Sasaram
-
ప్లాట్ ఫామ్ మీది సదువులు!.. కలెక్టర్ చెప్పిన కథ ఇది
వనరులు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం. పైపెచ్చు ‘సొసైటీ మనకేం ఇచ్చింద’ని భారీ డైలాగులు సంధిస్తూ నిందిస్తుంటాం. కానీ, అవసరం మనిషికి ఎంతదాకా అయినా తీసుకుపోతుంది కదా!. పేదరికానికి తోడు అక్కడి పరిస్థితులు.. యువతను రైల్వే స్టేషన్ బాట పట్టించాయి. కొన్నేళ్లుగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న రైల్వే ప్లాట్ ఫామ్స్ కథ మీలో ఎంతమందికి తెలుసు?.. అదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అనగనగనగా.. బిహార్‌లోని సాసారాం రైల్వే జంక్షన్. రోజు పొద్దుపొద్దునే.. సాయంత్రం పూట వందల మంది యువతీయువకులు ఇక్కడి రైల్వేస్టేషన్‌కు క్యూ కడుతుంటారు. 1, 2 రైల్వే ప్లాట్‌ఫామ్స్ మీద వాళ్ల హడావిడితో కోలాహలం నెలకొంటుంది కాసేపు. అలాగని వాళ్లు ప్రయాణాల కోసం రావట్లేదు. కాసేపటికే అంతా గప్ చుప్. బిజీగా చదువులో మునిగిపోతారు వాళ్లు. వీళ్లలో బ్యాంకింగ్స్ పరీక్షలకు కొందరు, స్టేట్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు మరికొందరు, సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇంకొందరు సిద్ధమవుతూ కనిపిస్తుంటారు. కొందరి కష్టానికి అదృష్టం తోడై జాబ్‌లు కొడుతుండగా.. సీనియర్ల నుంచి విలువైన సలహాలు అందుకునేందుకు వచ్చే జూనియర్ల సంఖ్య పోనుపోనూ పెరుగుతూ వస్తోంది. కరెంట్ సమస్యే.. రోహతాస్ జిల్లాలో పేదరికం ఎక్కువ. మూడు పూటల తిండే దొరకడం కష్టమంటే.. పిల్లల్ని కోచింగ్‌లకు పంపించే స్తోమత తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తది?. పైగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అది. చాలా గ్రామాలకు కరెంట్ సదుపాయం లేదు. అదే సాసారాం రైల్వే స్టేషన్లో 24/7 కరెంట్ ఉంటుంది. ఈ ఒక్కకారణం వల్లే చుట్టుపక్కల ఉన్న ఊళ్లలోని యువత అంతా అక్కడికి వస్తోంది. 2002-03లో ఐదారుగురు ఫ్రెండ్స్‌తో మొదలైన బ్యాచ్.. ఇప్పుడు వందల మందితో కొనసాగుతోంది. ప్లాట్‌ఫామ్ లైట్ల వెలుతురులో చదివి తమ నసీబ్ మార్చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అక్కడి యువత. విలువైన సలహాలు కొందరైతే ఇంటికి కూడా వెళ్లకుండా చదువుల్లో మునిగిపోతున్నారు. అంతేకాదు వాళ్లలో వాళ్లే పాఠాలు చెప్తూ కనిపిస్తుంటారు అక్కడ. ఇదే ప్లాట్‌ఫామ్ మీద చదివి సక్సెస్ కొట్టిన వాళ్లు సైతం సలహాలు అందించేందుకు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ఆసక్తిని గమనించే ఇక్కడి అధికారులు సైతం అడ్డుచెప్పడం లేదు. పైగా ఐదు వందల ఐడీకార్డులు సైతం జారీ చేసి వాళ్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా కోచింగ్ సెంటర్‌గా నడుస్తున్న.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాసారాం రైల్వే స్టేషన్ కథ. - ఐఏఎస్ అవానిష్ శరణ్ ఛత్తీస్‌గఢ్ కేడర్, 2009 బ్యాచ్ (ట్విటర్ సౌజన్యంతో..) For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a coaching class for young people who are aspirants for the Civil Services. Excellent Initiative.👍👏 Courtesy: Anuradha Prasad ILSS. pic.twitter.com/pLMkEn4AOF — Awanish Sharan (@AwanishSharan) October 2, 2021 చూడండి: ఏటీఎం నుంచి డబ్బులు రాగానే యువతి ఏం చేసిందంటే.. -
రాళ్లు రువ్వి, టైర్లు కాల్చి: కోవిడ్ రూల్స్‌పై విద్యార్థుల కన్నెర్ర
పాట్నా: విద్యాలయాలను మూసివేస్తున్నారు కానీ బహిరంగ సభలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహణపై ఎలాంటి నిషేధం విధించారు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకో రూల్.. మాకో రూలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై మండిపడుతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విద్యార్థులు, పోలీసులకు గాయాలు కాగా, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన బిహార్‌లోని ససారామ్ పట్టణంలో చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ససారామ్‌లోని అధికారులు, పోలీసులు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా గౌరక్షిణి ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు పంపించడంతో అవి మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో చదువులు ఆగిపోయాయని మళ్లీ ఇప్పుడు మూసివేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో ససరామ్‌లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. కోచింగ్ సెంటర్ల మూసివేత ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వెళ్లిపోవాలని విద్యార్థులను ఆదేశించినా వారు వెనుదిరగలేదు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు లేని నిషేధం మాకెందుకు? అని ప్రశ్నించారు. వారి కార్యక్రమాలకు బ్రేక్ వేయరు కానీ మా చదువులకు అడ్డంకి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బలగాలను రప్పించి విద్యార్థుల ఆందోళనను శాంతపర్చారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో 9 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. #Bihar : Violence broke out on the streets of #Sasaram after #students objected to officials closing the coaching centres to enforce #COVID19 measures. New #COVID restrictions in #Bihar government has ordered educational institutions to remain closed until April 11. pic.twitter.com/yAGQTMlZzs — Mojo Story (@themojostory) April 5, 2021 -
రాజకీయాల కోసం 'ఆ ఇద్దరు' ఒక్కటయ్యారు
పాట్నా : జంగిల్ రాజ్ కాదు.. మనకు వికాస్ రాజ్ కావాలని ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ప్రజలకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ససారాం ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... రాజకీయాల కోసం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఒక్కటయ్యారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇన్నాళ్లు నితీష్, లాలూలు ఇద్దరు ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం 'వాళ్లు ఇద్దరు' మీ వద్దకు వస్తే రాష్ట్రానికి ఏం చేశారో నిలదీయండి అంటూ బీహారీ వాసులకు సూచించారు. బీహార్‌లో ఎన్నికల ప్రచార గడవు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు ప్రచారం హోరెత్తింది. బీహార్ రాష్ట్ర శాసన సభకు ఐదు విడుతల్లో పొలింగ్ జరగనుంది. అందులోభాగంగా తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 12న జరగనున్నాయి. -
మీరాకుమార్‌కు ఎదురుగాలి
పాట్నా: హ్యట్రిక్ విజయం సాధించాలని పోరాడుతున్న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌కు ఎదురుగాలి వీస్తోంది. తాజా ఎన్నికల్లో ఆమె విజయం నల్లేరుపై నడక కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీహార్‌లోని ససరమ్ లోక్‌సభ నియోజవర్గం నుంచి మీరా మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు. బీజేపీ తరపున చెడి పాశ్వాన్, జేడీయూ నుంచి మాజీ బ్యూరోక్రాట్ కే పీ రామయ్య బరిలో నిలిచారు. కాగా రామయ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఆయన బీహార్ కేడెర్ ఐఏఎస్ అధికారి. గత ఫిబ్రవరిలో సర్వీస్ నుంచి స్వచ్చందంగా వైదొలిగి జేడీయూలో చేరారు. మాజీ ఉప ప్రధాని, దళిత నేత జగ్జీవన్ రామ్ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసిన మీరా కుమార్ ఉన్నత విద్యావంతురాలు. మాజీ ఐఎఫ్ఎస్ ఉద్యోగిని. జగ్జీవన్ రామ్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ససరమ్ నుంచి రెండు సార్లు నెగ్గారు.