టుకున్న విద్యార్థి జేఏసీ నేత కృశాంక్ పోటీకి దిగారు. జేఏసీ నేతలు పిడమర్తి రవి ,నలిగంటి శరత్ ,రసమయి బాలకిషన్ , కత్తి వెంకటస్వామిలు పోటీచేస్తున్న స్థానాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతిచ్చిన ఇతర పార్టీల నేతల నుంచే ప్రధానంగా పోటీ ఉంది. దీంతో ఇక్కడ కూడా ఎవరికి మద్దతివ్వాలో జేఏసీకి అంతుపట్టడం లేదు. దీంతో ఎవరికి మద్దతివ్వాలో పాలుపోక, మౌనాన్ని ఆశ్రయించడమే మేలనే భావనకు జేఏసీ వచ్చేసినట్లుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
టీ జేఏసీ నేతలకు సోనియా హామీ
-
టీడీపీని వ్యతిరేకిస్తాం
మీట్ ది ప్రెస్‌లో టీ-జేఏసీ నేతలు ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మా వైఖరేమిటో నిర్ణయిస్తాం స్టీరింగ్ కమిటీలో చర్చించి ప్రకటిస్తాం ఉద్యమ ద్రోహులను పార్టీల్లో చేర్చుకోవద్దు... ప్రజలు, పల్లెలే కేంద్రంగా అభివృద్ధి జరగాలి ప్రైవేటు రంగంలోనూ స్థానిక రిజర్వేషన్లు ఉండాలి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ వైఖరిని స్టీరింగ్ కమిటీలో నిర్ణయించి ప్రకటిస్తామని టీ-జేఏసీ నేతలు వెల్లడించారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన టీడీపీని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఓడించాల్సిందేనని, వారిని చేర్చుకునే పార్టీల నాయకత్వంపైనా విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం, నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యతిరేకులు అధికారం చేపడితే ఈ ప్రాంత పునర్వికాసానికి అది దోహదపడదని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. అమరుల నిబద్ధతలో కొంతైనా రాజకీయ పార్టీలకు ఉండాలన్నారు. ఇప్పటివరకు గుప్పెడు మంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారుల చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైందని, ఇకపై ప్రజలు, పల్లెలే లక్ష్యంగా తెలంగాణలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలు పొందడం ప్రజలకు హక్కుగా సంక్రమించాలని, ఆ దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పరిరక్షణ, అమలుకు పౌర సమాజం తరఫున జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. పార్టీల మేనిఫెస్టోలపై అధ్యయనం చేస్తున్నామని, అధికారంలోకి వచ్చే పార్టీ మేనిఫెస్టో కచ్చితంగా అమలయ్యే విధంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఉద్యమ నేతలు పేర్కొన్నారు. దళిత సీఎంపై వెనక్కి వెళ్లిన పార్టీపై ఆ వర్గాలే నిర్ణయం తీసుకుంటాయని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ కొనసాగడంపై కోదండరాం స్పందిస్తూ... స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్ కొనసాగడంపై కూడా ఇవే ప్రశ్నలు వచ్చాయన్నారు. అయితే, స్వాతంత్య్రం కోసం పోరాడిన ఉద్యమ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. టీఆర్ఎస్ కూడా తెలంగాణ వికాసం కోసమే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ్హ తెలంగాణలో కొత్త ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి. ్హ స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. తెలంగాణ సచివాలయాన్ని ఆంధ్రా ఉద్యోగులతో నింపితే మరోసారి పెద్ద ఎత్తున పోరాటం వస్తుంది.్హ ప్రైవేటు రంగంలోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలి. ్హ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ్హ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వేర్వేరు బ్లాకులను కేటాయించాలి. ఇరు ప్రభుత్వాల ఉద్యోగులను ఒకే బ్లాకులో ఉంచితే సమస్యలు వస్తాయి. గత జూలై 30 తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కొత్త ప్రభుత్వం సమీక్షించాలి. -
గులాబీ దండుకు గాలం!
టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కన్ను పార్టీలోకి లాగేసుకునేందుకు వ్యూహాలు రంగంలోకి కొప్పుల రాజు.. అసంతృప్త నేతలతో మంతనాలు త్వరలో 15 మంది చేరతారని గుసగుసలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్యతోనూ రహస్య భేటీ 8 మంది టీ-జేఏసీ నాయకులకు సీట్లిచ్చే ప్రతిపాదన జాగ్రత్త పడుతున్న కేసీఆర్.. పెండింగ్‌లో ఇరు పార్టీల అభ్యర్థుల జాబితాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరింత బలపడేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. టీఆర్ఎస్తో పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు మరోసారి తెరలేపింది. తనకు గట్టి పోటీనిస్తున్న ఉద్యమ పార్టీనే అందుకు ప్రధాన టార్గెట్ చేసుకుంది. టీఆర్ఎస్లోని అసమ్మతి నేతలను పార్టీలోకి లాక్కోడానికి కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో గులాబీ దండును బలహీనపరిచేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారు. టీఆర్ఎస్లో బలమైన నేతలను గుర్తించినప్పటికీ.. వారిలో పార్టీ అధినేత కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న వారినే కాంగ్రెస్ ముఖ్యులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పధానంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో.. స్థానిక టీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీ గెలుపు అవకాశాలను సుగమం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందడంతో అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా పెండింగ్‌లో పెట్టారు. వాస్తవానికి తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు రెండు రోజుల క్రితమే పూర్తయింది. అయితే గులాబీ నేతలతో రహస్య మంతనాలు జరుగుతుండటంతో... అవి ఫలప్రదమయ్యే వరకు జాబితాను విడుదల చేయకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ నుంచి సుమారు 15 మంది వరకు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చేరికలు ఎక్కువగా ఉండనున్నాయి. ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి వాస్తవానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చే నేతలు కాంగ్రెస్‌లో కరువయ్యారు. వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, రామగుండం, నల్లగొండ జిల్లా భువనగిరి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి తదితర 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెడితే గెలిచే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాలో విస్త్రతంగా పర్యటించి వెళ్లిన ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తాజాగా హైదరాబాద్‌లో మకాం వేశారు. టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలతో రహస్య చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రైవేట్ హోటల్లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కొప్పుల రాజు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల వివరాలను ఇరువైపులా గోప్యంగా ఉంచడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే టీజేఏసీ నేతలకు టిక్కెట్లు ఇచ్చే అంశంతోపాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విషయంపై మాట్లాడేందుకే ఈ భేటీ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యహరించిన పార్టీల నేతలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదరిస్తూ.. వారికి టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో.. దీనిపై టీజేఏసీ ఎందుకు విమర్శించడం లేదనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. జేఏసీ నేతలకు టికెట్లు! జేఏసీ నుంచి 8 మంది నాయకులకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని, వారికి బహిరంగ మద్దతు ప్రకటించే అంశంపైనా కోదండరాం అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్‌తోపాటు పిట్టల రవీందర్, జిల్లాల్లోని జేఏసీ నాయకులు గంగారాం, రాజేందర్‌రెడ్డి(మహబూబ్‌నగర్), రంగరాజు(ఖమ్మం), మర్రి అనిల్(నల్లగొండ), సినీ దర్శకుడు ఎన్.శంకర్, న్యాయవాదుల జేఏసీ నేత రాజేందర్‌రెడ్డిలకు టికెట్లు ఇచ్చే ప్రతిపాదనలను కొప్పుల రాజు ఈ సందర్భంగా కోదండరాం ముందుంచినట్లు జేఏసీ వర్గాలు తెలిపాయి. ఇక టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతల జాబితాను కొప్పుల రాజు రూపొందించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, దాసోజు శ్రవణ్ వంటి నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. వీరే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన టీఆర్ఎస్ నాయకుల జాబితాను కూడా తెప్పించుకుని వారికి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్‌కూ సంకేతాలు వెళ్లాయి. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా 15 రోజుల క్రితమే సిద్ధమైనప్పటికీ.. వాటిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జాబితాను ఇప్పుడే ప్రకటిస్తే వెంటనే అసమ్మతి నేతలను కాంగ్రెస్ ఎగరేసుకుపోయి టికెట్లు కేటాయింస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ జాబితా వెల్లడయ్యాకే.. టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
పోటీకి తిరస్కరించిన కోదండరామ్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జేఏసీకి చెందిన సభ్యులు కూడా పోటీ చేయాలన్న టీఆర్ఎస్ ప్రతిపాదనను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. ఉద్యోగ సంఘాలకే చెందిన శ్రీనివాస గౌడ్ మాత్రం మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాల గురించి చర్చించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ జేఏసీ ముఖ్యనేతలు బుధవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. -
తెలంగాణా పునర్ నిర్మాణంలో బిజెపిదే కీలకపాత్ర
-
'వైఎస్సాఆర్ సీపీ జనభేరిని అడ్డుకోవద్దు'
-
'టీ జేఏసీ ఎట్టిఅపరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీగా మారదు'
-
టీ-జేఏసీ భవిష్యత్ ?
