ఎన్నికల ముందే తెలంగాణ : దిగ్విజయ్ | Telangana emerge before general elections, says digvijaya singh | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందే తెలంగాణ : దిగ్విజయ్

Published Mon, Jan 13 2014 12:11 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

ఎన్నికల ముందే తెలంగాణ : దిగ్విజయ్ - Sakshi

ఎన్నికల ముందే తెలంగాణ : దిగ్విజయ్

న్యూఢిల్లీ :  ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అవసరం అయితే తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. తెలంగాణ బిల్లు చర్చపై గడువు పెంపు అనేది రాష్ట్రపతి పరిధిలోని అంశమని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. ఆవిషయాన్ని రాష్ట్రపతే నిర్ణయిస్తారన్నారు.

తెలంగాణకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ అనేది అష్టానం చూసుకుంటుందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగడం మంచిదన్నారు. చర్చ ద్వారా అందరి మనోభావాలను తెలపవచ్చని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తమ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిపేందుకు ఇదే సరైన సమయం అన్నారు. టీఆర్ఎస్ విలీనం అంశాన్ని తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యాక మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement