‘కేసీఆర్‌ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’ | how kcr defeat Meira Kumar: VH | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’

Published Thu, Jun 29 2017 8:32 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

‘కేసీఆర్‌ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’ - Sakshi

‘కేసీఆర్‌ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ స్పీకర్‌ హోదాలో ఉండి తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌ను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే సీఎం కేసీఆర్‌ నిర్ణయం దారుణమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు విధేయుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ పోటీలో ఉన్న సమయంలో ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎంఐఎం నేతలైన ఒవైసీ సోదరులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జీఎస్టీపై ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని, జీఎస్టీ అమలైతే చిన్న వ్యాపారులు అడ్డుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ ఒత్తిడి వల్లనే మియాపూర్‌ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ వేయడంలేదని, కేసీఆర్‌ అవినీతికి కేంద్ర ప్రభుత్వం వంత పాడటం దారుణని వీహెచ్‌ అన్నారు. ఈ భూములపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement