
సీమాంధ్ర కేంద్రమంత్రుల వాఖ్యలు బాధించాయి:పితాని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ స్ఫష్టం చేశారు.ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్నారు.
సీమాంధ్రకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొనడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమంత్రుల వ్యాఖ్యలు తనను తీవ్ర బాధకు గురి చేశాయని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు.