కేసీఆర్ అసమర్థత, అనుభవలేమి పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎల్పీ ఉప నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ : కేసీఆర్ అసమర్థత, అనుభవలేమి పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎల్పీ ఉప నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి మండిపడ్డారు. వీరు ఇరువురు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవటం...వడ్డీ వ్యాపారుల బారిన పడటం, తీవ్రమైన విద్యుత్ సంక్షోభం, పంటలు ఎండిపోవటం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు నివారించటానికి కాంగ్రెస్ హయాంలో పలు కార్యాక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. కానీ ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను కేసీఆర్ సర్కార్ ఆదుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 197మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆ రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.