అవపరమైతే పార్టీని వీడతాం: లగడపాటి
విజయవాడ: తెలంగాణపై యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. సీమాంధ్ర ఉద్యమ నేపధ్యంలో లగడపాటి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల24వ తేదీన తమ రాజీనామాలను ఖచ్చితంగా ఆమోదింపచేసుకుంటామని ఆయన తెలిపారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లాలో పార్టీ నేతలు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని లగడపాటి తెలిపారు.
హైదరాబాద్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగసభ పెడతామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసి వ్యాఖ్యలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలలో కలకలం రేపాయి. షిండే ప్రకటన అనంతరం సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలకు సిద్ధసడిన సంగతి తెలిసిందే.