తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం: కావూరి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం అని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఆయన నివాసంలో జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్‌లో ఎలా ప్రవేశపెడతారు అని కావూరి మండిపడ్డారు. సస్పెన్షన్ ధర్మబద్దంగా జరగలేదని స్పీకర్ మీరాకుమార్ కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు లేఖ రాశారు.
సవరణలను ముందే బిల్లులో చేర్చాలని సీమాంధ్రమంత్రులు డిమాండ్ చేశారు. సవరణలు బిల్లులో పెట్టకుంటే మంత్రులందరం వెల్‌లోకి వస్తాం అని కేంద్ర మంత్రి కావూరి హెచ్చరించారు. లోక్‌సభ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేయాలి కావూరి కోరారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తారని భావిస్తున్నానని కావూరి ఆశాభావం వ్యక్తంచేశారు.