
నామినేషన్ దాఖలు చేసిన మీరా కుమార్
న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినాయకులతోపాటు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి. కాగా నామినేషన్ వేసేందుకు ముందుగా మీరా కుమార్ ...ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.