సీఎం లేఖ విషయం నాకు తెలియదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానంపై అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు కిరణ్ కుమార్ రెడ్డి మూడు పేజిల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా సమాధానమిచ్చారు.
కాగా మరోవైపు కేంద్రమంత్రి చిరంజీవి ....ముఖ్యమంత్రి లేఖతో పాటు ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని... అన్నిపార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే కాంగ్రెస్ను తప్పుపట్టడం సరైంది కాదని చిరంజీవి అన్నారు. విభజన ప్రక్రియ సరిగా జరగటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ సముచితమేనని చిరంజీవి అన్నారు.