తాము తీసుకున్న రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్ పాట్నా పర్యటనకు వెళ్లడం వల్ల తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోలేక పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామాలు వద్దంటున్న సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏం చేయాలో చెప్పాలని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు ఉదయం సీమాంధ్ర ప్రాంతానికి చెందన కొంత మంది ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధ పడ్డారు. అయితే ముందుగా రాజీనామాలు చేయడం సరికాదని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో హితబోధ చేశారు. అంతేకాకుండా అవసరమైతే అందరం కలసి రాజీనామాలు చేద్దామని సీఎం కిరణ్తో మంగళవారం భేటీ అయిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో పేర్కొన్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలో అనంత వెంకటరామిరెడ్డిపై విధంగా స్పందించారు.