రాజకీయాల కోసం 'ఆ ఇద్దరు' ఒక్కటయ్యారు | Narendra Modi addresses rally in Sasaram, Bihar | Sakshi

రాజకీయాల కోసం 'ఆ ఇద్దరు' ఒక్కటయ్యారు

Published Fri, Oct 9 2015 1:07 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

రాజకీయాల కోసం 'ఆ ఇద్దరు' ఒక్కటయ్యారు - Sakshi

రాజకీయాల కోసం 'ఆ ఇద్దరు' ఒక్కటయ్యారు

జంగిల్ రాజ్ కాదు.. మనకు వికాస్ రాజ్ కావాలని ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ప్రజలకు స్పష్టం చేశారు.

పాట్నా : జంగిల్ రాజ్ కాదు.. మనకు వికాస్ రాజ్ కావాలని ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ప్రజలకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ససారాం ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... రాజకీయాల కోసం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లు ఒక్కటయ్యారని ఆరోపించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ఇన్నాళ్లు నితీష్, లాలూలు ఇద్దరు ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం 'వాళ్లు ఇద్దరు' మీ వద్దకు వస్తే రాష్ట్రానికి ఏం చేశారో నిలదీయండి అంటూ బీహారీ వాసులకు సూచించారు. బీహార్లో ఎన్నికల ప్రచార గడవు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు ప్రచారం హోరెత్తింది. బీహార్ రాష్ట్ర శాసన సభకు ఐదు విడుతల్లో పొలింగ్ జరగనుంది. అందులోభాగంగా తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 12న జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement