
నేనేం బలిపశువును కాదు
రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థి మీరాకుమార్
బెంగళూరు: రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తానేం బలిపశువును కాదని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలను కలుసుకున్న తరువాత మీడియాతో మాట్లాడారు.
జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను కూడా కలుసుకుని తనకు మద్దతివ్వాలని కోరారు. ‘ నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతూ, ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని కోరడం బలిపశువు అయినట్లు కాదు. నా ఈ పోరాటంలో మరింత మంది చేరతారు’ అని అన్నారు. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే విలువలు, సిద్ధాంతాల కోసం పోరాడుతున్నానని చెప్పారు.
అలాంటప్పుడు ఎన్నిక ఎందుకు?:
ఎక్కడికెళ్లినా తనకు తగినంత సంఖ్యా బలం లేదనే మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు నేరుగా ఫలి తాలు ప్రకటించకుండా, ఎన్నిక ఎందుకు నిర్వహిం చడమని మీరా ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక దళి తుల మధ్య పోరు అని భావించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో అగ్ర కులస్తులు పోటీపడినపుడు వారి కులాలు ప్రస్తావనకు రాలేదని, వారి అర్హతలు, సాధించిన విజయాలపైనే చర్చలు జరిగేవని పేర్కొన్నారు.