-
'ఇకపై పోరాటం...సామాజిక తెలంగాణ కోసం'
-
సోనియాను కలిసిన టి జెఎసి నేతలు
-
తెలంగాణ సంబరాలు
సాక్షి, నల్లగొండ అమరవీరుల త్యాగాలు, ప్రజల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం లభించిందని జిల్లావాసులు అభిప్రాయపడ్డారు. 60 ఏళ్ల స్వప్నం సాకారమైందని పెద్దఎత్తున సంబరాలు చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి తెలంగాణవాదులు రోడ్లపైకి వచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాణసంచా కాల్చి ఆన ందడోలికల్లో మునిగిపోయారు. మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. రంగులు చల్లుకుని నృత్యాలతో హోరెత్తించారు. తెలంగాణ నినాదాలతో మార్మోగింది. అమరులకు నివాళులర్పిం చి వారి త్యాగాలను స్మరించుకున్నారు. నివాళులు.. సంబరాలు జిల్లాకేంద్రంలో గురువారం రాత్రి తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ సమక్షంలో సంబరాలు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఆత్మత్యాగాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. టీ ఆర్ఎస్, టీర్‌ఆర్‌ఎస్‌వీ, టీ జేఏసీ, తెలంగాణ జాగృతి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. పరస్పరం రంగులు చల్లుకుని డాన్సులు చేశారు. భువనగిరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, జేఏసీ, టీపీఎస్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. అమరవీరులకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. మిర్యాలగూడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్లీబ్లు పంపిణీ చేసి టపాసులు కాల్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. దామర చర్లలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో, చౌటుప్పల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. సూర్యాపేటలో తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. హుజూర్‌నగర్‌లో జేఏసీ, టీఆర్ ఎస్, బీజేపీ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడంతో 60 ఏళ్లుగా సీమాంధ్రుల పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించింది ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఆమెకు కృతజ్ఞతలు. - చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే సీమాంధ్రులు సహకరించాలి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఇక్కడి ప్రజల కల నెరవేరబోతున్నది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను సీమాంధ్రులు అర్థం చేసుకొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలి. - జి. మోహన్‌రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఢిల్లీకి తరలిన తెలంగాణవాదులు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనడానికి ప్రజాసంఘాల జేఏసీ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణవాదులు తరలివెళ్లారు. ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, శ్రవణ్‌కుమార్, కరణ్ జయరాజ్, గద్దల అంజిబాబు, కోక సైదులు, ప్రవీణ్ తదితరులు వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
తెలంగాణపై ఒత్తిడి పెంచేందుకు టీజేఏసి వ్యూహం
-
విభజనతోనే వికాసం
సిద్దిపేట/సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: విభజన.. జాతి వికాసానికి తోడ్పడుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విశ్లేషించారు. నాలుగున్నర కోట్ల ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. గురువారం సిద్దిపేటలో స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు నివాసంలో విలేకరులతో, అనంతరం రాత్రి ఎన్జీవో భవన్లో జరిగిన సకలజన భేరి సన్నాహక సభలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు విరుద్ధంగా సమైక్యాంధ్రలో తెలంగాణను విలీనం చేశారని, అందుకే ఈ పోరాటం అంతిమంగా విభజన దశకు చేరిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తన అధికారాలను చెలాయిస్తూ సీఎం కిరణ్ నేరానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రవాసుల్లో లేని అనుమానాలు, విద్వేషాలను సీఎం సృష్టిస్తున్నారన్నారు. కుట్రల భగ్నానికే హైదరాబాద్‌లో ఈ నెల 29 ‘సకల జనుల భేరి’ని తలపెట్టామని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో జరిగే భేరికి ఉప్పెనలా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కిరణ్ పాలన మాకొద్దు: హరీష్‌రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జరిగిన 58 ఎన్నికల్లో 50 సార్లు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన క్రమంలో ప్రజాతీర్పు గౌరవించి ఎందుకు రాజీనామా చేయలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. నీ పాలన మాకొద్దని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు చెబుతున్నందున వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చివరి బంతి దాకా ఆట సాగుతుందని సీఎం తాజాగా ప్రకటించిన వ్యాఖ్యలపై హరీష్‌రావు స్పందించారు. సీమాంధ్ర సీఎం వద్ద ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉందని చివరి గెలుపు తమదేనన్నారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీల మద్దతు లేనప్పటికీ 400 మంది బిల్లుకు మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. బిల్లు ఆమోదానికి 270 మంది సభ్యుల మద్దతు మాత్రమే అవసరం కాగా 130 మంది సభ్యులు అదనంగా తమకు అండగా ఉంటారన్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌గా చెప్పబడుతున్న సీఎం తోక ముడవాల్సిందేనన్నారు. హైదరాబాద్ అందమైన సీతాకోక చిలుక ‘హైదరాబాద్ అందమైన సీతాకోకచిలుక.. దాని రెక్కలకు కత్తులు కట్టి కోడిపందేలు ఆడొద్దు’ అని నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. 50 రోజుల సీమాంధ్రుల ఆందోళనకు తీవ్రంగా చలించిపోతున్న సీఎం.. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంపై ఎందుకు మౌనం వహిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ అశోక్‌బాబుతో తోలుబొమ్మలాటలు ఆడిస్తున్న కాంగ్రెస్, టీడీపీ కుట్రలు ఇక చెల్లవన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ సకలజనుల భేరితో కుట్రలను వ్యతిరేకించాలన్నారు. సభ అధ్యక్షుడు పాపయ్య, టీఎన్జీవో నేత శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నేత విద్యాసాగర్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీజేఏసీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, టీఆర్ఎస్ నేతలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, భూంరెడ్డి తదితరులు ప్రసంగించారు.