కోల్‌కతా: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతుంటారు. ఇందుకోసం లీడర్లు చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. రానున్న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క ఉన్న ఓ హోటల్‌లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న వారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం మమతా ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్ నుండి జూలై 8 పంచాయతీ ఎన్నికల కోసం.. పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. కాషాయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్‌ఎప్ భయపెడుతోందని, ఈ క్రమంలో వారి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది బీఎస్‌ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు.
వారి బెదిరిపులకు భయపడకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొనాలని ఆమె ప్రజలను పిలుపునిచ్చారు. మూడంచెల గ్రామీణ ఎన్నికలలో తృణమూల్ బీజేపీని ఓడిస్తుందని మమతా నొక్కి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి, దేశంలో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. జూలై 8న ఒకే దశలో ఎన్నికలు జరుగనుండగా, జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
#WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri's Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET
— ANI (@ANI) June 26, 2023
చదవండి: 'సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం' ప్రముఖ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
Comments
Please login to add a commentAdd a comment