
తీర్మానం అసెంబ్లీకి వస్తే ఆ రోజు నుంచే సమ్మె:అశోక్ బాబు
ఢిల్లీ: రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే, అసెంబ్లీ ప్రారంభం రోజునే సమ్మె ప్రారంభిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే వ్యతిరేకిస్తామని రాజ్నాధ్ సింగ్ చెప్పినట్లు తెలిపారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతల్లో ఉన్నారని విమర్శించారు. అందుకే విభజన అడ్డుకునేందుకు జాతీయపార్టీలను కలిసినట్లు అశోక్ బాబు తెలిపారు.