పాట్నా: హ్యట్రిక్ విజయం సాధించాలని పోరాడుతున్న లోక్సభ స్పీకర్ మీరా కుమార్కు ఎదురుగాలి వీస్తోంది. తాజా ఎన్నికల్లో ఆమె విజయం నల్లేరుపై నడక కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీహార్లోని ససరమ్ లోక్సభ నియోజవర్గం నుంచి మీరా మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు.
బీజేపీ తరపున చెడి పాశ్వాన్, జేడీయూ నుంచి మాజీ బ్యూరోక్రాట్ కే పీ రామయ్య బరిలో నిలిచారు. కాగా రామయ్య ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. ఆయన బీహార్ కేడెర్ ఐఏఎస్ అధికారి. గత ఫిబ్రవరిలో సర్వీస్ నుంచి స్వచ్చందంగా వైదొలిగి జేడీయూలో చేరారు. మాజీ ఉప ప్రధాని, దళిత నేత జగ్జీవన్ రామ్ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసిన మీరా కుమార్ ఉన్నత విద్యావంతురాలు. మాజీ ఐఎఫ్ఎస్ ఉద్యోగిని. జగ్జీవన్ రామ్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ససరమ్ నుంచి రెండు సార్లు నెగ్గారు.
మీరాకుమార్కు ఎదురుగాలి
Published Tue, Apr 8 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement