హైదరాబాద్ : రుణమాఫీలు కోరడం ఫ్యాషన్ అయిపోయిందన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. ఆయన తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ... వెంకయ్య వ్యాఖ్యలతో బీజేపీ రైతు వ్యతిరేకమి తేలిపోయిందన్నారు.
లేదంటే కేసీఆర్ చరిత్రహీనుడే...
తెలంగాణ ఏర్పాటులో మీరాకుమార్ పాత్ర కీలకమని, తెలంగాణ బిల్లు పాస్ కావడంలో స్పీకర్ గా మీరాకుమార్ ఎంతో కృషి చేశారని షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రుణం తీర్చుకోవాలంటే కేసీఆర్, యూపీఏ పక్ష రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు ప్రకటించాలని లేదంటే కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడని పేర్కొన్నారు. ఎన్డీయే మీద కేసీఆర్ కు ఎందుకంత ప్రేమ..? అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లులోని హామీలు ఇవ్వనందుకే మోడీకి మద్దతా..? అని సూటిగా ప్రశ్నించారు. ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లలను వ్యతిరేకించిన బీజేపీకి మద్దతు ఎలా ఇస్తారు.? అని అన్నారు.
వెంకయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి: షబ్బీర్
Published Fri, Jun 23 2017 5:10 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement