హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో...ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం ఆమె గాంధీభవన్‌కు చేరుకుంటారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులతో సమావేశమవుతారు. అక్కడే అందరితో కలసి భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.