దిగ్విజయ్ సింగ్కు సీఎం కిరణ్ ఫోన్ | kirankumar reddy phone to digvijay singh on telangana resolution | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ సింగ్కు సీఎం కిరణ్ ఫోన్

Published Fri, Oct 11 2013 2:25 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

దిగ్విజయ్ సింగ్కు సీఎం కిరణ్ ఫోన్ - Sakshi

దిగ్విజయ్ సింగ్కు సీఎం కిరణ్ ఫోన్

రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి అస్పష్టంగా ఉందంటూ దిగ్విజయ్ సింగ్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి అస్పష్టంగా ఉందంటూ దిగ్విజయ్ సింగ్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా, రాదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు సమాచారం. తెలంగాణ తీర్మానం శాసనసభకు వస్తుందని మీరు చెబుతున్నారు, హోం మంత్రి షిండే రాదంటూ పరస్పర ప్రకటనలు చేస్తున్నారని దిగ్విజయ్ను సీఎం అడిగినట్టు తెలిసింది.

సున్నిత అంశంపై భిన్న ప్రకటనలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు పంపుతామని తనకు హామీయిచ్చారని కిరణ్ గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు మాత్రమే వస్తుందని షిండే చెబుతున్నారని అన్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో సమ్మె చేస్తున్న ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement