ఢిల్లీ: సీమాంధ్ర ప్రజల ఆందోళలను రాజకీయ పార్టీలన్నీ గుర్తించాయని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అందుకే ఎంపీ సస్పెన్షన్‌ను పార్టీలన్నీ వ్యతిరేకించాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాము చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆందోళనపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఇది వరకూ చేసిన పార్టీల నిర్ణయాన్ని పునరాలోచించాలని వెంకట్రామి రెడ్డి కాంగ్రెస్‌కు విన్నవించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ చేసిన తెలంగాణ రాష్ట్ర తీర్మాన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
గత కొన్ని రోజులుగా సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. సకలం సమ్మె బాట పట్టడంతో నేతలు కూడా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడటంతో ఉద్యమ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.