నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్‌ | Great Responsibility, Says Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్‌

Published Thu, Jul 20 2017 5:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్‌

నా జీవితం దేశానికి అంకితం: రామ్‌నాథ్‌

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా విజయం సాధించడం తనకు ఉద్విగ్నమైన సమయం అని త్వరలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. తన జీవితం దేశానికి అంకితం అని ఉద్వేగంగా చెప్పారు. గురువారం నాటి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకొని భారత 14వ రాష్ట్రపతిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు.

తన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. మరోపక్క, విజయం సాధించిన రామ్‌నాథ్‌కు ప్రత్యర్థి మీరా కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవిలో విజయవంతంగా రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను ఓటమిని అవమానంగా భావించడం లేదని, ఒక సైద్ధాంతిక పోరాటమే చేశాను తప్ప మరొకటి కాదని అన్నారు. తన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని మున్ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. తనకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement