ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు రేపు స్పీకర్ అపాయింట్మెంట్ | Meira kumar gives appointment to seven seemandhra MPs | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 23 2013 1:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఏడుగురికి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నాటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ గతంలోనే ఈ ఏడుగురు ఎంపీలు స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు ఆ ఏడుగురు ఎంపీలకూ స్పీకర్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్కు గతంలోనే లేఖలు రాశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో పాటు.. ఎంపీలు రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా గట్టిగా వస్తుండటంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement