telangana resolution
-
తీర్మానం అసెంబ్లీకి వస్తే ఆ రోజు నుంచే సమ్మె:అశోక్ బాబు
ఢిల్లీ: రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే, అసెంబ్లీ ప్రారంభం రోజునే సమ్మె ప్రారంభిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే వ్యతిరేకిస్తామని రాజ్‌నాధ్ సింగ్ చెప్పినట్లు తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతల్లో ఉన్నారని విమర్శించారు. అందుకే విభజన అడ్డుకునేందుకు జాతీయపార్టీలను కలిసినట్లు అశోక్ బాబు తెలిపారు. -
బీజేపీతోనే తెలంగాణ ఏర్పాటు: నాగం
భారతీయ జనతాపార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం అసాధ్యమని ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం నాగం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజ్‌నాథ్ సింగ్ తమను కోరారని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు 100 శాతం మద్దతు ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని తాము ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే బీజేపీకి తమ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలు గెలిపించి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చామన్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను పోటీ చేసేందుకు ఒప్పించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను వారు కోరారు. -
రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీ:అశోక్ బాబు
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారించిందని ఆయన ఆరోపించారు. విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహర తీరును ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని అశోక్ బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెను పలుచన చేయవద్దని పలువురు నేతలకు అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. తాము చేపట్టిన సమ్మెను తత్కాలికంగా విరమించామని అంతేకాని శాశ్వతంగా సమ్మె విరమించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తామే కనుక మాట్లాడితే ... నాయకుల చరిత్రను బయటకు తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని పార్టీల నిర్ణయంతోనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్ల లేదని తెలిపారు. ఆర్టికల్ 370 (1) డీపై సంగతి తెలితేనే విభజనపై స్పష్టత వస్తుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీని మరోసారి కేంద్రం ఏర్పాటు చేసిందని అశోక్ బాబు ఆరోపించారు. -
సీమాంధ్ర కేంద్రమంత్రుల వాఖ్యలు బాధించాయి:పితాని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ స్ఫష్టం చేశారు.ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్నారు. సీమాంధ్రకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొనడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమంత్రుల వ్యాఖ్యలు తనను తీవ్ర బాధకు గురి చేశాయని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఏపీఎన్జీవోల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు సమ్మె విరమించారు. అయితే, విరమణ తాత్కాలికమేనని, తెలంగాణ తీర్మానం కోసం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున సమ్మె మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. శాసనసభను సమావేశపరచాలని నిర్ణయించిన రోజే సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో చర్చలు సంతృప్తికరంగా ముగిసినందునే సమ్మెకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధుల్లో చేరుతారని తెలిపారు. దాంతో, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ప్రస్తుతానికి తెరపడింది. సచివాలయంలో గురువారం సీఎంతో చర్చల అనంతరం ఎపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన స్థాయిలో ఇచ్చిన హామీల పట్ల సంతృప్తి చెందామని ఈ సందర్భంగా అశోక్‌బాబు తెలిపారు. విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శాసనసభకు తీర్మానం ఎప్పుడు వస్తుందనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేనందున.. సమ్మె విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారని, తమ డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించారని, అందువల్ల సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నామని వివరించా రు.అయితే, సమ్మెను విరమించినా, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. సమ్మె వల్లనే విభజన ప్రక్రియ వేగం తగ్గిందన్నారు. లేదంటే ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం పూర్తయి, బిల్లు పార్లమెంటుకు వచ్చేదన్నారు. సమ్మె విజయవంతమైందని, విభజన నష్టాలను ప్రజలకు వివరించగలిగామని చెప్పారు. సీఎంతో చర్చల్లో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రవికుమార్, రెవె న్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరావు, ఈవోఆర్డీ అసోసియేషన్ నేతలు వేంపల్లి మల్లికార్జున రెడ్డి, చెన్నా రాఘవేంద్రనాథ్, గ్రామీణ నీటి పారుదల ఉద్యోగుల సంఘం నేత ఉమామహేశ్వరరావు, మురళి, పంచాయతీ కార్యదర్శుల సంఘం నేత జనార్థన్‌రెడ్డి, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణమోహన్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు కైకాల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున సీఎంతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి పాల్గొన్నారు. ప్రధానికి లేఖ రాస్తా: సీఎం కిరణ్ ఉద్యోగులు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం సమ్మె చేశాం. సమ్మె విరమించమని మీరు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమైక్యంపై స్పష్టమైన హామీ ఇప్పించండి. సీఎం: కేంద్రం నుంచి హామీ ఇప్పించడం సాధ్యమయ్యే పనిలా లేదు. వారు(కేంద్రం) ఎంత వేగంగా వెళుతున్నారో.. అంతే వేగంగా విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగులు: అలాంటప్పుడు సమ్మె ఎందుకు విరమించాలి? సీఎం: సమ్మె వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. విభజన ఆపాలని మా పార్టీ అధ్యక్షురాలికి స్పష్టంగా చెప్పాను. నేను సీఎంగా ఉన్నంత వరకు విభజన జరగదు. ఇంత వరకు మీరు జీతాలు, జీవితాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేశారు. ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలు గుర్తించారు. ఇక నుంచి మేం(రాజకీయ నాయకులం) ఆ బాధ్యతను తీసుకుంటాం. ఉద్యోగులు: సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సీఎం: తెలంగాణ ఆకాంక్షను దశాబ్దం పైగా ఢిల్లీ పెద్దలకు క్రమంగా ఎక్కించారు. కానీ మనం అందుకు భిన్నంగా.. విభజన జరగదనే నమ్మకంతో మౌనంగా ఉన్నాం. ఉద్యోగులు: 371 డి అధికరణ పరిస్థితి ఏమిటి? సీఎం: ఈ అంశం మీద న్యాయనిపుణులను సంప్రదించాను. ఈ విషయంలో వారికీ స్పష్టత లేదు. 371 డి అధికరణను రద్దు చేయాలంటే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ, సగానికిపైగా రాష్ట్రాల ఆమోదం పొందాలని చెబుతున్నారు. 371డి అధికరణను రద్దు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అసాధ్యమని అంటున్నారు. 371 డి ప్రకారం వచ్చిన జోనల్ వ్యవస్థపై అధికారులు, న్యాయనిపుణుల్లో కొంత అస్పష్టత ఉంది. 371 డి అధికరణ, తెలంగాణ ఏర్పాటు బిల్లు, తీర్మానం శాసనసభకు వస్తాయా? రావా? వస్తే ఎన్నిసార్లు వస్తాయి? శాసనసభలో అభిప్రాయాలే చెప్పాలా? లేక తీర్మానాన్ని ఆమోదానికి పెట్టాలా?... తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాస్తాను. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అనుసరించమని కోరుతాను. శాఖల వారీగా విభజన వల్ల వచ్చే నష్టాలపై మీరు నివేదిక ఇవ్వండి. దాన్ని ప్రధాని, జీవోఎంల దృష్టికి తీసుకెళ్తాను. శాసనసభకు తీర్మానం వస్తే ఓడించడానికి శాయశక్తులా కృషి చేస్తాను. ఉద్యోగులు: ఉద్యమాన్ని బలహీనపరిచేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. వారిని కట్టడి చేయండి. సీఎం: అందరం కూర్చుని మాట్లాడతాం. భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపుల ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యోగులు: సమ్మె కాలానికి వేతనాల మాటేమిటి? జీతాలు చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వండి. సీఎం: జీవో 177 ప్రకారం ‘నో వర్క్ నో పే’ అమల్లో ఉంది. సమ్మె కాలానికి జీతాలు ఇచ్చే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. ఉద్యోగులు: స్పష్టమైన హామీ వస్తేనే విరమణ గురించి ఆలోచిస్తాం. 177 జీవోను రద్దు చేయండి. సకల జనుల సమ్మె కాలానికి జీతాలు ఇచ్చి టీఎన్జీవోలకూ న్యాయం చేయండి. సీఎం: అందరూ మన ఉద్యోగులే. ఈ సమయంలో ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకు కృషి చేస్తాను. 177 జీవోతో సంబంధం లేకుండా సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించేలా న్యాయ సలహా తీసుకొంటాను. ఉద్యోగులు: ఓ వైపు రాష్ట్ర విభజన అంటూ మరోవైపు ఐటీఐఆర్ ప్రతిపాదన అంటే అన్యాయం కాదా? సీఎం: హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేయబోయే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ కోసం 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర విభజనతో దానికి సంబంధం లేదు. 90 శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్నందున ఈ జోన్‌ను హైదరాబాద్ పరిసరాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు. -
తెలంగాణ ప్రక్రియ పూర్తవకూడదు: బొత్స
