
పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజా మున 2.30కి అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంట లను ఆర్పే యత్నం చేశారు.
అగ్నికీలలు భారీ గా ఎగిసిపడటంతో హైదరాబాద్ నుంచి మరో 10 ఫైరింజన్లను రప్పించారు. 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ మేర దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. గతంలోనూ ఇదే పరిశ్రమకు చెందిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి రూ.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
పరిశ్రమను సందర్శించిన హోంమంత్రి..
ఘటనా స్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చన్నారు. పరిశ్రమ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీనిచ్చారు. కాగా ఘటనపై విచారణ చేప ట్టి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక జిల్లా అధికారి డీఎఫ్‌ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment