స్టేషన్ మహబూబ్‌నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు.
పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment