20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే | Telangana resolution with in 20 days: Sushil kumar shinde | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 2 2013 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులోగా భాగంగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ‘కేబినెట్ నోట్’ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఈ ముసాయిదా నోట్ రూపకల్పనకు ఎలాంటి తుది గడువూ లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి. కేబినెట్ ముసాయిదా నోట్‌ను ఒక పత్రంగా వ్యవహరిస్తూ.. ‘అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్)’ గా వర్గీకరించటం జరుగుతుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement