రాష్ట్రపతి ఎన్నికలు: రేపు మీరాకుమార్ నామినేషన్
- తరలివెళ్లనున్న టీపీసీసీ ముఖ్యనేతలు
- పనిలోపనిగా మియాపూర్ భూకుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు
హైదరాబాద్‌సిటీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్‌సభ సెక్రటరీ కార్యాలయంలో జరుగనున్న కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం తెలంగాణ కాంగ్రెస్ కీలకనేతలంతా ఢిల్లీ వెళ్లనున్నారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, షబ్బీర్ అలీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ అఖిలపక్షం నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మియపూర్ భూముల కుంభకోణంపై ఫిర్యాదుచేయనున్నారు. భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అఖిలపక్షం కోరనుంది.