సాక్షి, పాట్నా: త్వరలో జరగనున్న బీహార్‌లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో మహాఘటబంధన్ కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ), లెఫ్ట్ పార్టీలు పోత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే, లోక్‌సభ సీట్లను కేటాయించినట్లుగా అసెంబ్లీ స్థానాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం లేదని, ఫలితంగా నేతల మధ‍్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ నియోజవర్గాలైన ఔరంగాబాద్, బెగుసరాయ్, కతిహార్, పూర్ణియా, శివన్ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఔరంగాబాద్‌తో పాటు బెగుసరాయ్ సీటులోనూ కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య వివాదం నెలకొంది. ఇటీవల సీపీఐ సీట్ల కేటాయింపులో కూటమిలోని పార్టీ పెద్దల్ని సంప్రదించ కుండానే ఔరంగాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అవదేశ్ రాయ్‌ను ప్రకటించింది.
శివన్ బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అవద్ బిహారీ చౌదరికి టికెట్ ఇవ్వాలని లాలూ ప్రసాద్ ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. సీపీఐ, సీపీఐ(ఎంఎల్)లు కూడా శివన్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కతిహార్ నియోజకవర్గం నుంచి తారిఖ్ అన్వర్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. అదే సీటు తమకే కావాలంటూ ఆర్జేడీ పట్టుబడుతుంది. దీంతో అసెంబ్లీ సీట్ల కోసం అయా పార్టీల నేతల సిగపట్లతో కార్యకర్తలు విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment