
తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదు: చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: తెలంగాణపై అసెంబ్లీకి వచ్చే తీర్మానంపై ఓటింగ్ ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం మాత్రమే కోరతారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ఈ విషయంలో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? వస్తే ఓటింగ్ జరుగుతుందా? అభిప్రాయమే కోరతారా?.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి.