హైదరాబాద్: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడతారు. తరువాత బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులు, మీడియా ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.