విజయనగరం: సీడబ్ల్యూసీ తీర్మానం జరగక ముందే సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలన్నానని... ఆ రోజు నా మాట ఎవరూ వినలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పుడు రాజీనామా చేస్తే అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వచ్చినప్పుడు సీమాంధ్రుల అభిప్రాయం చెప్పడానికి వీలుపడదన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ చులకన అయిందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ఇక్కడి రైతులకు నీటి సమస్యలు వస్తాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పరస్పర సహకారంతో సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ప్రయోజనం లేదన్నారు. పీసీసీ చీఫ్‌గా తరచూ ఢిల్లీ వెళ్లడంతో పాటు విజయనగరంలో కర్ఫ్యూ ఉండటం వల్లే రెండు నెలలుగా సొంత జిల్లాకు రాలేకపోయానని తెలిపారు. ఎన్నికల్లోపు తెలంగాణ ప్రక్రియ పూర్తవ్వకూడదని, కాదని భావిస్తున్నట్టు బొత్స సత్యనారాయణ చెప్పారు. -
దిగ్విజయ్ సింగ్‌కు సీఎం కిరణ్ ఫోన్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి అస్పష్టంగా ఉందంటూ దిగ్విజయ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా, రాదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ తీర్మానం శాసనసభకు వస్తుందని మీరు చెబుతున్నారు, హోం మంత్రి షిండే రాదంటూ పరస్పర ప్రకటనలు చేస్తున్నారని దిగ్విజయ్‌ను సీఎం అడిగినట్టు తెలిసింది. సున్నిత అంశంపై భిన్న ప్రకటనలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు పంపుతామని తనకు హామీయిచ్చారని కిరణ్ గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు మాత్రమే వస్తుందని షిండే చెబుతున్నారని అన్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో సమ్మె చేస్తున్న ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
రాజీనామాలు వద్దు.. పార్టీలోనే ఉందాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేవరకు ఎవరూ రాజీనామా చేయకుండా కొనసాగాల్సిన అవసరం ఉందని సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర విభజన జరగకుండా అన్ని మార్గాలను అనుసరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ సమైక్య నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు మంత్రులు, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే న్యాయ పోరాటానికి వీలుగా మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్లతో కమిటీని ఏర్పాటుచేశారు. అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు పూనుకుంటే, దానిపై న్యాయపోరాటం చేయాలని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి, మహీధర్‌రెడ్డి, గల్లా అరుణకుమారి, అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్లతోపాటు 44 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వెళ్తారనుకోవడం లేదు. దాన్ని అడ్డుకోవడానికి ఎవరూ రాజీనామా చేయొద్దంటున్నాను. మంత్రులు కూడా రాజీనామా చేయొద్దు’’ అని అన్నట్లు తెలిసింది. ఉద్యోగులు ఎంతో కాలం సమ్మె చేయలేరని, రాజకీయ పార్టీలు దాన్ని కొనసాగించాల్సిన అవసరముంటుందని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సరైన భరోసా ఇస్తే వారు సమ్మె విరమించడానికి సానుకూలంగానే ఉన్నారన్నారు. అసెంబ్లీతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారం సాగుతోందని విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులు పేర్కొన్నారు. తాను సమైక్యవాదినని గట్టిగా వాదిస్తున్నా.. తన కార్యాలయంపైనా ఉద్యమకారులు దాడులు చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. సమైక్య నినాదంతో పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించాలని మంత్రి శైలజానాథ్... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కోరారు. దీంతో సీనియర్ మంత్రులు, నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తానని బొత్స చెప్పారు. తాను పార్టీలోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తానని మంత్రి ఆనం నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను పోటీ చేయాలనుకోవడం లేదని జేసీ పేర్కొన్నారు. కేంద్రం రూపొందిం చిన ఆర్డినెన్సును చించి పారేయాలని రాహుల్‌గాంధీ పేర్కొన్నం దున బొత్స ఆయనతో మాట్లాడి తెలంగాణ తీర్మానాన్ని కూడా అలాగే చించే లా చూడాలని సమావేశంలో మరో నేత పేర్కొన్నారు. దాడులు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే కేసులు ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. విజయనగరంలో తన నివాసంపై జరిగిన దాడి గురించి బొత్స ప్రస్తావించి, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదైతే తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం స్పష్టంచేశారు. హామీ పత్రం ఇచ్చేందుకు సిద్ధం: గంటా సమావేశం అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీఎన్జీవోలు గత 60 రోజులకు పైగా చేస్తున్న సమ్మెను విరమించాలని ఒక విజప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడే బాధ్యతను తాము తీసుకుంటామని ఉద్యోగులకు ఒక హామీ పత్రం సైతం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం రాజీనామా చేయవద్దన్న అంశంపైనా చర్చ జరిగిందని తెలిపారు. ఎంపీల రాజీనామాల వల్ల పార్లమెంట్లో తమ వాదన వినిపించడానికి అవకాశం ఉండదని, అందువల్ల రాజీనామాలు వద్దన్న అభిప్రాయం వ్యక్తమైందన్నారు. మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలసి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను ఫ్యాక్స్ ద్వారా గాంధీభవన్‌కు పంపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ఏరాసు తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధప్రసాద్ గుడ్‌బై రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం తీరని అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. -
మా ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నిరాశ కలిగించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోదని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉంటుందని అంగీకరించారు. మినిస్టర్స్ క్వార్టర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధిష్టానం మాట వినకపోయినప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాలను హైకమాండ్‌కు తెలియజేశామన్నారు. సమస్య వచ్చిందని పారిపోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఎక్కడా అనలేదని బొత్స తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని టీడీపీ, వైఎస్సార్ సీపీ కోరాయని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ సమైక్యాంధ్రకే మద్దతు పలికారని అన్నారు. తమ ప్రాంత ప్రజల ఆవేదనను కేంద్రానికి తెలిపామన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. పదవులు పట్టుకుని వేలాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు. -
తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదు: చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: తెలంగాణపై అసెంబ్లీకి వచ్చే తీర్మానంపై ఓటింగ్ ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం మాత్రమే కోరతారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ఈ విషయంలో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? వస్తే ఓటింగ్ జరుగుతుందా? అభిప్రాయమే కోరతారా?.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. ఢిల్లీలో సమైక్యాంధ్ర ధర్నాకు శైలజానాథ్, పద్మరాజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం జరుప తలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్ ప్రతినిధులుగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్, విప్ రుద్రరాజు పద్మరాజు హాజరుకానున్నారు. ధర్నాకు సంఘీభావం తెలపాలని ఉద్యోగ సంఘాలు కోరిన మీదట తాము హాజరవ్వాలని నిర్ణయించుకున్నామని శైలజానాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. -
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే దాన్ని ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే ఆ తరువాత రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది కనుక తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు. రాజీనామాలు ఆమోదింపచేసుకోవడమంటే అది విభజనను సమర్థించడమే అవుతుందని చెప్పారు. రెండు నెలలుగా అన్నివర్గాలు ఉద్యమంలో ఉన్నాయని, ఈ తరుణంలో రాజకీయాలు చర్చించరాదని చెప్పారు. -
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
-
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులోగా భాగంగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ‘కేబినెట్ నోట్’ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఈ ముసాయిదా నోట్ రూపకల్పనకు ఎలాంటి తుది గడువూ లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి. కేబినెట్ ముసాయిదా నోట్‌ను ఒక పత్రంగా వ్యవహరిస్తూ.. ‘అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్)’ గా వర్గీకరించటం జరుగుతుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: మంత్రి వట్టి
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రక్రియను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందన్న నమ్మకం తమకుందని వట్టి వసంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆయన సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిద్దామని సీమాంధ్ర ప్రాంతంలోని 159 మంది ఎమ్మెల్యేలకు వట్టి వసంతకుమార్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టే నైతిక హక్కు ఉండదు ఆయన స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే కోర్టుకు వెళ్లే అవకావం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల కతీతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేద్దామని సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులకు సూచించారు. నాతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన మరుక్షణమే తామంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వట్టి వసంతకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా మేమంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. అధిష్టానం నిర్ణయం కంటే ప్రజల నిర్ణయమే మాకు ముఖ్యం మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు.