Meira Kumar
-
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేరుతాయని, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్న ప్రజానీకం ఆశలు తీరుతాయని ఆశించినా నెరవేరలేదని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసే అర్హులైన దళిత నాయకుల్లేరా.. లేక మీకు ఇష్టం లేకనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో కలసి ఆమె మాట్లాడారు. ఓవైపు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు.. మరోవైపు రాజకీయ అణచివేతకు పాల్పడుతూ ఆ వర్గాలను నిరాశ, నిస్పృహల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిపాలన తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఎలాంటి తప్పు చేయకుండానే దళిత ఎమ్మెల్యే సంపత్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్క తీర్మానంతో మొత్తం ప్రతిçపక్షాన్నే అసెంబ్లీ నుంచి గెంటివేయడం ప్రజాస్వామ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. తాను కూడా స్పీకర్‌గా పనిచేశానని, ఎంతోమంది సభ్యులు వారి అభిప్రాయాలను వెలిబుచ్చేవారని, అంతమాత్రాన వారి నోరునొక్కే విధంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేకపోవడం, భావస్వేచ్ఛను హరించడం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదని, 4వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంటే తనకు గౌరవమని, గత పర్యటనలో తాను నేరెళ్ల వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో పేదలు, మైనార్టీలు, రైతులు, దళితులు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలను అణచివేసేలా పాలన సాగుతోందని విమర్శించారు. చారిత్రక చట్టాన్ని తెచ్చింది మేమే.. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే చారిత్రక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని మీరాకుమార్ గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీనని, ఆ సమయంలో బిహార్ రాష్ట్రంలోని జహానాబాద్ జిల్లాలో 27 మంది దళితులను కాల్చి చంపారన్నారు. ఈ ఘటనలతోనే ఎస్సీ, ఎస్టీల మనోభావాలను కాపాడేందుకు పటిష్ట చట్టం కావాలని తాను నాడు రాజీవ్‌కు చెప్పానని, అప్పుడే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడా చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, అయినా ఆ సమావేశాల్లో చట్టం తెచ్చే ప్రయత్నం బీజేపీ చేయలేదన్నారు. సమావేశాల తర్వాత కూడా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశమున్నా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం విషయంలో కోర్టులో బలమైన వాదనలు కూడా వినిపించేందుకు బీజేపీ ముందుకు రాలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా వెలుగులోకి తెస్తున్న మీడియాను ఆమె అభినందించారు. మీరా సానుకూలత వల్లే తెలంగాణ: ఉత్తమ్ మీరాకుమార్ నాడు స్పీకర్‌గా సానుకూలంగా వ్యవహరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరాకుమార్ వెనక్కు వెళ్లలేదని, ఆమె అలా వ్యవహరించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న మక్కువతోనే ఆమె రాష్ట్రంలో తరచూ పర్యటిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కూడా మీరాకుమార్ను గుండెల్లో పెట్టుకున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
అధికార అహంకారమా!
♦ సీఎంపై ఉత్తమ్‌కుమార్ ఫైర్ ♦ తెలంగాణ ఇచ్చిన సోనియా, మీరాకుమార్పైనే విమర్శలా? ♦ కేసీఆర్ సీఎం కావడం దౌర్భాగ్యమని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘‘అధికారంలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కినయా? కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నామనే అహంకారంతో మదమెక్కిందా? తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, మీరాకుమార్ను విమర్శిస్తే ఉద్యమకారులు సహిస్తారా? నోటికొచ్చిన అబద్ధాలు, ఇచ్చిన మాటను గుర్తుచేస్తే దబాయింపులు, సిగ్గులేకుండా మాట మార్చడం.. తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్ కావడం దౌర్భాగ్యం’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రోజుకో కొత్త అబద్ధం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎం చేతకానితనాన్ని ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అభద్రతాభావంతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలసి గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందని, మీరాకుమార్ పట్టుదల వల్లే బిల్లు ఆమోదం పొందిందని చెప్పిన నోటితోనే కేసీఆర్ సిగ్గు లేకుండా విమర్శలు చేయడంపై తెలంగాణ ఉద్యమకారులు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో కోర్టుకు పోయినవారికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సింగరేణిలోని వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ జాగృతి కార్యకర్తనే కోర్టుకు పోయారు’’అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సిరిసిల్ల దళితులపై పోలీసుల థర్డ్ డిగ్రీకి కేసీఆర్ కుటుంబీకుల ప్రోద్బలమే కారణమన్నారు. హర్ష మోటార్స్ నుంచి హిమాన్షు కంపెనీ 300 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా చేసిన దోపిడీకి కేసీఆర్ కుటుంబీకులు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలన్నారు. ‘‘మూడేళ్లలోనే హైదరాబాద్‌లో 50 పబ్‌లకు అనుమతి ఎందుకు ఇచ్చారు? అ పబ్‌లు ఎవరివి? ఈవెంట్ మేనేజర్లు ఎవరి బంధువులు? ఈ విషయాలన్నీ సీఎం చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు’’ అని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో, ఎడాపెడా అప్పులు చేయడంలో రాష్ట్రాన్ని నంబన్–1గా మార్చారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు కడుపు మండిన బాధితులు కోర్టులకు పోతే కాంగ్రెస్‌పై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను తిట్టడానికి అయినా సీఎం ప్రజల్లోకి వస్తే వాస్తవాలేమిటో తేలుతాయన్నారు. -
వారిని చూస్తే కన్నీరు ఆగలేదు
-
సిరిసిల్ల నిరసన సభకు మీరాకుమార్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో దళితులపై పోలీసుల దాడికి నిరసనగా ఈ నెల 31న తలపెట్టిన నిరసన సభకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరుకానున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దాడులకు గురైన వారి కుటుంబ సభ్యులను మీరాకుమార్ 31న పరామర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం నిరసనసభలో మీరాకుమార్ ప్రసంగిస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. -
రికార్డ్ బ్రేక్ చేసిన మీరాకుమార్
న్యూఢిల్లీ: బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించగా.. పరాజయం పాలైన ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ యాభై ఏళ్ల చరిత్రను తిరగరాశారు. రామ్‌నాథ్ కోవింద్ 65.65 శాతం ఓట్లు సాధించగా, మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా.. మీరాకుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థిగా 50 ఏళ్ల రికార్డును మీరాకుమార్ చెరిపేశారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పేరిట ఉండేది. ఓటమిపాలైన వారిలో అత్యధిక ఓట్ల విలువ ఎక్కువ సొంతం చేసుకున్న అభ్యర్థిగా 1967లో కోకా సుబ్బారావు ఈ ఘనత వహించగా, ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పుడు మీరాకుమార్ ఆ రికార్డును అధిగమించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన సుబ్బారావు, జాకీర్ హుస్సేన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే అప్పుడు జాకీర్‌కు పోలైన ఓట్ల విలువ 4.7 లక్షలు కాగా, సుబ్బారావు ఓట్ల విలువ 3.63లక్షలు. అయితే అప్పటినుంచి జరుగుతున్న ఏ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటమిపాలైన అభ్యర్థికి 3.63 లక్షల కంటే ఎక్కువ ఓట్ల విలువ రాలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమిపాలైన మీరాకుమార్ ఓట్ల విలువ 3.67 లక్షలు. దీంతో మీరాకుమార్, 1967లో సుబ్బారావు నెలకొల్పిన అత్యధిక ఓట్ల విలువను అధిగమించినట్లయింది. మరోవైపు ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లను తీసుకుంటే... ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 522 మంది ఎంపీలు ఓటేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు 225 మంది ఎంపీల మద్దతు లభించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 771 మంది ఎంపీలు ఓటింగ్‌కు అర్హులు. (మిగతావి ఖాళీలు, కోర్టు తీర్పు కారణంగా ఒక బీజేపీ ఎంపీకి ఓటింగ్ హక్కు లేదు.) రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారు, గైర్హాజరైన వారు పోను... 747 మంది ఓటు వేశారు. వీటిలో కోవింద్‌కు 522 ఓట్లుపడ్డాయి. దీన్ని ప్రామాణికంగా తీసుకొని... ఆగష్టు 5వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడికి ఎన్ని ఓట్లు పడతాయో అంచనా వేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏను కాదని కోవింద్‌కు మద్దతునిచ్చిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఉపరాష్ట్రపతికి మాత్రం విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని బలపరుస్తామని ప్రకటించింది. అలాగే గోపాలకృష్ణ తన చిరకాల మిత్రుడు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు ఆయనకే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అంటే కోవింద్‌కు లభించిన జేడీయూ, బీజేడీ మద్దతు వెంకయ్యకు ఉండదు. ఈ రెండు పార్టీలకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 40 మంది ఎంపీలున్నారు (బీజేడీకి లోక్‌సభలో 20, రాజ్యసభలో 8– జేడీయూకు లోక్‌సభలో 2, రాజ్యసభలో 10 మంది ఎంపీలున్నారు). అంటే కోవింద్‌కు వచ్చిన ఎంపీల ఓట్లలో వెంకయ్యకు 40 తగ్గుతాయి. 482 ఓట్లు ఆయనకు వస్తాయి. గోపాలకృష్ణ గాంధీకి 265 ఓట్లు పడతాయి. గైర్హాజరైన ఎంపీల్లో కొందరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నా, క్రాస్ ఓటింగ్ జరిగినా ఈ çసంఖ్య కొంచెం అటుఇటూ కావొచు. ఉపరాష్ట్రపతిని ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ సంబంధిత వార్త రాజన్‌బాబు నుంచి నేటి వరకూ -
నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్
-
నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా విజయం సాధించడం తనకు ఉద్విగ్నమైన సమయం అని త్వరలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. తన జీవితం దేశానికి అంకితం అని ఉద్వేగంగా చెప్పారు. గురువారం నాటి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో రామ్‌నాథ్ కోవింద్ భారీ విజయాన్ని సొంతం చేసుకొని భారత 14వ రాష్ట్రపతిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు. తన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. మరోపక్క, విజయం సాధించిన రామ్‌నాథ్‌కు ప్రత్యర్థి మీరా కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవిలో విజయవంతంగా రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను ఓటమిని అవమానంగా భావించడం లేదని, ఒక సైద్ధాంతిక పోరాటమే చేశాను తప్ప మరొకటి కాదని అన్నారు. తన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని మున్ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. తనకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలని అన్నారు. -
కోవింద్ విజయంపై వైఎస్ జగన్ హర్షం
హైదరాబాద్ : రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపుపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో కోవింద్‌కున్న అపార అనుభవం, అత్యున్నత రాజ్యాంగ పదవికి మరింత వన్నె తెస్తుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. Shri YS Jagan Mohan Reddy expressed happiness over the election of Shri Ramnath Kovind ji as President of the Nation.#PresidentialElection pic.twitter.com/FLATXmAaar — YSR Congress Party (@YSRCParty) 20 July 2017 మరోవైపు కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు శుభాకాంక్షలుత తెలిపారు. కాగా యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌పై రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఈ నెల 25న ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. -
రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కోవింద్ ప్రొఫెల్... వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్ 1945 అక్టోబర్ ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి... కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్ రాకపోవడంతో... న్యాయవాదిగా స్థిరపడిపోయారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్‌గా పనిచేశారు రామ్‌నాథ్ కోవింద్. రెండుచోట్లా కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా సేవలందించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్ పరివార్‌లో చేరారు రామ్‌నాథ్ కోవింద్. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్‌లోని తన పాత ఇంటిని ఆర్ఎస్ఎస్కే రాసిచ్చారు. 1991లో బీజేపీలో చేరిన కోవింద్... బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి ఎగువసభకు ఎంపికైన కోవింద్... రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందంచారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ ఎంపీగా... పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా, ఒక కమిటీకి ఛైర్మన్‌గానూ పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి.. 2002లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు. 2015 ఆగస్టు 16న బీహార్ గవర్నర్‌గా నియమితలైన కోవింద్... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు. రామ్‌నాథ్ కోవింద్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఏపీలో ఓట్లన్నీ కోవింద్‌కే, ఆధిక్యమెంత!?
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరౌండ్లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ పూర్తయింది. రామ్‌నాథ్‌కు 4,79,585, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు విలువ రాగా, ఏపీలో మాత్రం రామ్‌నాథ్‌కే ఓట్లన్నీ పోలయ్యాయి. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. ఎన్టీయేకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కోవింద్ సునాయసంగా రాష్ట్రపతి కాబోతున్నారని తెలుస్తోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్. ఈ పోలింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. కోవింద్‌కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం, అనూహ్యం జరిగితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ విజయం సాధించవచ్చునని అంటున్నారు. -
లెక్కింపు షురూ: కోవింద్ ఆధిక్యమెంత!?
-
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత మురళీమనోహర్ జోషి తదితరులు ఓటేశారు. అధికార, విపక్ష ఎంపీలు కూడా పార్లమెంట్ హౌస్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే పలువురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 25న కొత్త రాస్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.కాగా 24న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఏపీలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు వేశారు. బిజెపి ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాయపాటి సాంబశివరావు ఓటు వేశారు. అలాగే తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముసిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ తొలి ఓటు వేయగా.. స్పీకర్ మధుసూదనాచారి రెండో ఓటు వేశారు. విపక్షనేత జానారెడ్డి మూడో ఓటు వేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, ఎంఐఎం , టీడీపీ ఎమ్మెల్యేలు, బిజెపి పక్షనేత కిషన్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే టిఆర్ఎస్కు చెందిన మనోహర్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. -
రామ్‌నాథ్ గెలుపు నల్లేరుపై నడకే
-
నేడే నూతన రాష్ట్రపతి ఎన్నిక
-
తొలి ‘బీజేపీ రాష్ట్రపతి’గా కోవింద్
- ఓడిన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలువనున్న మీరా నేడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో... రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే మొదటి బీజేపీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. అదే సమయంలో ఓటమి పాలయ్యే రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ నిలిచిపోనున్నారు. రాష్ట్రపతి పదవికి ఇంతవరకూ 14సార్లు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. 1969లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి.. ఇందిరాగాంధీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరి చేతిలో పరాజయం పొందారు. ఇక బీజేపీ అధికారంలో ఉండగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవికి ఆ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దిగడం ఇదే మొదటిసారి. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉండగా జరిగిన 2002 ఎన్నికలో గెలిచిన కలాంకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి భైరవ్‌సింగ్ షెఖావత్ పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 1977, 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో ప్రతిపక్షంలో ఉండగా, 1997లో యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిచ్చింది. 1997 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటి ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత కేఆర్ నారాయణన్‌కు దళితుడనే కారణంగా యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్యపక్షాలు, వామపక్షాలతో పాటు బీజేపీ మద్ధతు తెలిపాయి. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. 2002లో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలు ప్రతిపాదించిన ఏపీజే అబ్దుల్ కలాంకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మద్దతివ్వగా, వామపక్షాల అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌పై ఆయన గెలిచారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ పెట్టలేదు. జనతా పార్టీఅభ్యర్థిగా ముందుకొచ్చిన కాంగ్రెస్ మాజీ నేత నీలం సంజీవరెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వడంతో పోటీలేకుండా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతిగా ఆయన నిలిచారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలో(1969) ఓడిపోయిన తొలి కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి కూడా నీలం సంజీవరెడ్డే కావడం విశేషం.. ఆయన అభ్యర్థిత్వం నచ్చని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉపరాష్ట్రపతి వీవీ గిరిని ‘ఇండిపెండెంట్’ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో నీలం ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సంజీవరెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ఓడిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన మీరాకుమార్‌కు 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్ను సమర్ధిస్తున్న వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే మీరా ఓటమి ఖాయమని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికలో ఓడిన రెండో కాంగ్రెస్ నేతగా మీరా చరిత్రకెక్కుతారు. రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కులం ప్రస్తావన రాష్ట్రపతి ఎన్నికలో మొదటిసారి 1997లో కులం తెరపైకి వచ్చింది. అప్పటికి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను తొలి దళిత రాష్ట్రపతిని చేయాలంటూ పాలక యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ కోరగా, బీజేపీ అందుకు అంగీకరించి మద్దతు పలికింది. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత, పాలక ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా కోవింద్‌ను ప్రకటించి, దళిత అభ్యర్థిని గెలిపించాలనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కాంగ్రెస్‌కు విజయావకాశాలు లేకున్నా దళితులకు పదవులిచ్చే విషయంలో తానే ముందున్నానని చెబుతూ దళిత వర్గానికే చెందిన మీరాను అభ్యర్థిగా ఎంపికచేసింది. దళిత్ వర్సెస్దళిత్ అంటూ ప్రచారం జరుగుతున్నా, దళితుల్లో అధిక మద్దతున్న చర్మకారేతర(చమార్ లేదా జాటవ్) నేతను రాష్ట్రపతిని చేయడం ద్వారా వారి మద్దతు బలోపేతం చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడే రాష్ట్రపతి ఎన్నిక
- పార్లమెంట్ హౌస్, అసెంబ్లీల్లో పోలింగ్ - 20న ఓట్ల లెక్కింపు - ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ గెలుపు నల్లేరుపై నడకే.. - దేశవ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 32 - ఓటు వేయనున్న ఎంపీల సంఖ్య 776 - ఓటు వేయనున్న ఎమ్మెల్యేల సంఖ్య 4,120 - ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903 న్యూఢిల్లీ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీలో తలపడుతున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఒక పోలింగ్ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఓటర్లకు ప్రత్యేక పెన్నులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగత పెన్నులను తీసుకురాకుండా ఈసీ నిషేధం విధించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన మార్కర్ పెన్నులను అందిస్తారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ కాగితాలను, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ కాగితాలను ఇస్తారు. తాము అందించే సీరియల్ నంబర్లతో కూడిన ఊదారంగు సిరా పెన్నులతోనే ఓటేయాలని ఈసీ ఆదివారం ఓ ప్రకటనలో సూచించింది. ‘ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు పోలింగ్ సిబ్బంది వారి వ్యక్తిగత పెన్నులను తీసుకుని, ప్రత్యేక పెన్నులను ఇస్తారు. ఓటర్లు కేంద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిని మళ్లీ తీసుకుని, వారి పెన్నులను వారికి ఇస్తారు’అని కొత్త నిబంధన గురించి ఈసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. గత ఏడాది హరియాణాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈసీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రత్యేక పెన్నులను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేసింది. ఓటేసే సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుపుతూ ఈసీ ప్రత్యేక పోస్టర్లను కూడా సిద్ధం చేసింది. ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని పార్టీలు విప్ జారీ చేయకూడదని పేర్కొంది. అసెంబ్లీల్లో ఓటేయనున్న 55 మంది ఎంపీలు 14 మంది రాజ్యసభ, 41 మంది లోక్‌సభ ఎంపీలు కలిపి మొత్తం 55 మంది ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో కాకుండా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేయనున్నారు. వీరిలో ఎంపీ సభ్యత్వాన్ని ఇంకా వదులుకోని యూపీ సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి అదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో, మరో నలుగురు ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓటేయనున్నారు. రెండు శిబిరాలుగా చీలిన సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ రెండు శిబిరాలుగా విడిపోయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని ఒక వర్గం కోవింద్‌కు ఓటేయడం ఖాయం కాగా.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వర్గం మాత్రం మీరాకుమార్‌కు మద్దతు ప్రకటించింది. కోవింద్ మంచి ఎంపికని, ఆయనతో ఎప్పటి నుంచో సత్ససంబంధాలు ఉన్నాయని ఇంతకముందే ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవింద్‌కు మోదీ ముందస్తు శుభాకాంక్షలు ఎన్నికలకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి హాజరైన కోవింద్‌కు ప్రధాని శుభాకాంక్షలు చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ వెల్లడించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌తో కోవింద్‌కున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఎన్నుకునేది వీరు.. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. వీరిలో 776 మంది ఎంపీలు(233 మంది రాజ్యసభ , 543 మంది లోక్‌సభ ఎంపీలు), 4,120 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,896 మంది ఉన్నారు. ఎంపీల ఓటు విలువ 708 కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం.. ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, తర్వాత దాన్ని వెయ్యితో భాగించగా వచ్చే మొత్తం ఆ రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగించగా వచ్చే మొత్తం ఒక ఎంపీ ఓటు విలువ. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903. కాగా, 5,37,683 ఓట్లున్న ఎన్డీఏకు తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మరో 12,000 ఓట్లు అవసరం. బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గాల మద్దతుతో కోవింద్ సునాయాసంగా గెలిచే అవకాశముంది. కోవింద్ గెలుపు దాదాపు నిశ్చయమేనని తెలుస్తున్నా.. లోక్‌సభ మాజీ స్పీకర్ అయిన మీరా కుమార్ గెలుపు కోసం కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి విపక్షం ప్రయత్నాలు మానడం లేదు. మీరా, బిహార్ మాజీ గవర్నర్ అయిన కోవింద్‌లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మద్దతు కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. -
మీరా కుమార్ రాయని డైరీ
రేపే ఎన్నికలు! ఇంకా కొన్నాళ్లు ప్రచారం చేసుకునే టైమ్ ఉంటే ఎంత బాగుండేది! ‘మీ అమూల్యమైన ఓటు నాకే వేసి గెలిపించండి’ అని.. ఈ డెబ్బై రెండేళ్ల వయసులోనూ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతూ అడగడంలో.. తెలియని ఉత్సాహం ఏదో ఉంది. అప్పటికీ అంతా రామ్‌నాథ్ కోవింద్ గెలుస్తాడనే అంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తే ఆయన ఎలా గెలుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు! ఓటు వేసేవాళ్లందరికీ విడివిడిగా ఒక ఆత్మ ఉన్నట్లే, ‘మన క్యాండిడేట్కే ఓటేయాలి’ అని చెప్పే పార్టీపెద్దకి ఉమ్మడిగా ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ ప్రబోధానుసారం కాకుండా, ఆ ఉమ్మడి ఆత్మ ప్రబోధానుసారం ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేస్తే తప్ప రామ్‌నాథ్ కోవింద్ గెలిచే అవకాశాల్లేవు. ‘‘కానీ మీరాజీ.. ఆత్మలు, ఉమ్మడి ఆత్మలు రూలింగ్ పార్టీకేనా? మన అపోజిషన్ పార్టీకి ఉండవా?’’ అని బిహార్‌లో నాతో పాటు క్యాంపెయిన్‌కి వచ్చిన అశోక్ చౌదరికి సందేహం వచ్చింది. ఆశ్చర్యపోయాను. ఒక స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కి రావలసిన సందేహమేనా అది! ‘‘పవర్లో లేనివాళ్లకు విడివిడి ఆత్మలు ఉండడం ఎక్కడైనా చూశావా అశోక్. జీవాత్మలన్నీ వెళ్లి పరమాత్మలో కలిసినట్లు.. పవర్ పోగానే పార్టీలోని ఆత్మలన్నీ వెళ్లి పార్టీపెద్ద ఆత్మలో కలిసిపోతాయి. అప్పుడు ఉమ్మడి ఆత్మ ఒక్కటే ఉంటుంది’’ అని నవ్వాను. ‘‘మీ నవ్వు బాగుంటుంది మీరాజీ..’’ అన్నాడు అశోక్. అవునా అన్నట్లు చూశాను. ‘‘అవును మీరాజీ.. లోక్‌సభ స్పీకర్ ఎవరూ నవ్వుతుండగా నేను చూడలేదు. కానీ మీరు నవ్వడం చూశాను. మీ ముఖంలో నవ్వు కనిపించదు మీరాజీ.. మీ నవ్వులో ముఖం కనిపిస్తుంది. అదీ మీ స్పెషాలిటీ’’ అన్నాడు అశోక్. మొన్న మాయావతి ఇంటికెళ్లినప్పుడు తను కూడా ఇలాగే అంది.. ‘మీరాజీ.. మీకన్నా ముందు మీ నవ్వే మా ఇంట్లోకి ప్రవేశించింది’’ అని! ‘‘అయితే బెహెన్జీ.. రాష్ట్రపతి భవన్‌లోకి కూడా నా నవ్వు ప్రవేశించాలని మీరు కోరుకుంటున్నట్లేగా’’ అన్నాను నవ్వుతూ. అక్కడి నుంచి అఖిలేశ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లాను. ‘‘మేడమ్‌జీ రండి’’ అన్నారు అబ్బాయ్ అఖిలేశ్, బాబాయ్ శివపాల్. సంతోషం వేసింది. ‘‘మేడమ్‌జీ.. క్రాస్ ఓటింగ్ జరిగేలా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి’’ అన్నాడు అఖిలేశ్. ‘అవును మేడమ్‌జీ’ అన్నట్లు చూశాడు శివపాల్. నవ్వాను. బిహార్‌లో పుట్టానని చెప్పి బిహార్ ముఖ్యమంత్రి నాకేమైనా ఓటు వేస్తున్నాడా? ఇదీ అంతే. కాంగ్రెస్ క్యాండిడేట్నని చెప్పి క్రాస్ ఓటింగ్ జరక్కుండా ఉంటుందా?! ఆత్మలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పలేం! - మాధవ్ శింగరాజు -
ఇక సమరమే
► ముగిసిన రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్ ప్రచారం ► నేడు ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ భేటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తిగతంగా పర్యటించి ప్రచారం పూర్తిచేసుకున్నారు. శనివారం ఒక్కరోజే మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో సుడిగాలి పర్యటన చేశారు. అటు కోవింద్ కోసం ఆదివారం ఎన్డీయే పక్ష ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. తటస్థంగా ఉన్న ఎంపీలు, పలురాష్ట్రాల ఎమ్మెల్యేలను మోదీ మద్దతుకోరనున్నారు. మీరా కుమార్, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ సంయుక్తంగా ఆదివారం 18 పార్టీల విపక్ష కూటమి ఎంపీలకు ఢిల్లీలో తేనీటి విందు ఇవ్వనున్నారు. అయితే కాంగ్రెస్ నేతల్లోనూ కొందరు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పెట్టడం కన్నా ఎన్నిక ఏకగ్రీవం అయితేనే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకసారి మాత్రమే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండు సార్లు తీవ్రమైన పోటీ నెలకొనగా మిగిలినవి ఏకపక్షంగానే జరిగాయి. ఆ రెండు సందర్భాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి జకీర్ హుస్సేన్, విపక్షాల అభ్యర్థి కోకా సుబ్బారావు (తూర్పుగోదావరి, ఏపీ) మధ్య 1967 రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన కోకా సుబ్బారావుకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో సుబ్బారావు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలుగు వర్సెస్ తెలుగు 1969లో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో మరోసారి రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సారి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి (ఇద్దరూ తెలుగువారే) మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నీలం సంజీవరెడ్డిని (నాటి లోక్‌సభ స్పీకర్) అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్‌కు ముందు ఉపరాష్ట్రపతి వీవీ గిరి నామినేషన్ వేసి (ఇందిర ప్రోత్సాహంతో) అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని ఇందిర ప్రకటించినా తెరవెనుక రాజకీయాలతో తన అభ్యర్థి వీవీ గిరిని గెలిపించుకున్నారు. నిజలింగప్ప, కామరాజ్ నాడర్, మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, ఎస్కే పాటిల్ మొదలైన వారి నుంచి ఇందిరకు పార్టీలోనే తీవ్రమైన అసమ్మతి ఎదురైంది. అయితే 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా గెలిపించుకుంది. ఆమోదానికి 18 బిల్లులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 18 బిల్లులను ఆమోదం పొందాల్సిన బిల్లుల జాబితాలో చేర్చారని పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ శనివారం వెల్లడించింది. వీటిలో 9 బిల్లులను లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిందనీ, కొన్నింటిని రెండు సభలూ ఆమోదించాల్సి ఉందని పీఆర్ఎస్ పేర్కొంది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. -
కాంగ్రెస్‌ది దిగజారుడు రాజకీయం
మీరాకుమార్ను బలిపశువును చేస్తున్నారు: బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నామని, రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఎందుకిస్తున్నామో పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కోవింద్ దళితుడు మాత్రమే కాకుండా న్యాయ కోవిదుడని, సీఎం కేసీఆర్ సూచనతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత అభ్యర్థిని మోదీ ఎంపిక చేశారని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారంబాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతల అభిప్రాయం తీసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దళితుల మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే ఎన్డీయే కంటే ముందే ఎందుకు దళిత అభ్యర్థిని ప్రకటించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మీరాకుమార్ అంటే తమకూ ప్రత్యేక అభిమానం ఉందని, కాంగ్రెస్ ఆమెను బలి పశువును చేస్తోందన్నారు. సీబీఐ కేసులకు భయపడే టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇచ్చిందనడం బట్టకాల్చి మీద వెయ్యడమేనని, సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు. ఎన్డీయేలోలేని బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా టీఆర్ఎస్ తరహాలోనే కోవింద్‌కు మద్దతు ఇస్తున్న విషయం కాంగ్రెస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంపత్ అవగాహన లేమితో క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ ఓట్లన్నీ కోవింద్‌కే పడతాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కోదండరాంగ్గా మారారని, తప్పుడు ప్రయోజనాలతో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. -
'మీరాకుమార్ను కేసీఆర్ అవమానించారు'
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందన్న సీఎం కేసీఆర్ అదే సోనియా గాంధీ నిలబెట్టిన మీరాకుమార్ ఫోన్ చేస్తే కేసీఆర్ ఎందుకు ఫోన్ ఎత్తడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్, మీరాకుమార్ ను అవమానించారని పేర్కొన్నారు. తెలంగాణ రావడంలో మీరాకుమార్ పాత్ర మరువలేనిదన్నారు. ఏ ఒప్పందంతో బీజేపీ అభ్యర్ధికి సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తున్నారో ప్రజలకి చెప్పాలని సూటిగా అడిగారు. సీబీఐ కేసులకా? మరే ఒప్పందం అయినా వుందా? ఎందుకు బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. ప్రజలారా బీజేపీ అభ్యర్థికి ఓటెందుకు వేస్తున్నారో టీఆర్ఎస్ నేతలను నిలదీయండని కోరారు. -
విమానం మిస్సయిన మీరాకుమార్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఫ్లైట్ మిస్సయ్యారు. సాయంత్రం 5.15 గంటలకు ఆమె విమానం ఎక్కాల్సి ఉంది. అయితే, వీఐపీ లాంజ్‌లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడుకుంటూ ఉండిపోయిన ఆమె సమయానికి లోపలికి వెళ్లలేకపోయారు. దీంతో విమానం వెళ్లిపోయింది. దీంతో రాత్రి 8 గంటలకు భువనేశ్వర్ వెళ్లే విమానం కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో వామపక్ష నాయకులతో సమావేశమయ్యారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతిగా పోటీ
-
సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతిగా పోటీ: మీరా కుమార్
హైదరాబాద్ : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడినట్లు తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన 17 రాజకీయ పార్టీలకు మీరా కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంఐఎంను కూడా మద్దతు ఇవ్వాలని కోరతామని ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ మద్దతు కోసం ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే యూపీఏ తెలంగాణ ఇచ్చిందని మీరా కుమార్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీరా కుమార్‌కు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. -
హైదరాబాద్ చేరుకున్న మీరా కుమార్
హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో...ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె గాంధీభవన్‌కు చేరుకుంటారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులతో సమావేశమవుతారు. అక్కడే అందరితో కలసి భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తోపాటు 18 రాజకీయ పక్షాల మద్దతు కలిగిన యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశం ముగిసిన తరువాత మీరాకుమార్ విలేకరులతో మాట్లాడనున్నారు. తరువాత బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులు, మీడియా ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
సోమవారం హైదరాబాద్‌కు మీరాకుమార్
హైదరాబాద్: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడతారు. తరువాత బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులు, మీడియా ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
మీ మద్దతు మాకే!
♦ చెన్నైలో రాష్ట్రపతి అభ్యర్థుల బిజీ ♦ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పలకరింపు ♦ అమ్మ శిబిరానికి తనియరసు షాక్ ♦ కేంద్రం ముందు డిమాండ్లు సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండంతో ఆ పదవికి ఎన్నికలు ఈనెల 17వ తేదీ జరగనున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరాకుమార్ రేసులో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఓట్లు రామ్‌నాథ్ కోవింద్ ఖాతాలో పడనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ముక్కులుగా ఉన్న సీఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే(అమ్మ), మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని (పురట్చి తలైవి) శిబిరాలు తమ మద్దతు ప్రకటించాయి. స్వయంగా ఆ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లి మరీ రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఈపరిస్థితుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను స్వయంగా కలిసి మద్దతు సేకరించేందుకు కోవింద్ నిర్ణయించారు. దీంతో ఉదయాన్నే ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. రంగన్న మద్దతు : చెన్నైకి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పొన్ రాధాకృష్ణన్, జేపీ నడ్డా, తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, మురళీధర్ రావు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. గిండిలోని ఓ హోటల్‌కు చేరుకున్న ఆయన్ను పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్ష నేత, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. కేరళకు చెందిన బీజేపీ వర్గాలు సైతం రామ్‌నాథ్‌తో భేటీ అయ్యాయి. తదుపరి అక్కడి నుంచి నేరుగా ఆళ్వార్ పేటలోని రష్యన్ కల్చరల్ సెంటర్‌కు చేరుకున్న రామ్‌నాథ్‌కు అన్నాడీఎంకే పురట్చి తలైవీ శిబిరం వర్గాలు ఘన స్వాగతం పలికారు. ముక్త కంఠంతో మద్దతు : మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముక్తకంఠంతో ఆ శిబిరం ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించడం గమనార్హం. వేదిక మీద నుంచి అందర్నీ రామ్‌నాథ్ పలకరిస్తూ మద్దతు సేకరించారు. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, గెలుపు రేసులో ఉన్న అభ్యర్థికి తామంతూ ముక్తకంఠంతో మద్దతు ప్రకటించామన్నారు. ఇదివరకే తాము హామీ ఇచ్చామని, ఆయనకు ప్రస్తుతం స్వయంగా తెలియజేశామన్నారు. తాము ఎలాంటి నిబంధనల్ని విధించలేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. అమ్మ శిబిరంతో..: కాసేపు విశ్రాంతి అనంతరం మళ్లీ హోటల్‌కు రామ్‌నాథ్ పయనం అయ్యారు. ఈ సమయంలో ఆయన డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి మద్దతు కోరబోతున్నట్టుగా సమాచా రం వెలువడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే, అలాంటి ప్రయత్నాలు సాగలేదు. సాయంత్రం ట్రిప్లికేన్‌లో కలైవానర్ అరంగంలో సీఎం పళని స్వామి నేతృత్వంలో జరిగిన మద్దతు కార్యక్రమానికి ఆయన హాజ రు అయ్యారు. అమ్మ శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపిలను వేదిక మీద నుంచి పలుకరిస్తూ మద్దతు సేకరించారు. తనియరసు షాక్ : అసెంబ్లీ ఎన్నికల్లో రెండాకుల చిహ్నంతో అన్నాడీఎంకే మిత్రపక్షానికి చెందిన తనియరసు, తమీమున్ అన్సారీ, కరుణాస్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు అన్నాడీఎంకే మద్దతు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వీరిలో తనియరసు తాజా కార్యక్రమానికి దూరం అయ్యారు. అంతే కాకుండా, కేంద్రం రూపంలో తమిళులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీట్, జీఎస్టీ తదితర అంశాలను వివరించారు. ఈ సమయంలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తే, ఓట్లు వేసిన జనం నుంచి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తనియరసు వ్యాఖ్యానించారు. తమిళుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, అన్ని డిమాండ్ల కు కేంద్రం తలొగ్గినప్పుడే మద్దతు అని ప్రకటిస్తూ, తన నిర్ణయాన్ని తటస్థంగా ఉంచారు. ఇక, తమీమున్ అన్సారి తన మద్దతును మీరాకుమార్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనిద నేయ జననాయగ కట్చి వర్గాలుపేర్కొంటున్నాయి. అయితే, కరుణాస్ మాత్రం తన మద్ద తు అమ్మ శిబిరం నిర్ణయం మేరకు అని పేర్కొన్నారు. మీరాకుమార్ మద్దతు వేట : లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్య సభ సభ్యుల్ని మీరాకుమార్ కలిసి మద్దతు సేకరించారు. ఢిల్లీ నుంచి సాయంత్రం చెన్నై చేరుకున్న ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్‌లతో పాటుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు మీద తనకున్న అభిమానాన్ని ఈసందర్భంగా మీరాకుమార్ చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి లీలా ప్యాలెస్‌కు చేరుకుని డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలను స్వయంగా పలకరిస్తూ మద్దతు సేకరించారు. ఇక, సిపీఎం(రంగరాజన్), సీపీఐ (డి రాజ), డీఎంకే (తిరుచ్చి శివ, కనిమొళి) రాజ్యసభ సభ్యులను పలకరిస్తూ మద్దతు సేకరించారు. అందరూ తనకు మద్దతుగా నిలబడాలని కోరారు. -
నేనేం బలిపశువును కాదు
రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ బెంగళూరు: రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తానేం బలిపశువును కాదని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలను కలుసుకున్న తరువాత మీడియాతో మాట్లాడారు. జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను కూడా కలుసుకుని తనకు మద్దతివ్వాలని కోరారు. ‘ నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతూ, ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని కోరడం బలిపశువు అయినట్లు కాదు. నా ఈ పోరాటంలో మరింత మంది చేరతారు’ అని అన్నారు. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే విలువలు, సిద్ధాంతాల కోసం పోరాడుతున్నానని చెప్పారు. అలాంటప్పుడు ఎన్నిక ఎందుకు?: ఎక్కడికెళ్లినా తనకు తగినంత సంఖ్యా బలం లేదనే మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు నేరుగా ఫలి తాలు ప్రకటించకుండా, ఎన్నిక ఎందుకు నిర్వహిం చడమని మీరా ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక దళి తుల మధ్య పోరు అని భావించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో అగ్ర కులస్తులు పోటీపడినపుడు వారి కులాలు ప్రస్తావనకు రాలేదని, వారి అర్హతలు, సాధించిన విజయాలపైనే చర్చలు జరిగేవని పేర్కొన్నారు. -
మీరాకుమార్ దేశవ్యాప్తంగా జోరుగా ప్రచారం
-
మీరా కుమార్ ప్రచారం ప్రారంభం
అహ్మదాబాద్: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ శుక్రవారం తన ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో మీరా కుమార్ చర్ఖా తిప్పారు. 'సబర్మతీ ఆశ్రమం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. ఇక్కడకు వస్తే గొప్ప శక్తి వస్తుంది. అందుకే నేను ఇక్కడకు వస్తుంటాను' అని మీరా కుమార్ అన్నారు. బుధవారం నామినేషన్ సందర్భంగా.. గాంధీజీ ఆలోచనలు, భావజాలాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ముందుకు తీసుకెళ్తుందని మీరా కుమార్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆమె పోటీలో ఉన్న విషయం తెలిసిందే. -
‘కేసీఆర్ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ హోదాలో ఉండి తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్కు విధేయుడు రామ్‌నాథ్ కోవింద్ పోటీలో ఉన్న సమయంలో ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతలైన ఒవైసీ సోదరులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జీఎస్టీపై ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని, జీఎస్టీ అమలైతే చిన్న వ్యాపారులు అడ్డుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లనే మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ వేయడంలేదని, కేసీఆర్ అవినీతికి కేంద్ర ప్రభుత్వం వంత పాడటం దారుణని వీహెచ్ అన్నారు. ఈ భూములపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
రాష్ట్రపతి రేసులో 92 మంది!
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి పదవి కోసం ఎంతమంది బరిలోకి దిగారో తెలుసా.. 90మందికిపైగానే. అదేమిటీ ఎన్డీయే తరుపున రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ పార్టీ తరుపున మీరా కుమార్ మాత్రమేగా పోటిలోకి దిగిందని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే..మొత్తం 90మందికి పైగానే రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే, వారిలో 90మందికి పైగా నామినేషన్ పేపర్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. వాటికి సరైన ఆధారాలు, రుజువు పత్రాలు సమర్పించలేదనే కారణంతోపాటు చట్టప్రతినిధుల మద్దతులేదనే కారణంతో వాటిని రిజెక్ట్ చేసింది. చివరకు రామ్‌నాథ్ కోవింద్, మీరా కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు మాత్రమే విలువైనవిగా, అన్ని రకాలుగా అర్హతలు గలవిగా ఈసీ గుర్తించింది. -
మీరాకుమార్ నామినేషన్ దాఖలు
♦ హాజరైన సోనియా,మన్మోహన్, విపక్షాల నేతలు ♦ సైద్ధాంతిక పోరాటం మొదలైందన్న మాజీ స్పీకర్ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అగ్రనేతల సమక్షంలో ఆమె పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారి అయిన లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డి.రాజా(సీపీఐ), కనిమొళి(డీఎంకే), నరేశ్ అగర్వాల్(ఎస్పీ), సతీశ్‌చంద్ర మిశ్రా (బీఎస్పీ), డెరెక్ ఓబ్రియాన్(తృణమూల్ కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు. సోనియా, మన్మోహన్, ఇతర కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధాని దేవెగౌడ, విపక్షాల నేతలు మీరా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, బలపరిచారు. ‘ఈ రోజు నుంచి మా సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది. ప్రజాస్వామిక విలువలు, అందరినీ కలుపుకునిపోవడం, పత్రికాస్వేచ్ఛ, వ్యక్తుల స్వేచ్ఛ, పేదరిక నిర్మూలన, పారదర్శకత, కులవ్యవస్థ నిర్మూలన మా సిద్ధాం తానికి ఆధారం’ అని ఆమె అన్నారు. ‘పేదలు, అట్టడుగువర్గాలను పట్టిం చుకోకుండా మనల్ని సంకుచితత్వం వైపు తీసుకెళ్లే దారి ఒకటుంది. దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, కార్మికులు, అన్ని మతాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసే మరో మార్గం ఉంది. అంతరాత్మ మాట విని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఉద్దేశించి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. కాగా, ఈ ఎన్నికల కోసం మొత్తం 95 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 150 ఎన్నికల్లో పోటీ చేసిన గిన్నిస్ రికార్డులకెక్కిన తమిళనాడు వాసి కె.పద్మరాజన్ కూడా ఉన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన మీరా కుమార్
న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినాయకులతోపాటు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి. కాగా నామినేషన్ వేసేందుకు ముందుగా మీరా కుమార్ ...ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. -
ఇది కులపోరాటం కాదు.. భావజాల పోరాటం!
న్యూఢిల్లీ: తాజా రాష్ట్రపతి ఎన్నిక కులపోరాటం కాదని, ఇది భావజాల సంగ్రామమని ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్ అన్నారు. విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంతరం తొలిసారి ఆమె మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రఖ్యాత దళిత నాయకుడు జగ్జీవన్‌రామ్ కూతురైన ఆమె రాష్ట్రపతి ఎన్నికను 'దళిత్ వర్సెస్ దళిత్'గా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా కుల వ్యవస్థను భూలోలోతుల్లో పాతిపెట్టాలని అన్నారు. ఎన్డీయే తరఫున బిహార్ మాజీ గవర్నర్ నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయనకు పోటీగా దిగిన మీరాకుమార్‌కు 17 విపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఫలానా కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోరుగా ఈ ఎన్నికను అభివర్ణిస్తే.. అది రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుంది' అని అన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతుగా బలమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఓటమిని అంగీకరించడానికి మీరాకుమార్ నిరాకరించారు. 'నేను ఓడిపోయే అభ్యర్థిని, ఇది ఓడిపోయే పోరాటమని ఎందుకు అంటున్నారు? నేను పోరాడుతున్నాను. నేను గట్టి పోటీ ఇవ్వగలనని అనుకుంటున్నా' అని ఆమె చెప్పారు. -
రాష్ట్రపతి ఎన్నికలు: రేపు మీరాకుమార్ నామినేషన్
- తరలివెళ్లనున్న టీపీసీసీ ముఖ్యనేతలు - పనిలోపనిగా మియాపూర్ భూకుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు హైదరాబాద్‌సిటీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభ సెక్రటరీ కార్యాలయంలో జరుగనున్న కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం తెలంగాణ కాంగ్రెస్ కీలకనేతలంతా ఢిల్లీ వెళ్లనున్నారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, షబ్బీర్ అలీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ అఖిలపక్షం నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మియపూర్ భూముల కుంభకోణంపై ఫిర్యాదుచేయనున్నారు. భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అఖిలపక్షం కోరనుంది. -
మీరాకుమార్‌పై సుష్మా వీడియో దాడి
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌పై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ విమర్శల దాడి చేశారు. 2013నాటి లోక్‌సభలో తాను మాట్లాడుతున్న సందర్భంలో తన పట్ల నాడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ ఎలా వ్యవహరించారో తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక దేశ ప్రాధాన్యమున్న అంశంపై తాను మాట్లాడుతుంటే మీరాకుమార్ పదేపదే జోక్యం చేసుకొని తన ప్రసంగాన్ని ముగించాలని ఎలా ఒత్తిడి చేశారో ఆ వీడియో ద్వారా చూపించారు. యూపీఏ ప్రభుత్వం నాడు వివిధ అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ సుష్మా స్వరాజ్ 2013లో లోక్‌సభలో కొద్ది సేపు మాట్లాడారు. ఆ సమయంలో ఇక చాలంటూ మీరా కుమార్ ఆమెను నిలువరించే యత్నం చేశారు. 'ప్రతిపక్షనేత పట్ల నాడు స్పీకర్ మీరా కుమార్ వ్యవహరించిన తీరు ఎలా ఉందో చూపించేందుకు ఇది నిదర్శనం' అంటూ సుష్మా ఆదివారం తన ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో 2013 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల నాటిది. -
మీరా కుమారే ప్రధాన మంత్రి అయితే...
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టిన దళిత విద్యావేత్త రామ్‌నాథ్ కోవింద్‌కు ఎక్కువ శాతం ఓట్లు ఉండడమే అందుకు కారణం. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ నేటిలాగే ఏకమై మీరా కుమారినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడది అసంబద్ధంగాను, అర్థరహితంగాను, నైరూప్య చిత్రంగాను అనిపించవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకత్వంలో 17 పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రతపక్షం తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆది నుంచి కాంగ్రెస్ వెంటబడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలకపక్షంవైపు మొగ్గుచూపారు. ముందుగానే మీరా కుమార్ పేరును ప్రతిపాదించి ఉన్నట్లయితే నితీష్ కుమార్ ప్రతిపక్షం వెంట వచ్చేవారే. తొందరపడి ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి, అందులోనూ దళితుడన్న భావంతో కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకునే రకం కాదుకనుక ఆయన తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వద్ధి రేటు 7.8 నుంచి 6.1 శాతానికి పడిపోవడం, గోవధ నిషేధం తదితర పరిణామాలు పాలకపక్షానికి దళితులను, ముస్లింలను దూరం చేశాయి. ఈ రెండు వర్గాలే కలసి ఉత్తరప్రదేశ్ జనాభాలో 34 శాతం మంది ఉన్నారు. యూపీలో దళితులంతా ఒక్క మాయావతి వెనకాలే కాకుండా వివిధ గ్రూపుల కింద ఏకమవుతున్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిచ్చిన మహారాష్ట్రకు చెందిన మహర్లు గోవధ నిషేధం కారణంగా బౌద్ధ మతంలోకి మారిపోయారు. జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా గుజరాతీలోని మార్వీడీలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంతకాలం మోదీకి హారతులు పట్టిన వారే. కానీ జీఎస్టీ తమ తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యతా రాగం వినిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ఎన్డీయేను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాల వ్యూహం. ఈ వ్యూహం నెరవేరాలంటే మోదీ లాంటి నాయకుడిని ఢీకొనే సమర్థుడైన నాయకత్వం కావాలి. నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ నాయకుడిగా తాను ప్రతిపక్షంలో ఎదగాలన్న ఆలోచనతోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టాలని పోరారు. ఇప్పుడు ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలేవీ గుర్తించడం లేవు. అలా ఎదుగుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్‌గా, విదేశీ దౌత్యవేత్తగా సమర్థంగా విధులు నిర్వహించిన రాజకీయానుభవమే కాకుండా మీరా కుమార్‌కు ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. పైగా దళిత నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే కనుక ఆ పార్టీనే మీరా కుమార్‌ను బరిలోకి దించితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ‘గాంధీ–నెహ్రూ’ వారసత్వ పాలనను పక్కన పెట్టాల్సిందే. 1991లో అలా చేయడం వల్లనే పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాగలిగారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పుత్రరత్నాన్ని పక్కన పెడితే మరింత బలంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోదఫా ఎన్నికల్లో పుత్ర రత్నానికి పట్టాభిషేకం చేసే అవకాశం రావచ్చు. ప్రస్తుతానికి బంతి సోనియా గాంధీ చేతుల్లోనే ఉంది. ––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
'ఓడిపోవడానికి బిహార్ బేటిని పెట్టారు'
పట్నా: లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అంటే తనకు అమితమైన గౌరవం అని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. అయిన, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తన మద్దతు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కేనని ఈ విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఓడిపోవడానికి బిహార్ కి బేటీని(మీరాకుమార్)ను ప్రతిపక్షాలు నిలబెట్టాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి నితీష్ మద్దతివ్వడం చారిత్రక తప్పిదం అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అన్న నేపథ్యంలో ఆ ఇద్దరు విడిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు నితీష్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఈ సమయంలో వారిద్దరి మధ్య చర్చ జరిగి తిరిగి నితీష్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని అనుకున్నారు. అయితే, తన నిర్ణయం మారే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా, తమ బంధానికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్‌కే లాలూ ప్రసాద్ మద్దతిచ్చారు. -
మీరా పేరు ముందే చెప్పలేదేం?
- విపక్షాలు దళితులను అవమానించాయన్న యూపీ సీఎం న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపడం ద్వారా విపక్షాలు దళితులను అవమానపర్చాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ ఘట్టంలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలకు దళితులంటే ప్రేమ ఉండుంటే తమ అభ్యర్థిగా మీరా కుమార్ పేరును ముందే ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడు పేరు వెల్లడించడం దళితులను అవమానించినట్లు కదా?’ అని ఆదిత్యనాథ్ మండిపడ్డారు. కోవింద్ సమర్థతకు ఇదే నిదర్శనం: వెంకయ్య ఎన్డీఏ భాగస్వామి కాకపోయినప్పటికీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పలికిందని, తద్వారా ఆయన(కోవింద్) విపక్షాలకు కూడా ఆమోదయోగ్యమైన వారనే విషయం నిరూపణ అయిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. -
వెంకయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి: షబ్బీర్
హైదరాబాద్ : రుణమాఫీలు కోరడం ఫ్యాషన్ అయిపోయిందన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. ఆయన తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ... వెంకయ్య వ్యాఖ్యలతో బీజేపీ రైతు వ్యతిరేకమి తేలిపోయిందన్నారు. లేదంటే కేసీఆర్ చరిత్రహీనుడే... తెలంగాణ ఏర్పాటులో మీరాకుమార్ పాత్ర కీలకమని, తెలంగాణ బిల్లు పాస్ కావడంలో స్పీకర్ గా మీరాకుమార్ ఎంతో కృషి చేశారని షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రుణం తీర్చుకోవాలంటే కేసీఆర్, యూపీఏ పక్ష రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు ప్రకటించాలని లేదంటే కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడని పేర్కొన్నారు. ఎన్డీయే మీద కేసీఆర్ కు ఎందుకంత ప్రేమ..? అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లులోని హామీలు ఇవ్వనందుకే మోడీకి మద్దతా..? అని సూటిగా ప్రశ్నించారు. ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లలను వ్యతిరేకించిన బీజేపీకి మద్దతు ఎలా ఇస్తారు.? అని అన్నారు. -
పేరుకే పోటీ!
యూపీఏ, ఇతర విపక్షపార్టీలు మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. వామపక్షాలు చెప్పినట్లు ఇది సైద్దాంతిక పోటీయే తప్పితే... ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని అంకెలు చెబుతున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగంకన్నా ఒక ఓటు ఎక్కువ (5,49,452 ఓట్లు) వచ్చిన వారు గెలుస్తారు. మొత్తం ఓట్ల విలువను 100 శాతంగా తీసుకొని... ఏయే కూటమికి ఎంత శాతం ఓట్లున్నాయి, మద్దతిచ్చే పార్టీల ఓట్ల విలువను బట్టి చూస్తే... గురువారం నాటికి ఎవరి బలమెంతంటే... ఎన్డీయే బలం... ================================== పార్టీ ఓట్ల విలువ ఓట్లశాతం ================================== బీజేపీ 4,42,117 40.03 –––––––––––––––––––––––––––––––––– టీడీపీ 31,116 2.82 –––––––––––––––––––––––––––––––––– శివసేన 25,893 2.34 –––––––––––––––––––––––––––––––––– అకాలీదళ్ 6,696 0.61 ––––––––––––––––––––––––––––––––– ఇతర చిన్నపార్టీలు 31,861 2.84 ================================= మొత్తం 5,37,683 48.64 ================================= బీజేపీ– కాంగ్రెస్‌లు రెండింటికీ సమదూరం పాటించే తటస్థ పార్టీల్లో... వైఎస్సార్సీపీ (16,848 ఓట్ల విలువ– 1.53 ఓట్లశాతం), టీఆర్ఎస్ (22,048– 1.99), బీజేడీ (32,892– 2.98), అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు (59,224– 5.36) ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతని ప్రకటించాయి. తాజాగా బుధవారం బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ పార్టీ జేడీయూ మద్దతు కోవింద్‌కు ఉంటుందని ప్రకటించారు. జేడీయూకు 1.89 శాతం ఓట్లున్నాయి(ఓట్ల విలువ 20,935). ఎన్డీయే బలానికి వీరి ఓట్లు కూడా తోడైతే కోవింద్‌కు ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న బలం 62.39 శాతం. విజయానికి 5,49,452 ఓట్లు వస్తే చాలు. అయితే ఇప్పుడు కోవింద్‌కు అనుకూల ఓట్లు 6,89,630 కావడం గమనార్హం. దీనిని బట్టి విపక్షపార్టీలు మొక్కుబడిగా పోటీకి దిగుతున్నాయనేది స్పష్టమవుతోంది. విపక్ష ఉమ్మడి అభ్యర్థి బలం ==================================== పార్టీ ఓట్ల విలువ ఓట్లశాతం కాంగ్రెస్ 1,61,478 14.62 –––––––––––––––––––––––––––––––––––– తృణమూల్ 63,847 5.78 –––––––––––––––––––––––––––––––––––– సమాజ్‌వాది 26,060 2.36 –––––––––––––––––––––––––––––––––––– సీపీఎం 27,069 2.45 –––––––––––––––––––––––––––––––––––– బీఎస్పీ 8,200 0.74 –––––––––––––––––––––––––––––––––––– ఆర్జేడీ 18,796 1.7 –––––––––––––––––––––––––––––––––––– డీఎంకే 18.352 1.66 –––––––––––––––––––––––––––––––––––– ఎన్సీపీ 15,857 1.44 –––––––––––––––––––––––––––––––––––– ఇతర చిన్నపార్టీలు 31,145 2.83 ==================================== మొత్తం 3,70,804 33.58 ==================================== ► యూపీఏ అభ్యర్థికి 3,70,804 అనుకూల ఓట్లున్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో 33.58 శాతం మద్దతు ఉందన్నమాట. ► ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఆప్ (0.82 ఓట్ల శాతం), ఐఎన్ఎల్డీ (0.38), స్వతంత్రులు, ఇతర చిన్నాచితక పార్టీలు ఏ వైఖరి తీసుకున్నా అంతిమఫలితంపై ప్రభావమేమీ ఉండదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మీరా ఎంపిక చెప్పేదేమిటి?
చాలామంది ఊహించినట్టే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఎంపికయ్యారు. మీరాకుమార్ అభ్యర్థిత్వంపై మొద ట్లోనే ఊహాగానాలొచ్చినా వామపక్షాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్నూ లేదా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ రాజ్ మోహన్‌గాంధీ పేర్లను ప్రతిపాదిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. తమ అభ్యర్థి రాజ్‌నాథ్ కోవింద్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించమని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేసినా మొదట్లోనే కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి. అభ్యర్థి ఎవరో ముందుగా చెబితే మద్దతు విషయం ఆలోచిస్తామని అంతక్రితం తమను కలిసిన బీజేపీ నేతలకు చెప్పినా ఏకపక్షంగా కోవింద్ పేరును ప్రతిపాదించా రన్నది విపక్షాల ప్రధాన విమర్శ. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో అధిక శాతం ఎన్డీఏ ఖాతాలోనే ఉంటాయని తేలిపోయింది కనుక రాష్ట్రపతి ఎన్నిక లాంఛనప్రాయమే అవుతుంది. విపక్షాలు ఇది ‘సిద్ధాంత సమరం’అంటున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకొచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై పెరిగిన దాడులకు నిరసనగానే పోటీ చేయాలని నిర్ణయించామని చెబుతున్నాయి. కనుక ప్రచార పర్వంలో ఈ అంశాలన్నిటిపైనా చర్చలు, వాగ్యుద్ధాలు జోరుగానే ఉంటా యనుకోవచ్చు. బరిలో నిలవనున్న ప్రధాన పక్షాల అభ్యర్థులిద్దరూ దళితులే. పైగా మీరాకుమార్ దళిత మహిళ. దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన జగ్జీవన్‌రాం కుమార్తె. అటు కోవింద్ పెద్దగా ఎవరికీ తెలియని నాయ కుడు. రాజకీయ నేపథ్యం లేని, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇద్దరూ రాజకీయాల్లోకి రాకముందు ఉన్నతాధికారులుగా పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినంతవరకూ విపక్షాలు వెనకబడ్డాయనే చెప్పాలి. నెల్లాళ్లక్రితం సమావేశమైనప్పుడు ఆ పార్టీలు పాలకపక్షం వైఖరేమిటో చెప్పాలని ప్రకటించి ఊరుకున్నాయి. నిజంగా ‘సిద్ధాంత సమరం’ అనుకున్న ప్పుడు విపక్షాలే తొలుత అభ్యర్థిని ప్రకటించి ఉండాలి. ఆ పని ఎందుకు చేయ లేకపోయాయి? బీజేపీ నిర్ణయం కోసం ఎందుకంత ఎదురుచూశాయి? ఒకవేళ ముందే తమ అభ్యర్థిని ప్రకటించిన పక్షంలో అవి ఇప్పట్లాగే మీరా కుమార్‌ను ఎంపిక చేసేవా? అనుమానమే. తాను ప్రతిపాదించిన అభ్యర్థి గెలిచి తీరడం ఖాయమనుకున్నప్పుడు కాంగ్రెస్‌కు మీరాకుమార్ గుర్తుకురాలేదు. తమ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె తండ్రి జగ్జీవన్‌రామ్ గుర్తుకురాలేదు. అప్పుడు అనామకురాలేకాక వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిభాపా టిల్‌ను రాష్ట్రపతిని చేసింది. ఓటమి ఖాయమని స్పష్టంగా తెలిసిన ప్రస్తుత తరుణంలో, బీజేపీ దళిత అభ్యర్థిని ప్రకటించాక మాత్రం మీరాకుమార్ను నిలిపింది. ఆమె ప్రతిభ, సామర్థ్యాల విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. మీరా కుమార్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయిదు దఫాలు ఎంపీగా గెలి చారు.కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి. దేశంలో ఇతర దళిత నేతలకన్నా అణగారిన వర్గాల్లో మీరాకుమార్ కున్న ఆదరణ కూడా అధికమే. నిజానికి విపక్షాలు ఎన్డీఏ కన్నా ముందుగా మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే బిహార్ సీఎం నితీష్‌కుమార్ ఇప్పటిలా వేరు దారిలో వెళ్లే సాహసం చేసేవారు కాదు. మీరా ఎంపిక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏను కానీ, దానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీని కానీ కంగారు పెట్టలేదు. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిం దన్నట్టు నితీష్ కుమార్‌నూ, ఆయన పార్టీ జేడీ(యూ)నూ కాస్త ఇరకాటంలోకి నెడుతుంది. బిహార్ గవర్నర్ కనుక కోవింద్‌ను సమర్ధిస్తున్నానని ఇప్పటికే నితీష్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ‘బిహార్ గవర్నర్’గా పనిచేసిన వ్యక్తిని సమర్థించడం సరైందో, ‘బిహార్ పుత్రిక’కు మద్దతునివ్వడం సరైందో తేల్చుకోవాల్సిన స్థితి ఆయనకు ఎదురైంది. తమ నిర్ణయంలో మార్పు లేదని జేడీ(యూ) ఇప్పటికే ప్రకటించింది. కానీ మహా దళితుల్లో ఆ పార్టీ వ్యతిరేకత చవిచూడక తప్పదు. బిహార్‌లో జేడీ(యూ)–ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి తక్షణం వచ్చే ప్రమాదం లేకపోవచ్చుగానీ రాష్ట్రపతి ఎన్నిక తర్వాత అది మునుపటిలా మనుగడ సాగించలేదు. అయితే నితీష్‌కున్న అసలు సమస్య వేరు. ఆర్జేడీ అధి నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కూ, ఆయనకూ మధ్య నానాటికీ దూరం పెరుగు తోంది. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరైన తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ఉంటే, తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా పనిచేస్తున్నారు. తండ్రితోనే కాదు... వీరిద్దరితోనూ నితీష్‌కు సమస్యలున్నాయి. ఇవి చాల వన్నట్టు ఈమధ్యే లాలూ సతీమణి రాబ్డీ దేవి ఒక ఇంటర్వ్యూలో వృద్ధ నేతలు తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆమె ఎవరిని ఉద్దే శించి ఆ మాటలన్నారో వేరే చెప్పనవసరం లేదు. నిజానికి బిహార్‌లో తన చిరకాల ప్రత్యర్థి లాలూతో రాజీపడి ఆయనతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించింది నితీష్‌కుమారే. అప్పట్లో నరేంద్రమోదీతో తీవ్రంగా విభేదించి రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఆయన ఆ ఎత్తుగడ వేశారు. ఆ బలహీనతను లాలూ అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా వినియోగిం చుకుంటున్నారు. అప్పుడప్పుడు పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఈ సమస్యల న్నిటివల్లా ఏదో ఒకనాడు మహాకూటమి బద్దలవడం ఖాయమని నితీష్ చాన్నాళ్లక్రితమే అంచనా వేసుకున్నారు. అందువల్లే ఆయనకు నచ్చజెబుతా మని, ఆ పార్టీ నిర్ణయం మారే అవకాశం ఉన్నదని లాలూ అంటున్నా జేడీ (యూ) మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. నిజానికి ఎలక్టోరల్ కాలేజీలో ఆ పార్టీకున్న ఓట్ల శాతం 1.89 మాత్రమే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బిహార్ రాజకీయాలపై ఈ కొత్త చెలిమి చూపే ప్రభావం ఎక్కువ. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నిక మాటెలా ఉన్నా విపక్షాల ఐక్యత మాత్రం ఇబ్బందుల్లో పడిందని బిహార్ పరిణామాలు రుజువు చేశాయి. -
నామమాత్రపు పోరులో కాంగ్రెస్‘దళితాయుధం’ మీరా కుమార్!
కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్ కాంగ్రెస్ నాయకురాలిగా కన్నా దళిత కాంగ్రెస్ నేత జగజ్జీవన్‌రాం కూతురుగానే దేశ ప్రజలందరికీ తెలుసు. 15 ఏళ్లు ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్)అధికారిగా పనిచేసి 1985 బిజ్నోర్(యూపీఎస్సీ రిజర్వ్డ్) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేశారు. ఈ తొలి ఎన్నికల పోరులో అప్పటికే ప్రముఖ దళిత నేతలుగా పేరుసంపాదించిన రాంవిలాస్ పాస్వాన్, మాయావతిని ఓడించారు. తర్వాత బిహార్‌లోని తన తండ్రి నియోజకవర్గం సాసారాం(ఎస్సీ) నుంచి పోటీచేసి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని కరోల్‌బాగ్(ఎస్సీ) నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి గెలిచినా, 1999 ఎన్డీఏ ప్రభజనంలో అక్కడ ఓటమిపాలయ్యారు. మళ్లీ సొంత రాష్ట్రంలోని సాసారాం నుంచే 2004 లోక్ సభకు ఎన్నికయ్యాక మన్మోహన్ సింగ్ కేబినెట్లో సామాజిక న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో మరోసారి సాసారాం నుంచే గెలిచి లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి మహిళా సభాపతిగా సేవలందించారు. ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చదువు.. డెహ్రాడూన్, జైపూర్‌లోని ప్రసిద్ధ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలైన ఇంద్రప్రస్త కాలేజీ, మిరాండా హౌస్ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. 1970లో ఐఎఫ్ఎస్లో చేరి అనేక దేశాల్లో దౌత్య అధికారిగా మీరా పనిచేశారు. బీహార్‌కే చెందిన తోటి ఐఎఫ్ఎస్అధికారి మంజుల్ కుమార్‌ను ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. మీరా దళితుల్లో చర్మకారులైన చమార్ సామాజికవర్గంలో పుట్టగా, మంజుల్ బీసీ వర్గమైన కోయిరీ(కుష్వాహ)కుటుంబంలో జన్మించారు. మార్చి 31న 72 ఏళ్లు నిండిన మీరా కుమార్ దంపతుల సంతానం ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.- (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత వ్యక్తిని బరిలోకి దింపి ప్రతిపక్షాలను సందిగ్ధంలో పడేసిన బీజేపీకి...విపక్షాలు కూడా దీటుగా సమాధానం ఇచ్చాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ప్రతిపక్షాలు ఎంపిక చేశారు. గురువారం సాయంత్రం సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో ఎన్నికల్లో తలపడనున్నారు. మీరా కుమార్ ఈ నెల 27 లేదా 28వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. విపక్షాల భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...మీరా కుమార్‌కు 17 పార్టీల మద్దతు ఉందని తెలిపారు. సైద్ధాంతికంగానే మీరా కుమార్ పోటీ చేస్తున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆమె నామినేషన్ పై ప్రతిపక్షాలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. బిహార్ రాష్ట్రం పట్నాకు చెందినమీరా కుమార్.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కుమార్తె. ఆమె అయిదుసార్లు ఎంపీగా పని చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అలాగే 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరి మీరా కుమార్ దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. ఆమె1985లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. కాగా యూపీఏ హయాంలో ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతిగా పని చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ కూడా ‘రాష్ట్రపతి’గా దళిత వ్యక్తినేనా?
న్యూఢిల్లీ: దెబ్బకు దెబ్బ అన్నట్లు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి ఝలకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరుపున దళిత వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వ్యక్తినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో కేంద్ర హోమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే, లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీరాకుమార్‌లలో ఎవరినో ఒకరిని అధ్యక్ష అభ్యర్థిగా కాంగ్రెస్ తెరమీదకు తీసుకురావాలనుకుంటుందట. దీనిపై జూన్ 22న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. షిండేను ముందుకు తెస్తే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినందున తమకు శివసేన మద్దతు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, స్పీకర్ మీరాకుమార్ను తెరమీదకు తెస్తే బిహార్‌లోని జేడీయూ మద్దతు లభిస్తుందని భావిస్తోందట. ఇదిలా ఉండగా, ఈ విషయంపై తనకు అసలు సమాచారమే లేదంటూ షిండే కొట్టి పారేశారు. అసలు ఇలాంటిది అసాధ్యం అని, ఆ ప్రశ్నే లేదని అన్నారు. -
వర్గీకరణకు నా వంతు కృషి చేశా: మీరా కుమార్
యూపీఏ హయంలో ఎస్సీ వర్గీకరణకు తన వంతు కృషి చేశానని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు వర్గీకరణ సాధ్యం కాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన 17వ రోజు ఆందోళనలో మీరా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని, వెనుకబాటు తనాన్ని గమనించి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించానని ఆమె పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని, అలా అందని పక్షంలో రిజర్వేషన్ల పంపిణీ ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని భావించానన్నారు. వర్గీకరణను సమర్థించే విధంగా జాతీయ స్థాయిలో నియమించిన ఉషామెహ్ర కమిషన్ నివేదిక ఉందని పేర్కొన్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మీరా కుమార్ డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ప్రతిపక్షాల నుంచి.. జీఎస్టీకి మించిన మద్దతు లభిస్తుందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆందోళనలో సఫాయి కర్మచారులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకర ణపై మీరా కుమార్‌ది ద్వంద్వ వైఖరి ఎస్సీ వర్గీకరణ విషయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాల మహానాడు మండిపడింది. బీహార్‌లో ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న మీరా కుమారీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్గీకరణకు మద్దతు ఇవ్వడమే అందుకు నిదర్శనమని సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. మీరా కుమారి సొంత రాష్ట్రంలో మాత్రం దళితులు కలసి ఉండాలి.. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం విడిపోవాలా అన్ని ఆయన ప్రశ్నించారు. ఆధిపత్య కుల నేతలు దళితులను రాజకీయ చదరంగంలో కేవలం పావులుగా వాడుకుంటున్నారని మండిడ్డారు. అలాంటి వారి రాజకీయాలను చైతన్యంతో ఎదరుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద మాలమహానాడు చేపట్టిన ఆందోళన గురువారం 15వ రోజుకు చేరుకుంది. -
వరంగలో ప్రచారం చేయనున్న మీరాజుమార్
-
మళ్లీ మహిళకే పట్టం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ఎనిమిదోసారిగా ఎంపీగా ఎన్నికైన 71 ఏళ్ల మహాజన్ పేరును.. స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ బలపరిచారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఇలాంటివే మరో 13 తీర్మానాలను ప్రతిపాదించాయి. ప్రతిపక్షాలు కూడా మహాజన్‌కు మద్దతు తెలపడంతో ప్రోటెం స్పీకర్ కమల్‌నాథ్ మూజువాణి ఓటుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రధాని, అద్వానీ, వెంకయ్యనాయుడు, అనంత్ గీతే(శివసేన), ఎం.తంబిదురై(అన్నా డీఎంకే)లతోపాటు విపక్ష నేతలు మల్లిఖార్జున ఖర్గే(కాంగ్రెస్), ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), సుదీప్ బందోపాధ్యాయ(తృణమూల్కాంగ్రెస్)లు మహాజన్‌ను స్వయంగా స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. సభ తనకు గురుతరమైన బాధ్యతలు అప్పగించిందని, రాగద్వేషాలకు అతీతంగా సభ్యులందరికీ న్యాయం చేస్తానని స్పీకర్ స్థానంలో కూర్చున్న మహాజన్ చెప్పారు. పేరులోనే మిత్రత్వం ఉంది: అనంతరం ప్రధాని మోడీ సహా పలువురు నేతలు మహాజన్‌ను అభినందిస్తూ సభలో ప్రసంగించారు. పోటీ లేకుండా స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టినందుకు అన్ని పార్టీలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సుమిత్ర పేరులోనే మిత్రత్వం ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేవాలయంలాంటి చట్టసభ ఒక మహిళ ఆధ్వర్యంలో నడవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఆమె నేతృత్వంలో సభ సజావుగా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సభ సాగేందుకు స్పీకర్‌కు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ‘‘ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యురాలిగా ప్రజాజీవితం ప్రారంభించిన మహాజన్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఎనిమిదోసారి ఎంపీగా గెలిచారు. ఎన్నడూ లేని విధంగా ఈ 16వ లోక్‌సభలో ఏకంగా 315 మంది ఎంపీలు మొదటిసారి గెలిచినవారే ఉన్నారు. ఈ కొత్త రక్తం, కొత్త ఆకాంక్షలను మన మహోన్నతమైన సంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్లాలి’’ అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ‘మహాజనో యేన గతస్య పంథా’ (గొప్పవాళ్ల అడుగుజాడల్లో నడవాలి) అంటూ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు. ‘మహాజన్’లాంటి గొప్పవారు ఈ సభను నడిపితే అంతకన్నా మనకేం కావాలి..? అని అన్నారు. అనంతరం సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. స్పీకర్ సభలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘‘మీరు అందరినీ సంతృప్తిపర్చలేరని తెలుసు. కానీ ఒక పెద్దక్క తరహాలో పార్టీలు చిన్నవైనా, పెద్దవైనా వాటి ప్రయోజనాలను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. మన్మోహన్ అభినందనలు: స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమెకు ఒక లేఖ పంపారు. సుమిత్ర అపార అనుభవం సభకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష హోదా’పై ఆచితూచి... కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కల్పిస్తారా లేదా అన్న అంశంపై కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఆచితూచి స్పందించారు. ‘‘దీనిపై చర్చించాల్సి ఉంది. గతంలో ఉన్న సంప్రదాయాలను ఓసారి పరిశీలించాలి. కొంత అధ్యయనం చేయాలి. తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆమె చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్దిపాటి సమయమే ఉన్నందున ప్రస్తుత సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోకపోవచ్చని తెలిపా రు. రానున్న బడ్జెట్ సమావేశాలపై మాట్లాడుతూ.. జూలై 28 కల్లా బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సి ఉన్నందున అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంద న్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తావించ గా..‘ఒక మహిళను అయి ఉండి నేను మహిళలను ఎలా మర్చిపోతాను’ అన్నారు. కాగా, అన్ని పార్టీల మధ్య సమన్వ యం సాధించి, సభ సజావుగా సాగేందుకే కృషి చేయడమే తన తొ లి ప్రాధాన్యమని పీటీఐ ఇంటర్వ్యూలో సుమిత్ర చెప్పారు. మౌలంకర్ను మరిపించండి కొత్త స్పీకర్‌కు మన ఎంపీల అభినందనలు న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు శుక్రవారం అభినందనలు తెలిపారు. లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మౌలంకర్ మాదిరిగా ఆమె పేరు కూడా కలకాలం నిలిచిపోవాలని టీడీపీ నేత, పౌర విమానయాన మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. సుమిత్రకు వైఎస్సార్సీపీ తరఫున, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నట్టు వైఎస్సార్సీపీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తన హుందాతనం, ఓర్పుతో సభను ఫలప్రదంగా, నిష్పాక్షికంగా నడపగలరని ఆశాభావం వెలిబుచ్చారు. తమ పార్టీ సభ్యులంతా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఐదు రోజుల వయసున్న తెలంగాణను చంటిపాపలా చూడాలని టీఆర్ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ తరఫున ఆమెకు అభినందనలు అందజేశారు. కమలం గుర్తున్న బీజేపీ తరఫున గెలిచిన సుమిత్ర, నీటిలోనే ఉన్నా ఆ తడిని తనకు అంటనివ్వని కమలంలా వ్యవహరిస్తారని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వెలిబుచ్చారు. -
లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఓటమి
పాట్నా: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఓటమి పాలయ్యారు. బీహార్‌లోని సాసరన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేది పాశ్వాన్ చేతిలో 61 వేల ఓట్ల మెజారిటీతో పరాజయం పాలయ్యారు. జేడీ(యూ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పాశ్వాన్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేశారు. సాసరన్ నియోజకవర్గం నుంచి 2004, 2009లో మీరాకుమార్ గెలుపొందారు. -
ఓటేయలేకపోయిన మీరాకుమార్
ససారాం(బీహార్): సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఆమెకు ఢిల్లీలో ఓటు ఉంది. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీ చిరుమానాతో ఆమె పేరు ఓటర్ల జాబితాలో నమోదైంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మీరాకుమార్ పోటీ చేస్తున్న బీహార్‌లోని ససారాం లోక్‌సభ నియోజకవర్గానికి గురువారమే పోలింగ్ జరిగింది. మరోవైపు ఢిల్లీలోనూ ఇదేరోజున పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ససారాంలో పోలింగ్ సరళిని పర్యవేక్షించడంలో ఆమె పూర్తిగా నిమగ్నమయ్యారు. తాను పోటీ చేస్తున్న ససారాంలో పోలింగ్‌ను పర్యవేక్షించడంలో పూర్తిగా బిజీగా ఉన్నందునే స్పీకర్ ఢిల్లీ వెళ్లలేకపోయారని ఇక్కడి ఆమె ఎన్నికల కార్యాలయ వర్గాలు వివరించాయి. -
మీరాకుమార్‌కు ఎదురుగాలి
పాట్నా: హ్యట్రిక్ విజయం సాధించాలని పోరాడుతున్న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌కు ఎదురుగాలి వీస్తోంది. తాజా ఎన్నికల్లో ఆమె విజయం నల్లేరుపై నడక కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీహార్‌లోని ససరమ్ లోక్‌సభ నియోజవర్గం నుంచి మీరా మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు. బీజేపీ తరపున చెడి పాశ్వాన్, జేడీయూ నుంచి మాజీ బ్యూరోక్రాట్ కే పీ రామయ్య బరిలో నిలిచారు. కాగా రామయ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఆయన బీహార్ కేడెర్ ఐఏఎస్ అధికారి. గత ఫిబ్రవరిలో సర్వీస్ నుంచి స్వచ్చందంగా వైదొలిగి జేడీయూలో చేరారు. మాజీ ఉప ప్రధాని, దళిత నేత జగ్జీవన్ రామ్ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసిన మీరా కుమార్ ఉన్నత విద్యావంతురాలు. మాజీ ఐఎఫ్ఎస్ ఉద్యోగిని. జగ్జీవన్ రామ్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ససరమ్ నుంచి రెండు సార్లు నెగ్గారు. -
తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయం: ప్రధాని
న్యూఢిల్లీ: 15వ పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయమని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం వచ్చిందన్నారు. స్పీకర్‌కు, మిగతా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి మహిళా స్పీకర్‌గా తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు స్పీకర్ మీరాకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సభలో మరింత మంది మహిళా సభ్యులు ఉంటే సంతోషంగా ఉండేదన్నారు. వచ్చే సభలో మరింత మంది మహిళా ఎంపీలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ స్పందించిన తీరును స్పీకర్ గుర్తు చేసుకున్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని విపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. -
సస్పెన్షన్ ఎత్తి వేయండి: లగడపాటి, సబ్బం
తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని విజయవాడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను డిమాండ్ చేశారు. శుక్రవారం మీరాకుమార్‌కు ఆ ఇద్దరు ఎంపీలు ఈ మేరకు లేఖలు రాశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్‌సభ వెల్‌లోకి 100 మంది ఎంపీలు దూసుకొస్తే మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు. ఇది పక్షపాత ధోరణి కాదా అని వారు రాసిన లేఖలో స్పీకర్ మీరా కుమార్‌ను ప్రశ్నించారు. -
పార్లమెంట్లో ఎంపీల తీరుపై విచారణ కమిటీ
లోక్‌సభలో గురువారం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణకు స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం సెక్యూరిటీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. సెక్యూరిటీ కమిటీ సోమవారం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్‌సభ సభ్యులలో కొందరు బిల్లు తీసుకువచ్చిన ప్రాంతానికి చేరుకుని, బిల్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది లోక్‌సభ సభ్యులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఘర్షణ వాతావరణం నేలకొంది. అదే సమయంలో విజయవాడ లోక్‌సభ సభ్యుడు ఎల్ రాజగోపాల్ పెప్పర్ స్ర్పే కొట్టరు. దాంతో పార్లమెంట్లో సభ్యులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో మార్షల్స్ సభలోకి ప్రవేశించి పలువురు ఎంపీలను బలవంతంగా బయటకు తరలించారు. సభలో అమర్యాదగా ప్రవర్తించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆ ఘటనపై కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్ ఆ ఘటనపై విచారణ కోసం డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. -
లోక్‌సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ : సభలో ఆందోళన చేస్తున్నారంటూ 16 మంది ఎంపీలపై స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్.... సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రకటించారు. 374(ఎ) సెక్షన్ కింద వారిని అయిదురోజుల పాటు సస్పెండ్ చేశారు. ఎంపీలను సస్పెండ్ అయిన ఎంపీల వివరాలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ : అనంత వెంకట్రామిరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి రాజగోపాల్ రాయపాటి సాంబశివరావు ఎ.సాయిప్రతాప్ సబ్బం హరి టీడీపీ : శివప్రసాద్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొనకళ్ల నారాయణ నిమ్మల కిష్టప్ప -
ఉభయ సభల్లో హోరెత్తిన సమైక్య నినాదాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయిన కొద్దిసేపట్లోనే వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సంతాపం తెలిపాయి. అనంతరం సభ్యుల గందరగోళం మధ్య లోక్ సభ మొదలైంది. సీమాంధ్ర ప్రాంత సభ్యుల సమైక్య నినాదాలతో సభ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ్యుల నినాదాలు, ఆందోళన మధ్య రాజ్యసభ కూడా వాయిదా మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది. అంతకు ముందు సభ్యులు ఛైర్మన్ వెల్ లోనికి దూసుకు వచ్చి నినాదాలు చేయటంతో హమీద్ అన్సారీ వారించినా ఫలితం లేకపోయింది. దాంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నేటి నుంచి 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 12 రైల్వే బడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అవినీతి నిరోధక బిల్లు, మహిళా రిజర్వేషన్, మతహింస సహా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తోంది. అంతేకాకుండా కీలకమైన తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్సింగ్ తెలిపారు. -
12న రైల్వే బడ్జెట్: స్పికర్ మీరాకుమార్
-
'అవిశ్వాసం' రాకుండా లోక్‌సభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌పాల్ బిల్లును ఆమోదించిన తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాన నోటీసులతో రెండ్రోజులు ముందుగానే సమావేశాలను కేంద్రం ముగించింది. సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఈ రోజు ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని సీమాంధ్ర ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైఎస్జగన్ సహా ఎంపీల ఆందోళన చేపట్టారు. అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ నోటీసు ఇచ్చింది. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస నోటీసులను సభలో స్పీకర్ ప్రస్తావించారు. ఈ రోజు రెండు అవిశ్వాస తీర్మాన నోటీసులందాయని కూడా తెలిపారు. సభ నిర్వహణకు సహకరిస్తే నోటీసులను పరిగణలోకి తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. అయితే చర్చకు మాత్రం అనుమతివ్వలేదు. దీంతో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన కొనసాగించారు. సభ జరిగే అవకాశం లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. తమకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గుతుందన్న భయంతోనే లోక్‌సభ సమావేశాలను కేంద్రం వాయిదా వేయిందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాస తీర్మాన నోటీసులను స్వీకరించిన స్పీకర్- దీనిపై సభలో చర్చకు అనుమతించకపోవడం తమ ఆరోపణలకు బలాన్నిస్తోందని వారంటున్నారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలు ముందుగా జాతీయ గీతాలాపనతో ప్రారంభం అయ్యాయి. అనంతరం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్....మయన్మార్ పార్లమెంటరీ బృందానికి ఆహ్వానించారు. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం స్పీకర్ మీరాకుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. -
వైఎస్ జగన్ రాజీనామాను ఎందుకు తిరస్కరించారు?
-
వైఎస్ జగన్ రాజీనామాను ఎందుకు తిరస్కరించారు?
ఏకారణం తెలుపకుండా రాజీనామాలను తిరస్కరించడంపై ప్రభుత్వ లాయర్ ను ఢిల్లీకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీకే జైన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లు రాజీనామాలు సమర్పించారు. ముగ్గురు సమర్పించిన రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని లాయర్ ను జైన్ ప్రశ్నించారు. రాజీనామాలను ఆమోదించకపోవడంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వం న్యాయవాది అదనపు సొలిసీటర్ జనరల్ మేరా బదులిచ్చారు. ముగ్గురు ఎంపీలు వ్యక్తిగతంగా స్పీకర్ మీరాకుమార్ ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించమని కోరాలని న్యాయమూర్తి సూచించారు. రాజీనామాలు ఆమోదించకుంటే ఎంపీలకు వేరే మార్గం లేదనుకుంటున్నారా? ప్రభుత్వ న్యాయవాదిపై జస్టిస్ వి.కే జైన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పిటిషన్ పై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్యం కాదని స్పీకర్ అభిప్రాయపడినట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. తిరస్కరణకు గురైన రాజీనామాలలో కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమర్పించిన రాజీనామాలున్నాయి. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడ్డాక గత ఆగస్టు 2-15 తేదీల మధ్య వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్‌ను కలిసి, మరికొందరు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన 13 మంది ఎంపీల్లో ఏడుగురు- ఉండవల్లి, లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి గత నెలాఖరులో స్వయంగా స్పీకర్ విచారణకు కూడా హాజరై రాజీనామాల్ని ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన మిగిలిన ఆరుగురు సభ్యులను కూడా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరినప్పటికీ గత కొద్ది రోజుల్లో టెలిఫోన్లో వారిని కూడా సంప్రదించిన తర్వాతే మొత్తం రాజీనామాలన్నింటినీ తిరస్కరించాలని స్పీకర్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏ కారణమూ చెప్పకపోతే ఆమోదించవచ్చు గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు సమర్పించిన రాజీనామాలను కూడా ఇదే కారణంతో తిరస్కరించడం గమనార్హం. లోక్‌సభ సభ్యులెవరైనా తన సభ్యత్వాన్ని వదులుకోదలుచుకొన్నట్లు తెలియజేస్తూ తమ సొంత దస్తూరితో సమర్పించే రాజీనామా లేఖలో రాజీనామాకు ఎలాంటి కారణాలను పేర్కొనకుండా ఉంటేనే దానిని స్పీకర్ ఆమోదించవచ్చునని లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 204 నిబంధన నిర్దేశిస్తోంది. రాజీనామా చేసిన సభ్యుడు స్వచ్ఛందంగా, ఎలాంటి ఇతరేతర కారణం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌కు స్వయంగా తెలియజేయాల్సి ఉంటుందని, అందుకు విరుద్ధమైన సమాచారమేదీ స్పీకర్ దృష్టికి రాకపోతే రాజీనామాను వెంటనే ఆమోదించవచ్చునని ఈ నిబంధన పేర్కొంటున్నది. సభ్యుని రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై లోక్‌సభ తన సొంత మార్గాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3) కల్పిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాల నేతలు చేసిన ప్రకటనలు, పదవులు వదులుకోవాలని ఎంపీలపై ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. రెండు నెలల తర్వాత నిర్ణయం దాదాపు రెండు నెలలుగా సీమాంధ్ర ఎంపీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానబెట్టిన స్పీకర్ మీరాకుమార్ ఇటీవలి కాలంలో రాజీనామాల ఆమోదానికి కొందరు చేస్తున్న ఒత్తిడికి తోడు తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుగనుండటంతో శుక్రవారం తుదినిర్ణయం తీసుకుని రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులందరికీ సమాచారం పంపించారని తెలిసింది. రాజీనామాలను తిరస్కరించినట్లు సంబంధిత సభ్యులకు తెలియజేసినందున స్పీకర్ నిర్ణయాన్ని పార్లమెంటరీ బులెటిన్‌లో ప్రచురించాల్సిన అవసరం ఉండదని, రాజీనామా ఆమోదం పొందిన సందర్భాలలోనే లోక్‌సభ సమాచార పత్రం (బులెటిన్)లో ప్రచురించి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో ప్రకటించాల్సి ఉంటుందని లోక్‌సభ సచివాలయ వర్గాలు స్పష్టంచేశాయి. రాజీనామాల ఆమోదానికి కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్ సీపీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వం రాజీనామా ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. జగన్‌తో పాటు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలు పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ తిరస్కరించటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్పీకర్ ఫార్మాట్లో వై.ఎస్.జగన్ పంపిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి జగన్‌కు ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డితో పాటు, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్.పి.వై.రెడ్డిల రాజీనామాలను ఆమోదింపచేసుకునే దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. మరోమారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్లో చేసిన తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడం బాధాకరమని ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. తమ రాజీనామాలను తిరస్కరించిన ట్లు శుక్రవారం స్పీకర్ ప్రకటించిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో ఉద్యమం మొదలవడానికి ముందే తాము పదవులకు రాజీనామా చేశామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పీకర్‌ను కలిసి స్పష్టంగా విన్నవించినప్పటికీ.. ఆమె తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాజీనామాలను తిరస్కరించారని ఆయన చెప్పారు. అయితే మరోమారు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేస్తామని, అప్పటికీ ఆమోదించకుంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని సాయిప్రతాప్ స్పష్టం చేశారు. రాజీనామాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. త్వరలో ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. విభజనవల్ల రాయలసీమకు సాగునీరు, ఉపాధి రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
13 మంది ఎంపీల రాజీనామాల తిరస్కరణ
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు. వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగడపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు. స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్మోహన్రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు. -
లగడపాటికి అపాయింట్మెంట్ ఇవ్వని స్పీకర్
న్యూఢిల్లీ : రాజీమానా ఆమోదం కోసం విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. లగడపాటి గురువారం స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,లోక్‌సభ సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా ఆమోదించకపోతే నిరసనకు దిగుతానని లగడపాటి ....లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు తెలిపినట్లు సమాచారం. గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ ...మీరాకుమార్ ను కలిసేందుకు ప్రయత్నించగా.... అప్పట్లో ఆమె అందుబాటులో లేరు. -
స్పీకర్ మీరాకుమార్ను కలిసిన YSRCP ఎంపీలు
-
మా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరా: మేకపాటి
తన రాజీనామతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాను కూడా ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కోరానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. శనివారం మీరాకుమార్ను కలిసిన అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ... తమ ఇద్దరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని అశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిన్న న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మేకపాటి ఆరోపించారు. సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె హైదరాబాద్ తిరిగి వెళ్లారని మేకపాటి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో పూచికపుల్ల దొరికినా తెలుగుదేశం పార్టీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని మేకపాటి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల మహా ప్రవాహాంలో టీడీపీ కొట్టుకుపోతుందన్నారు. -
రాజీనామాల ఆమోదం స్పీకర్ నైతిక బాధ్యత
రాజీనామాలపై స్పీకర్ ఈరోజే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శనివారం మధ్యాహ్నం స్పీకర్ మీరాకుమార్ను విడివిడిగా ఆమె ఛాంబర్లో కలిసి, తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ప్రజల కోరిక మేరకే తాము రాజీనామాలు చేస్తున్నామని, సీమాంధ్రుల మనోభావాలు అధిష్ఠానం దృష్టికి తెచ్చామని చెప్పారు. రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని ప్రజలు చెప్పబట్టే వాటి ఆమోదానికి వచ్చామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని అందరూ వ్యక్తిగతంగా చెప్పామని, వాటిని ఆమోదించడం స్పీకర్ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. సాధారణంగా స్పీకర్ శని, ఆదివారాల్లో పార్లమెంటుకు రారని, కానీ తమ ఒత్తిడి మేరకు ఆమె వచ్చి.. తమ నలుగురితో మాట్లాడారని సాయిప్రతాప్ చెప్పారు. తాము ఎంతమంది, ఎవరెవరు వచ్చామో కూడా టిక్ పెట్టుకున్నారని, గతంలోనే చేసిన రాజీనామాలు ఆమోదించాలని మరోతూరి కోరామని ఆయన అన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని, మా కర్తవ్యాన్ని స్పీకర్ ముందు చెప్పామని అన్నారు. ఇదే సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ''స్పీకర్‌ను వ్యక్తిగతంగా చాంబర్లో కలిశాం. ఆగస్టు 2న రాజీనామాలు చేశాం. గతంలోనూ ఓసారి చెప్పాం. ఇప్పటికి 57 రోజులైపోయింది, అయినా సమాధానం లేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని కోరాం. రాతపూర్వకంగా మరోసారి ఇచ్చాం. సాయంత్రంలోగా ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెబుతాం'' అని అన్నారు. ఎంపీలు రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని ఉద్యమిస్తున్న ప్రజలు చెప్పడంతో తాము ఆలోచించుకుని.. ఆమోదానికి పట్టుబట్టామని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సాయంత్రానికి లెక్కలన్నీ తేలిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం యథార్థ పరిస్థితిని చెప్పారని, ఈ రాష్ట్రాన్ని విడదీయాలనే ప్రయత్నంలో ఎన్ని చిక్కుముడులున్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విశ్లేషించారని అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే, సీమాంధ్రులు పట్టుకుని వదలట్లేదన్న అపోహ సరికాదని, రాజధాని అక్కడే ఉంది. విడదీయలేనంత బలమైన లింకులున్నాయని, అందుకే సమైక్యంగా ఉండాలంటున్నామని ఆయన చెప్పారు. -
నేడు స్పీకర్‌ను కలవనున్న సీమాంధ్ర ఎంపీలు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ను శనివారం మధ్యాహ్నం కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచేందుకు గతంలోనే తమ పదవులకు రాజీనామా చేసిన వీరంతా స్పీకర్‌ను కలిసి వాటి ఆమోదం కోసం ఆమెను కోరనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డిని మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురికి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కబురొచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, అనంత వెంకట్రామిరెడ్డిలతో పాటు.. శుక్రవారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. -
లోక్‌సభ స్పికర్‌ను కలవనున్న సీమాంధ్ర ఎంపీలు
-
రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు: లగడపాటి
తాము తీసుకున్న రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పాట్నా పర్యటనకు వెళ్లడం వల్ల తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోలేక పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామాలు వద్దంటున్న సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏం చేయాలో చెప్పాలని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం సీమాంధ్ర ప్రాంతానికి చెందన కొంత మంది ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధ పడ్డారు. అయితే ముందుగా రాజీనామాలు చేయడం సరికాదని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో హితబోధ చేశారు. అంతేకాకుండా అవసరమైతే అందరం కలసి రాజీనామాలు చేద్దామని సీఎం కిరణ్‌తో మంగళవారం భేటీ అయిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో పేర్కొన్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలో అనంత వెంకటరామిరెడ్డిపై విధంగా స్పందించారు. -
ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు రేపు స్పీకర్ అపాయింట్మెంట్
-
ఏడుగురు సీమాంధ్ర ఎంపీలకు రేపు స్పీకర్ అపాయింట్మెంట్
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఏడుగురికి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నాటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ గతంలోనే ఈ ఏడుగురు ఎంపీలు స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు ఆ ఏడుగురు ఎంపీలకూ స్పీకర్ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖలు రాశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో పాటు.. ఎంపీలు రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా గట్టిగా వస్తుండటంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలు తమ పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. ఇప్పటివరకు ఎనిమిది రాజీనామాలు వచ్చాయని, వాటిని పార్లమెంటు సచివాలయం పరిశీలిస్తోందని వెల్లడించారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్ గీసిన చిత్రాల ప్రదర్శన శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనకు హాజరైన మీరాకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంపీల రాజీనామాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, అయితే ఇందుకు ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. ఈ అంశంలో ఎంపీలను వ్యక్తిగ తంగా పిలిపించి మాట్లాడవచ్చని, లేకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభలో సభ్యుల ఆందోళనల కారణంగా సభకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని తాను అన్ని పార్టీల నేతలనూ కోరుతున్నానని వివరించారు. ‘పెజెంట్స్ ఆఫ్ ది రాజ్ - ది వర్క్‌ఫోర్స్’ పేరిట స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన ఏర్పాటు చేసిన ప్రదర్శనకు రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రసాదకుమార్, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, హర్షకుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి. హనుమంతరావు, సుబ్బిరామిరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, కనుమూరి బాపిరాజు, సీఎం.రమేశ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జ్యోతిష్య నిపుణుడు దైవజ్ఞశర్మ తదితరులు హాజరయ్యారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా దేవాంగన గీసిన అప్పటి కార్మికులు, కూలీలు, సేవకులు, వివిధ వృత్తికారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. నో కామెంట్స్ ఆన్ పాలిటిక్స్ : జైపాల్ రాజకీయాలపై తాను ఏమీ మాట్లాడనని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. దేవాంగన పెయింటింగ్స్ బాగున్నాయని ప్రశంసించారు. భద్రాచలం గురించి మాట్లాడితే.... ప్రదర్శనకు హాజరైన ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఎంపీ రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘భద్రాచలంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో భవిష్యత్తులోనూ అక్కడే ఉంటుంది. ఖమ్మం జిల్లాలో భాగంగా ఉంటుంది. దానిని మాకు కావాలి అని అంటే ముందు నాతో కొట్లాడాల్సి వస్తుంది’ అని అన్నారు. తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడి ఉన్నానని, ఈ మేరకు ఆంటోనీ కమిటీకి నివేదిక ఇస్తానని ఆమె చెప్పారు. రెండు రాష్ట్రాలైనా ఇలానే కలిసుంటాం: ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ కుమార్తె చిత్ర ప్రదర్శనకు హాజరైన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. కేంద్రమంత్రి కావూరి, ఎంపీలు గుత్తా, హర్షకుమార్, కోమటిరెడ్డిలతో పాటు డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు సరదాగా మాట్లాడుకున్నారు. ‘రెండు రాష్ట్రాలు ఏర్పడినా మేమంతా ఇలానే కలిసి ఉంటాం’ అని గుత్తా అనడంతో అందరూ నవ్వులు చిందించారు. టీటీడీ చైర్మన్ బాపిరాజు స్పీకర్ మీరాకుమార్‌కు తిరుపతి ప్రసాదాన్ని అందజేశారు.