టీ. బిల్లు పెట్టగానే అసెంబ్లీ ముట్టడి: అశోక్ బాబు | APNGOs will siege Assembly if telangana bill taken up, says Ashok babu | Sakshi
Sakshi News home page

టీ. బిల్లు పెట్టగానే అసెంబ్లీ ముట్టడి: అశోక్ బాబు

Published Thu, Dec 12 2013 3:16 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టీ. బిల్లు పెట్టగానే అసెంబ్లీ ముట్టడి: అశోక్ బాబు - Sakshi

టీ. బిల్లు పెట్టగానే అసెంబ్లీ ముట్టడి: అశోక్ బాబు

విజయవాడ : తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టగానే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు హెచ్చరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలు సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. విజయవాడలో జరిగిన న్యాయవాదుల సమైక్య శంఖారావానికి అశోక్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు నెగ్గదనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్లో మకాం వేశారని అన్నారు.

అవసరం అయితే మరోసారి సమ్మె చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇంకా రాజీనామాలు చేయని సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, మంత్రులను సామాజిక బహిష్కారం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement