మీరా కుమార్‌ ప్రచారం ప్రారంభం | Meira Kumar kicks off presidential campaign in Gujarat | Sakshi
Sakshi News home page

మీరా కుమార్‌ ప్రచారం ప్రారంభం

Published Fri, Jun 30 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

Meira Kumar kicks off presidential campaign in Gujarat

అహ్మదాబాద్‌: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ శుక్రవారం తన ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో మీరా కుమార్‌ చర్ఖా తిప్పారు. 'సబర్మతీ ఆశ్రమం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. ఇక్కడకు వస్తే గొప్ప శక్తి వస్తుంది. అందుకే నేను ఇక్కడకు వస్తుంటాను' అని మీరా కుమార్‌ అన్నారు. బుధవారం నామినేషన్‌ సందర్భంగా.. గాంధీజీ ఆలోచనలు, భావజాలాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం ముందుకు తీసుకెళ్తుందని మీరా కుమార్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆమె పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement