అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నిరోజులు వీలైతే అన్ని రోజు సభను నడపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సభాపతిని కోరారు.
అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నిరోజులు వీలైతే అన్ని రోజులు సభను నడపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఎలాంటి వాయిదాలు వేయకుండా నిరవధికంగా తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే విధంగా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించాల్సిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుంటే నష్టపోయేది సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి తాము ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. టీవీ చర్చల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాల్గొంటున్న సీమాంధ్ర నేతలు సభలో చర్చకు ఎందుకు సహకరించటం లేదని ప్రశ్నించారు.