కాంగ్రెస్ కు కిరణ్ వీరవిధేయుడు: దిగ్విజయ్
అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ నిర్ణయం తీసుకుంది అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ విబేధించవచ్చు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి వీరవిధేయుడు అని అన్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నాడు. సీడబ్ల్యూసీ అత్యున్నతమైంది అని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయం కంటే ఎవరూ ఎక్కువ కాదు అని దిగ్విజయ్ అన్నారు.