T. Bill
-
బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్
-
బిల్లుపై అభిప్రాయాలు త్వరగా పంపండి: దిగ్విజయ్
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లుపై అభిప్రాయాలను సాధ్యమైనంత త్వరగా పంపాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ సింగ్ సమాధానం ఇస్తూ... విభజన బిల్లుపై నేటి ఉదయమే సీఎం కిరణ్కు ఫోన్ చేసి చర్చించినట్లు చెప్పారు. బిల్లు త్వరగా తమకు పంపిస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పినట్లు చెప్పారు. బిల్లుపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాతమకు అభ్యంతరం లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ నిన్నటితో ముగియవలసి ఉంది. అయితే బిల్లుపై చర్చకు మరో ఆరు రోజుల గడువు ఇస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరగుతున్న విషయం విదితమే. -
బిల్లుపై చర్చించకుంటే సీమాంధ్రలకే నష్టం: కేటీఆర్
-
బిల్లుపై చర్చించకుంటే సీమాంధ్రలకే నష్టం: కేటీఆర్
అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నిరోజులు వీలైతే అన్ని రోజులు సభను నడపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఎలాంటి వాయిదాలు వేయకుండా నిరవధికంగా తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే విధంగా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించాల్సిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుంటే నష్టపోయేది సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి తాము ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. టీవీ చర్చల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాల్గొంటున్న సీమాంధ్ర నేతలు సభలో చర్చకు ఎందుకు సహకరించటం లేదని ప్రశ్నించారు.