బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్ | Send opinion on T. bill as early as possible, says Digvijay singh | Sakshi
Sakshi News home page

బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్

Published Fri, Jan 24 2014 11:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్ - Sakshi

బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లుపై అభిప్రాయాలను సాధ్యమైనంత త్వరగా పంపాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ సింగ్ సమాధానం ఇస్తూ... విభజన బిల్లుపై నేటి ఉదయమే సీఎం కిరణ్కు ఫోన్ చేసి చర్చించినట్లు చెప్పారు. బిల్లు త్వరగా తమకు పంపిస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పినట్లు చెప్పారు.

 

బిల్లుపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాతమకు అభ్యంతరం లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ నిన్నటితో ముగియవలసి ఉంది. అయితే బిల్లుపై చర్చకు మరో ఆరు రోజుల గడువు ఇస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరగుతున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement