
తెలంగాణ ప్రక్రియ పూర్తవకూడదు: బొత్స
విజయనగరం: సీడబ్ల్యూసీ తీర్మానం జరగక ముందే సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలన్నానని... ఆ రోజు నా మాట ఎవరూ వినలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పుడు రాజీనామా చేస్తే అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వచ్చినప్పుడు సీమాంధ్రుల అభిప్రాయం చెప్పడానికి వీలుపడదన్నారు.
కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ చులకన అయిందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ఇక్కడి రైతులకు నీటి సమస్యలు వస్తాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పరస్పర సహకారంతో సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ప్రయోజనం లేదన్నారు.
పీసీసీ చీఫ్‌గా తరచూ ఢిల్లీ వెళ్లడంతో పాటు విజయనగరంలో కర్ఫ్యూ ఉండటం వల్లే రెండు నెలలుగా సొంత జిల్లాకు రాలేకపోయానని తెలిపారు. ఎన్నికల్లోపు తెలంగాణ ప్రక్రియ పూర్తవ్వకూడదని, కాదని భావిస్తున్నట్టు బొత్స సత్యనారాయణ చెప్పారు.